1 నుంచి అమర్నాథ్ రిజిస్ట్రేషన్లు
జమ్మూ: జమ్మూ కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఆలయ ముఖ్య నిర్వహణాధికారి పీకే త్రిపాఠి తెలిపారు. దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంకుల్లో ఎంపిక చేసిన 433 బ్రాంచీల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలని సూచించారు.
బాల్తల్, చందన్వారి మార్గాల గుండా జూన్ 29న ప్రారంభమయ్యే యాత్ర ఆగస్టు 7న రాఖీపండుగ నాడు ముగుస్తుందని తెలిపారు. యాత్రికులు పాటించాల్సిన విధివిధానాల వివరాలు ఆలయబోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు.