Plants supply
-
ఇంటింటికీ మొక్కల పంపిణీ
చింతకొమ్మదిన్నె: స్థానికంగా ఏపీఎస్‌బీబీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం జెడ్పీటీసీ సభ్యుడు పి.నరేన్ రామాంజులరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 12 పంచాయతీల పరిధిలో గల వివిధ గ్రామాలకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మొక్కలు పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్‌రెడ్డి, గంగాదేవి, రమేష్, మండల కన్వీనర్ గూడ ప్రభాకర్‌రెడ్డి, కో–కన్వీనర్ కళాయాదవ్, మండల ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీపై విమర్శలకే మహానాడు పరిమితం ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కేవలం వైఎస్సార్సీపీపై విమర్శలకే పరిమితమైందని జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి అన్నారు. సీకేదిన్నె ఎంపీడీవో కార్యాలయంలోని చాంబర్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గతంలో వాగ్దానాలు ఏవీ నెరవేర్చకపోగా.. ప్రస్తుతం ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నారని తెలిపారు. -
ఆ ఇల్లేఓ బృందావనం
మూసాపేట: ఎటు చూసినా పచ్చదనం పరిచినట్లుగా...రంగు రంగుల పూలు మనసును పులకరింపజేస్తూ... ఎన్నో రకాల, అరుదైన మొక్కలు మనకు స్వాగతం చెబుతాయి. అక్కడికి వెళితేఇంటికి వచ్చామా..?పార్కుకా.. అన్నట్లు ఉంటుంది. రాత్రిళ్లు వికసించే పూల మొక్కలు, ఉదయం 11గంటల వరకు పరిమళం వెదజల్లే పుష్పాలు, పూల సువాసనలతోనే నిద్రలేపే మొక్కలు ఇలా ఎన్నో రకాల మొక్కలు ఆ ఇంటిలో కొలువై ఉన్నాయి. ప్రకృతిపై ప్రేమతో లక్షలు ఖర్చుపెట్టి ఇంటినే మొక్కలపై పరిశోధనలు చేసే ల్యాబ్‌లా మార్చేశాడు మూసాపేటలోని ఆంజనేయనగర్కాలనీకి చెందిన పాండు గౌడ్. వ్యాపారంలో బిజీగా ఉన్నా మొక్కల కోసం రోజూ సమయం కేటాయిస్తున్నాడు. కట్టిపడేస్తున్న పూల మొక్కలు... ఇంటిలోకి అడుగుపెట్టడంతోనే మొక్కల మధ్యలో గణపతి విగ్రహం ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. బాల్కనీలో, ఇంటి ముందు, గోడలకు, గుమ్మాలకు బెడ్రూంలు, కిచెన్, హాల్, వాటర్ ట్యాంక్ పైన ఇలా ఖాళీ స్థలం కన్పించకుండా మొక్కలతో నింపేశాడు. చివరికి బాత్రూంలో కూడా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాడంటే మొక్కలపై అతనికున్న మమకారం అర్థం చేసుకోవచ్చు. రకరకాల రంగుల పుష్పాలు, రాతికి రాణి, మార్నింగ్ గ్లోరి, సన్రైస్, సంక్రాంతి చెట్లు, బోగిన్విలియా, బోస్లే మొక్కలతో పాటు ఔషద, పండ్లు జామ, దానిమ్మ, ఇంటికి అవసరమైన ఆకుకూరలు, పచ్చిమిర్చి ఇలా ఎన్నో రకాల మొక్కలు మనల్ని కట్టిపడేస్తాయి. ఒకసారి ఆ ఇంటికి వెళ్లామంటే అక్కడే ఉండిపోవాలి అని మనస్సు కోరుకుంటుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఇంటి వాతావరణం చూసిన ఎవరైనా మేం కూడా ఇలాగే మొక్కలు పెంచుకోవాలనిస్తుదంటారు. కాంక్రీట్ జంగిల్లో మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి ఉన్నా స్థలం లేదు అన్న వారికి ఆ ఇల్లు ఓ ఆదర్శం. 150 రకాల మొక్కలు, 600 కుండీలలో ఏర్పాటు చేసి వాటి సంరక్షణ చూస్తున్నాడు. మొక్కల ఏర్పాటుకే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశానని చెబుతున్నాడు. కొన్ని రకాల మొక్కలను ఒక్కో మొక్కకు రూ. 5వేల వరకు ఖర్చుపెట్టి కొనుగోలు చేశాడు. కొన్ని సీజన్లో వచ్చే పూలు వచ్చాక వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచుతుంటాడు. చిన్నతనంనుంచే ప్రకృతిపై మమకారం.... పాండుగౌడ్‌కు చిన్నప్పటి నుంచే మొక్కలు, ప్రకృతిపై మమకారం ఎక్కువ. పదవ తరగతి నుంచే ప్రకృతిపై ప్రేమ పెంచుకున్నాడు. 12 సంవత్సరాల క్రితమే సేంద్రియ వ్యవసాయంపై టెర్రస్ గార్డెన్ చేసి తన ఇంటికి కావాల్సిన కూరగాయాలను పండించాడు. నగరంలోని తన తోటి మిత్రులకు, బంధువులకు సేంద్రియ పంటను అందించాడు. ఎక్కడ వెరైటీ మొక్కలు కన్పించినా పరిశీలించి ఇంటికి తెచ్చుకుంటాడు. ఎవరైనా ఎంజాయ్ అంటూ పార్టీలు..., బీచ్‌లు, మంచు పర్వతాల వెంట వెళ్తారు. కానీ పాండుగౌడ్ అడవులు, వనాలుగా ఉన్న రీసార్ట్లోనే ఎంజాయ్ ఉంటుందని అంటున్నాడు.ఆ ప్రేమే ఇంటిని పూలవనంగా మార్చాడు. -
త్వరితం.. హరితం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో 3 కోట్ల మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో 1.30 లక్షల మొక్కలనుజీహెచ్‌ఎంసీ, జలమండలి ఖాళీ స్థలాల్లో పెంచు తుండగా... మరో 70 లక్షల మొక్కల ను హెచ్ఎండీఏ, గృహనిర్మాణ శాఖ ఖాళీ స్థలాల్లో పెంచుతున్నారు. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి, వివిధ సంస్థలు, విద్యాసంస్థల్లో దాదాపు 10 లక్షల మొక్కలు నాటుతున్నారు. మిగిలిన మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించగా... అధికారులు ఇప్పటికే 13 లక్షల మొక్కలు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాటనున్న మొక్కలకు సంబంధించి స్థలాల ఎంపిక పూర్తవ్వగా... గుంతల తవ్వకం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ మొక్కలకు జీహెచ్ఎంసీ జియోట్యాగింగ్ కూడా చేయనుంది. జీహెచ్ఎంసీ నాటనున్న 5లక్షల మొక్కల్లో ఎల్బీనగర్ జోన్లో 95వేలు,చార్మినార్ జోన్లో 65వేలు, ఖైరతాబాద్ జోన్లో 79,600, శేరిలింగంపల్లి జోన్లో 85,250, కూకట్పల్లి జోన్లో 1,01,050, సికింద్రాబాద్ జోన్లో 74,100 మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఆయా జోన్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు దాదాపు 3,084 ప్రాంతాల్లో 1,729 ఎకరాల భూమిని గుర్తించారు. వర్షాలతో పంపిణీ ముమ్మరం... నగరంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు మొక్కల పంపిణీ ముమ్మరం చేశారు. కాలనీలు, బస్తీలు, విద్యాసంస్థల్లో మొక్కల పంపిణీ చేపట్టారు. ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో వివిధ కాలనీలు, ఆలయాలు, విద్యాసంస్థల్లో 9.50 లక్షల మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు హరితహారంలో పాల్గొనాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు... నగరంలోని ఏరో స్పేస్ వ్యాలెట్ కంపెనీ సిబ్బంది ఆదివారం దాదాపు 2వేల మొక్కలు నాటారు. కంపెనీ ఎండీ నితిన్ పీటర్, మయాంత్, అనూష, గ్రాస్ వరల్డ్ ఎండీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికే మొక్క
సాక్షి, సిటీబ్యూరో: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రజలకు అందజేసే మొక్కల్ని నేరుగా వారి ఇళ్లకే చేర్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రతి ఏటా ప్రజలు ఇళ్లలో నాటుకునేందుకు 50 లక్షల నుంచి 90 లక్షల మొక్కల వరకు పంపిణీ అవుతున్నట్లు లెక్కలు చూపుతున్నప్పటికీ, వాటిని ఎవరికి పంచుతున్నారో, ప్రజలు వాటిని నాటుతున్నారో లేదో తెలియడం లేదు. హరితహారంలో భాగంగా ఇప్పటికే కోట్ల మొక్కలు నాటడంతో నగరంలో కొత్తగా నాటేందుకు స్థలాలు కూడా దొరకడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం గ్రేటర్ పరిధిలో మూడు కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసే మొక్కలను పకడ్బందీగా పంపిణీ చేయడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. సంవత్సరంలో మూడు కోట్ల మొక్కలు నాటాల్సి ఉన్నా.. తొలిదశలో భాగంగా కోటి మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో 5 లక్షలు జీహెచ్ఎంసీ నాటనుండగా, మరో 5 లక్షలు జంక్షన్లలో నాటేందుకు ప్రతిపాదించారు. విద్యాసంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతరత్రా సంస్థలకు తగిన స్థలాలుండి మొక్కలు నాటేందుకు ముందుకొచ్చే వారికి ఇచ్చేందుకు 5 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. ఇలా 15 లక్షలు పోను మిగతా 85 లక్షల మొక్కలు తమ ఇళ్లలో నాటుకునేందుకు ప్రజలకే అందజేయనున్నారు. ఈ పంపిణీ సక్రమంగా జరిగేందుకు.. పకడ్బందీ చర్యల కోసం జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మొక్కల కోసం ప్రజలకు ఎక్కడకూ వెళ్లకుండా వారి ఇళ్లకే వీటిని చేర్చాలనే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది. అందుకుగాను ఇంటింటికి వెళ్లే స్వచ్ఛ ఆటోల ద్వారా ఈ మొక్కలను పంపిణీ చేసే యోచన ఉంది. ఉదయం పూట స్వచ్ఛ ఆటోలు ఇళ్లనుంచి చెత్తను తరలించాక, మధ్యాహ్నం ఖాళాగానే ఉండటంతో వాటి ద్వారానే ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఇతరత్రా మార్గాలను కూడా ఆలోచిస్తున్నామని జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ తెలిపారు. ఒక్కో ఇంటికి తొలిదశలో 5–10 మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో ప్రతి ఇంటికీ హరితహారం మొక్కలు అందేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తగినంత వర్షం పడ్డాక వీటి పంపిణీ ప్రారంభించనున్నారు. చెత్త తరలించే కార్మికులకు అన్ని ఇళ్లూ తెలుసు కనుక వారిద్వారా అయితే ప్రతి ఇంటికీ పంపిణీ కాగలవని భావిస్తున్నారు. పకడ్బందీగా పంపిణీకి అధికారులందరితోచర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొక్కలు పంపిణీ సందర్భంగా ఇంటి నెంబర్‌తో పాటు వారి సంతకం, ఫోన్ నెంబర్ వంటివి సేకరించడం ద్వారా పంపిణీలో అవకతవకలకు తావుండదని భావిస్తున్నారు. ఒక వేళ ఎవరికైనా మొక్కలు అందని పక్షంలో సమీపంలోని నర్సరీల ద్వారా కూడా పంపిణీ చేయనున్నారు. నర్సరీల్లో కోటి మొక్కలు.. హరితహారం కార్యక్రమంలో మొక్కల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీకి చెందిన నర్సరీల్లోనే కోటి మొక్కలు పెంచుతున్నారు. జూలైలో పంపిణీ చేసేందుకు 50 లక్షలు సిద్ధంగా ఉన్నాయని అడిషనల్ కమిషనర్ తెలిపారు. ఆగస్టులో 30 లక్షలు, సెప్టెంబర్‌లో 20 లక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రేటర్ నగరంలోని బహిరంగ, ఖాళీ ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ ఐదు లక్షల మొక్కలు నాటనుంది. గతంలో మొక్కలు నాటిన మార్గాల్లోని గ్యాప్లతోపాటు ఇతరత్రా ఖాలీ ప్రదేశాల్లో, పార్కుల్లో నీడనిచ్చే పెద్దచెట్లుగా పెరిగే మొక్కలు నాటనున్నారు. నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుల్లో 616 పార్కులకు ప్రహరీలతోపాటు లోపల ఎంతో ఖాలీ స్థలమున్నప్పటికీ ఎలాంటి నిర్వహణకు నోచుకోకుండా అధ్వాన్నంగా ఉన్నట్లు ఇటీవలి సర్వేలో గుర్తించారు. ఈ 616 పార్కుల్లోనూ వాక్‌వే పోను మిగతా ప్రదేశంలో నీడనిచ్చే మొక్కలు ఎక్కువగా నాటనున్నారు. వాటితోపాటు అందమైన పూల మొక్కలు కూడా నాటనున్నారు. తద్వారా పార్కులు పచ్చగా, సుందరంగా, ఆహ్లాదంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇంకా మేజర్ రోడ్ల వెంబడి, ప్రజలు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో నీడనిచ్చే పెద్దచెట్లుగా ఎదిగే మొక్కల్ని నాటనున్నారు. తద్వారా కాలుష్యం కొంతమేర తగ్గి పర్యావరణపరంగానూ శ్రేయస్కరమని అధికారులు పేర్కొన్నారు. ఇలా ఒక్కో జోన్‌కు సగటున 80వేల మొక్కల్ని పంపిణీ చేయనున్నారు. పార్కుల్లో, రహదారుల వెంబడి.. పార్కులు, రహదారుల వెంబడి, ఆయా సంస్థలు, ఇతర ఖాలీస్థలాల్లో నాటే వాటిల్లో కదంబ, వేప, కాంచనం, రావి, మర్రి, రేల, కానుగ, పట్టెడ,నేరెడు, చింత, ఉసిరి, నెమలినార, చందనం, మహాగని, పొగడ, బ్యాడ్మింటన్బాల్ట్రీ, ఫౌంటెన్ ట్రీ, పింక్షవర్, జావా కేసియా, బట్టర్కప్ట్రీ, సిస్సు, బాదం, అడవిబాదం, పింక్ టబేబుయా, పింక్ ట్రంపెట్, మేడి, కసోడ్, జువ్వి, సిల్వర్‌ఓక్, ఎర్ర చందనం, టేకు, తెల్లమద్ది జాతులకు వంటివి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇళ్లల్లో నాటేందుకు.. ఇళ్లల్లో నాటుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపే పండ్లు, పూల జాతులతోపాటు ఔషధ, సుగంధ మొక్కలకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. వాటిల్లో సీతాఫలం, జామ, నిమ్మ, నేరేడు, మునగ, బొప్పాయి, కనకాంబరం, నందివర్ధనం, గులాబీ, సబ్జాతులసి, లెమన్‌గ్రాస్, కలబంద, పుదీన, మనీప్లాంట్స్ తులసి, హెన్నా, అడ్డసరం, మాచపత్రి, సరస్వతి, వేము, బోగన్ విల్లా, క్రసాండ్ర, హైబిస్కస్, మల్లె, నీరియం, ప్లుంబాగో,నైట్‌క్వీన్, పారిజాతం తదితర రకాలుంటాయని తెలిపారు. రహదారుల కూడళ్లలో అందంగా కనబడే సీజనల్ పూలమొక్కలు నాటుతామని పేర్కొన్నారు. -
సంరక్షణే సవాల్!
