కార్యాచరణతో సేవలందించండి
ఖరీఫ్ సాగుకు సమాయత్తం
వర్క్‌షాపులో కలెక్టర్ కోనశశిధర్
అనంతపురం అగ్రికల్చర్ : రైతులకు మెరుగైన పారదర్శక సేవలు అందించాలంటే ఖరీఫ్‌నకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక రైతు శిక్షణ కేం ద్రం (ఎఫ్‌టీసీ)లో ఖరీఫ్ కాలానికి సాగుకు సమాయత్తం – కార్యాచరణపై నిర్వహించిన వర్క్‌షాపులో కలెక్టర్ ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మే నుం చి ప్రారంభం కానున్న 2017 ఖరీఫ్‌లో రైతులకు నాణ్య మైన విత్తనాలు అందించడానికి కృషి చేయాలన్నారు. వేరుశనగ పంట విస్తీర్ణాన్ని కొంత వరకు తగ్గించి కనీసం 5 లక్షల ఎకరాల్లో జొన్నలు, రాగి, సజ్జ, కొర్ర లాంటి బహుధాన్యపు పంటల విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. ఇందులో 4 లక్షల ఎకరాలు వ్యవసాయశాఖ, మిగతా ఒక లక్ష ఎకరాల్లో పంట వేయించాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలన్నారు. గత ఏడాది బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ బాగానే చేశామని, ఈ సారి చౌకదుకాణాల ద్వారా విత్తన పంపిణీ సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించాలన్నారు. మూడు నాలుగు నెలల్లో హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లను నింపుతామన్నారు. 2014 ఇ¯ŒSపుట్ సబ్సిడీ పంపిణీ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ–2 ఖాజామొహిద్ధీన్, వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏలు డి.జయచంద్ర, చంద్రానాయక్, ఎం.కృష్ణమూర్తి, ఆత్మ పీడీ డాక్టర్ పి.నాగన్న, డీఐవో రామ్‌ప్రసాదరెడ్డి, ఏఆర్ఎస్, కేవీకే, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు రవీంద్రనాథరెడ్డి, సహదేవరెడ్డి, వై.పద్మలత, పి.లక్షి్మరెడ్డి, జా¯ŒSసుధీర్, సంపత్‌కుమార్, ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ మేనేజర్లు రెడ్డెప్పరెడ్డి, బాల భాస్కర్, పరశురామయ్య, డివిజ¯ŒS ఏడీలు, పాల్గొన్నారు.