piyush gupta
-
డీబీఎస్లో 4000 ఉద్యోగాలు కట్
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డీబీఎస్ గ్రూప్ కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో వచ్చే మూడేళ్లలో 10 శాతం మేర సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. తమ కార్యకలాపాల్లో ఏఐని మరింత పెద్ద ఎత్తున వినియోగించనున్నట్టు సంస్థ సీఈవో పీయూష్ గుప్తా తెలిపారు. డీబీఎస్ గ్రూప్లో 15 ఏళ్ల తన పదవీ కాలంలో మొదటిసారి ఉద్యోగాల సృష్టి పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఏఐ అన్నది భిన్నమైనదని, గతంలో వచ్చిన మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానం మాదిరి కాదన్నారు. వచ్చే మూడేళ్లలో 4,000 మంది (10 శాతం) సిబ్బంది తగ్గిపోనున్నట్టు తన ప్రస్తుత అంచనాగా చెప్పారు. నాస్కామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘‘ఏఐ ఎంతో శక్తిమంతమైనది. తనను తాను సొంతంగా ఆవిష్కరించుకోగలదు. మరొకరిని అనుసరించగలదు. ఇది ఎంతో భిన్నమైనది. గత పదేళ్లలో గ్రూప్లో ఉద్యోగాల కోత అన్నదే లేదు’’అని గుప్తా ఏఐ రాకతో గ్రూప్ స్థాయిలో చోటుచేసుకోనున్న మార్పులను వివరించారు. డీబీఎస్ గ్రూప్ రెండేళ్ల క్రితమే జెనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేయడం ప్రారంభించిందని, ఇందుకు సంబంధించి పూర్తి ప్రయోజనాలను ఇంకా చవిచూడాల్సి ఉందన్నారు. కస్టమర్లను చేరుకోవడం, క్రెడిట్ అండర్రైటింగ్ (రుణ వితరణ), నియామకాల్లో ఏఐని డీబీఎస్ గ్రూపు అమలు చేస్తోంది. కాంట్రాక్టు సిబ్బందే.. వచ్చే మూడేళ్లలో 4,000 మందితగ్గింపు అన్నది ప్రధానంగా కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బంది రూపంలోనే ఉంటుందని డీబీఎస్ గ్రూప్ వివరణ ఇచ్చింది. సహజంగా కంపెనీ నుంచి వెళ్లిపోయే ఉద్యోగుల రూపంలోనూ సిబ్బంది తగ్గనున్నట్టు తెలిపింది. -
సింగపూర్ తెలుగు ప్రజలకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించిన పీయూష్ గుప్త
సింగపూర్లో నివసించే తెలుగు సమాజం శ్రేయస్సు దృష్ట్యా అందరిలో వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ సమగ్రత పెంపొందిచే విధంగా నవంబర్ 6న STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సింగపూర్ బ్యాంక్ డెవలప్వెంట్ ఆఫ్ సింగపూర్ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పీయూష్ గుప్త హాజరయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వివిధ టెక్నాలజీ అంశాలతో పాటు, భవిష్యత్తులో రానున్న సాంకేతిక పరిణామాలు, దానికి మనందరం ఎలా సిద్ధంగా ఉండాలి వాటి పరిణామాలు, క్రిప్టో & డిజిటల్ కరెన్సీ, ముఖ్యంగా యువతకు మార్గనిర్ధేశం, స్ధిరత్వం, సమతూల్యత, జాతీయ సమగ్రత, గ్లోబర్ వార్మింగ్, సామన్యుల తలసరి ఆదాయం పెంచుకోవడానికి సూచనలు వంటి వివిధ విభిన్న అంశాలతో కూడిన “ఫైర్ సైడ్ చాట్ విత్ పీయూష్ గుప్తా” శీర్షికతో మిస్ యూనివర్స్ సింగపూర్ నందిత బన్నా ముఖాముఖి చక్కగా నిర్వహించారు. తదనంతరం వివిధ అంశాలపై వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు అంతర్దృష్టితో అత్యంత ఆలోచనా భరితంగా పీయూష్ గుప్తా చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని భవిష్య