హరితహారం పథకం కింద గతేడాది జిల్లాలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఉపాధి హామీ నిధులతో నాటిన 90.43 లక్షల మొక్కల్లో 35.69 లక్షల మొక్కలు బతికినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే నాటిన మొక్కల్లో 39 శాతం మొక్కలు మనుగడ సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవాని కి 20 శాతం కూడా మొక్కలు మనుగడ సాధించలేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో హరితహారం పథకం కింద నాటిన మొక్కల సంరక్షణ సవాల్‌గా మారింది. రూ.కోట్లు వెచ్చించి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నప్పటికీ.. అవి నాటుకుని మనుగడ సాధించడం లేదు. నాటినప్పుడు ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో ఉండటం లేదనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. ఏటా కోట్లలో మొక్కలు నాటుతోంది. ఒక్కో గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు ఏటా నాటుతూ వస్తోంది. కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, పాఠశాలలు, ఇతర సంస్థల ప్రదేశాలు, దేవాలయాలు, ఈత వనాలు, రహదారికి ఇరువైపున ఉన్న ఖాళీ స్థలాలు, రైతుల పొలం గట్ల మీద ఇలా వివిధ ప్రదేశాల్లో ఏటా భారీ సంఖ్యలో మొక్కలను నాటుతున్నారు. కానీ మొక్కలు మూడు రోజుల ముచ్చటే అవుతోంది. మొక్కలు నాటడంలో చూపిన ఉత్సాహం వాటి సంక్షరణపై పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రెండింతల లక్ష్యం ఈ ఏడాది హరితహారం లక్ష్యం రెండింతలైంది. ఏటా నాటే మొక్కల సంఖ్య కంటే రెండు రెట్లు అధికంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో హరితహారం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఏటా 1.85 కోట్ల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈసారి ఏకంగా 4.80 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం అటవీశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించే పనిలో అటవీశాఖ పడింది. మరోవైపు లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద నర్సరీల పెంపకంతో పాటు అటవీశాఖ నర్సరీల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. -
పల్లెల్లో హరితశోభ
పల్లెల్లో పచ్చదనం సంతరించుకోనుంది. తరిగిపోతున్న అడవుల శాతాన్ని తిరిగి పెంచడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు పడగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సాక్షి, జనగామ: పల్లెకు పచ్చదనం పర్చుకోనుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు తగిన కార్యా చరణను అధికారులు రూపొందిస్తున్నారు. తరిగి పోతున్న అడవుల శాతాన్ని తిరిగి పొందడంతో పా టు వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విధితమే. వర్షాలు పడగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ఐదో విడత లక్ష్యం 1.80కోట్లు.. జిల్లాలో ఐదో విడత హరితహారంలో భాగంగా 1.80కోట్ల మొక్కలను నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ(ఎన్ఆర్ఈజీఎస్), తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా మొక్కలను పెంచుతున్నారు. ఉపాధి హామీపథకంలో భాగంగా 1,24,50,000 మొక్కలను 252 నర్సరీలో పెంచుతున్నారు. గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గతంలో మండల కేంద్రాల్లో మొక్కలను పెంచితే రవాణా చేయడం కష్టంగా మారేది. ఇప్పుడు అలా కాకుండా గ్రామాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. పంచాయతీలకు బాధ్యత.. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామపాలక వర్గాలకు బాధ్యత అప్పగించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారంగా మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా పొందుపర్చారు. ప్రతి గ్రామం పచ్చదనంతో ఉండే విధంగా సర్పంచ్‌లు, పాలకవర్గం బాధ్యత తీసుకోవాలని ప్రత్యేకంగా చూసించారు. ఉపాధిహామీ సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, వార్డు సభ్యులను భాగస్వామ్యం చేస్తోంది. జూలై మొదటివారంలో ప్రారంభం.. రానున్న జూలై నెల మొదటివారంలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. జులైలో వర్షాకాల సీజన్ కావడంతో నాటిన మొక్కలను కాపాడే వీలుంటుంది. ప్రభుత్వం ప్రారంభించే తేదీని బట్టీ జిల్లాలో లాంఛనంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైతుల వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు రోడ్డు పక్కన మొక్కలు నాటేందుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ లక్ష్యం 56 లక్షలు.. అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 56లక్షల మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్ రేంజ్ పరిధిలో 56 లక్షలను పెంచడానికి అధికారులు మొక్కలను పెంచుతున్నారు. 56 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ వేరుగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై మొదటివారంలో నాటుతాం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీలో భాగంగా మొక్కలను పెంచుతున్నారు. గ్రామానికి 40వేల మొక్కలను పంపిణీ చేస్తాం. వర్షాలను బట్టి మొక్కల పంపిణీ ప్రారంభం అవుతుంది. నర్సరీల్లో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా మొక్కలను పెంచుతున్నాం. జూలై మొదటివారంలో జిల్లా అంతటా మొక్కలను నాటే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి హరితహారాన్ని ప్రారంభిస్తాం. –రాంరెడ్డి, డీఆర్డీఓ పల్లెల్లో హరితశోభ -
