స్క్రూలతో సిత్రాలు
‘మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాల’ అన్న దివంగత నటుడు రావుగోపాలరావు డైలాగ్ ఈ కళాకారుడికి అతికినట్టు సరిపోతుంది. మార్క్ స్నైడర్ అనే కళాకారుడు వేలాది ఊదారంగు స్క్రూలతో అనేక నిలువెత్తు పోర్ట్రయిట్ చిత్రాల్ని రూపొందించాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే దూరం నుంచి చూస్తే అచ్చు ఫొటోలాగే ఉంటుంది. ఇందుకోసం ఇతగాడేం చేస్తాడో తెలుసా. తొలుత ఓ కలర్ ఫొటోని తీసుకుని అందులోని పిక్సెల్స్ని తొలగిస్తాడు. దీంతో అది ఆటోమేటిగ్గా బ్లాక్ అండ్ వైట్ ఫొటో అయిపోతుంది. దానిని ఆధారంగా చేసుకుని స్క్రూలు పెడతాడు. ఇలా చేయడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని, ఇది తన ఆత్మకు ఔషధంలా పనిచేస్తుందంటాడు మార్క్. అన్నట్టు ఇంకో విషయం. తాను రూపొందించిన చిత్రాలను తన వెబ్సైట్లో ఉంచాడు.