ప్రణాళికను, అవసరాన్ని ప్రారంభోపస్యాసంలో వివరించారు. STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని పీయూష్ గుప్త సమక్షంలో అందరి వీక్షకుల నడుమ లాంచనంగా ఆవిష్కరించారు. సుమారు 20 సంస్ధల సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక అంశాల అవగాహనతో పాటు, జాతీయ సమగ్రతను పెంపొందిచుకొని అంతిమ ప్రయోజనాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమానికి వాఖ్యతగా కార్యదర్శి సత్య చిర్ల వ్యవహరించారు. ప్రతి నెల ఒక్కొక్క సాంకేతిక అంశం యొక్క అవగాహనా కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఒకరికొకరు సహాయం చేసుకొంటూ సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలని, సింగపూర్ తెలుగు సమాజం సహకారం అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా సుమారు 1000 మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించిన పీయూష్ గుప్తాతో పాటు మిగతా అతిధులకు, నందితా బన్నాకు, వివిధ సంస్ధల కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలుగుసమాజం కార్యవర్గానికి, వివిధ మాద్యమాల ద్వారా హాజరైన వారందరికీ కార్యక్రమ నిర్వాహకులు, ఉపాధ్యక్షులు అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ శీర్షికలో డిసెంబర్ 4న సైబర్ సెక్యూరిటీపై పేపాల్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోరమ్ మెహతా, జనవరిలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై లజాడా డేటా అండ్ ఎంటర్పైజ్ ఇంటలిజెన్స్ హెడ్ ముని వినయ్ లతో అవగాహనా కార్యక్రమం ఉంటుందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంపై వీక్షకులు,నిపుణుల నుండి విశేష స్పందన లభించిందని, ఈ కార్యక్రమం తమ నైపుణ్యాలని పెంచుకోవటానికి, తద్వారా కెరీర్ పరంగా ముందుకెళ్లటానికి ఉపయోగపడుతుందని,తదుపరి ప్రోగ్రాం కోసం అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నట్లు సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు. -
మంగుళూరుకీ మల్టినేషనల్ కీ లింకేమిటి?
మీరు మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నారా? అయితే మీకు విశ్వ విఖ్యాత మల్టినేషనల్ కంపెనీకి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అవును. మైక్రోసాఫ్ట్ కి మెగా హెడ్ అయిన సత్య నాదెళ్ల మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నాడు. అన్నీ కలిసొస్తే నోకియా కార్పొరేషన్ కీ మంగుళూరు యూనివర్సిటీ విద్యార్థే కాబోతున్నాడు. నోకియా టెలికామ్ ఎక్విప్ మెంట్ బిజినెస్ కి హెడ్ గా ఉన్న రాజీవ్ సూరి ఈ నెలాఖరుకి గ్లోబల్ హెడ్ గా హాట్ సీట్ లో కూర్చుంటారని తెలుస్తోంది. ఫిన్లండ్ కేంద్రంగా ఉండే రాజీవ్ సూరి మంగుళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. గత చాలా ఏళ్లుగా నోకియాలో పనిచేస్తున్నారు. దీంతో ప్రపంచప్రఖ్యాత మల్టినేషనల్స్ ని ముందుండి నడిపించే మహారథుల్లో మరొక మనోడు చేరాడు. మల్టి నేషనల్స్ పై మనోళ్లదే పెత్తనం మైక్రోసాఫ్ట్ సత్యా నాదెళ్ల పెప్పికో ఇందిరా నూయి రెకెట్ బెంకినేర్ రాకేశ్ కపూర్ మాస్టర్ కార్డ్ అజయ్ బంగా డౌచ్ బ్యాంక్ అంశు జైన్ హార్వర్డ్ కాలేజీ రాకేశ్ ఖురానా డీబీఎస్ గుప్త పీయూష్ గుప్త