కోటి మొక్కలకు ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 60లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ నర్సరీల ద్వారా, మరో 40లక్షల మొక్కలను ప్రైవేట్ నర్సరీల్లో పెంచుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. హరితహారం నిర్వహణ పై జోనల్, డిప్యూటీ కమిషనర్లు, అర్బన్ బయోడైవర్సిటీ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మొక్కల పెంపకం చేపట్టిన నర్సరీలను తనిఖీ చేసి పెంపకం వివరాలపై నివేదిక అందజేయాలని జోనల్, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. ఈ తనిఖీలకు డిప్యూటి కమిషనర్లు, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం విజయవంతం చేయడానికి కాలనీ సంక్షేమ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. రహదారులు, కాలనీల్లో నాటే మొక్కల సంరక్షణకు ట్రీ గార్డ్లు అవసరమని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ కింద కనీసం లక్ష ట్రీగార్డులను సమకూర్చుకోవాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన 616 బహిరంగ ప్రదేశాల్లో హరితహారం మొక్కలను నాటడం ద్వారా పార్కులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 331 ట్రీ పార్కుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో, శ్మశానవాటిల్లోని ఖాళీ స్థలాల్లో కూడా హరితహారం మొక్కలను నాటాలని సూచించారు. అర్బన్ బయోడైవర్సిటీకి పార్కుల్లో క్రీడా పరికరాల నిర్వహణ గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు మేజర్ పార్కుల్లో చిన్న పిల్లలకు ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల నిర్వహణ బాధ్యతలను అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి అప్పగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వీటి వార్షిక నిర్వహణకు ఏజెన్సీలను ఖరారు చేయాలని అర్బన్ బయోడైవర్సిటీ అధికారులను ఆదేశించారు. రంజాన్ తోఫాలకు ఏర్పాట్లు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి వార్డులో రెండు మసీదులను గుర్తించి రంజాన్ బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. నగరంలోని 150 వార్డులకుగాను 300 మసీదులను ఎంపికచేసి దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి , జయరాజ్ కెనెడీ, జోనల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్... మూడు మొక్కలు
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు...మీ ఇంటికి నిండు సిలిండర్‌తో పాటు ఇకపై మూడు మొక్కలు ఉచితంగా అందనున్నాయి.హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని సిటీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో వంట గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వినియోగదారులకు ఉచితంగా మొక్కలు అందచేయాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. ఈ మేరకు గ్యాస్ గోదాముల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు గృహ అవసరాలకు ఉపయోగించే తులసి, కరివేపాకు, ఇతర పండ్ల, పూల మొక్కలు గ్యాస్ వినియోగదారులకు కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇంటి ఆవరణలో మొక్కలు నాటేందుకు స్థలం లేని వారు సైతం కుండీల్లో పెట్టుకొని మొక్కలు పరిరక్షించేందుకు వీలుగా చిన్నిచిన్న మొక్కలనే అందించాలని నిర్ణయించారు. ప్రతి గృహోపయోగ గ్యాస్ వినియోగదారు ల కుటుంబం కనీసం ఒక మొక్క అయినా పరిరక్షించే విధంగా చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. ఇకపై వంట గ్యాస్ బుకింగ్ చేసిన వారికి సిలిండర్ డెలివరీ చేసే బాయ్లే మొక్కలు కూడా వారికి అందచేస్తారు. గ్రేటర్లో 26.21 లక్షలు కుటుంబాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంట గ్యాస్ వినియోగ కుటుంబాలు సుమారు 26.21 లక్షలకు పైబడి ఉన్నారు. వీరికి మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 135 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతోంది. ప్రతి రోజు డిమాండ్ 1.20 లక్షలు సిలిండర్ల వరకు డిమాండ్ ఉండగా కనీసం 80 వేలకు తగ్గకుండా డోర్ డెలివరీ జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్యాస్ వినియోగదారులకు హరితహారంలో భాగంగా ఇంటింటికి సిలిండర్‌తోపాటు మొక్కలు అందించేందుకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. ఇటీవల గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం బాధ్యులు సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ను కలిసి హరిత హారంలో భాగస్వాములయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నర్సరీల ద్వారా గ్యాస్ గోదాముల వారిగా మొక్కలు సరాఫరా చేసేందుకు అధికార వర్గాలు అంగీకరించాయి. 34 నర్సరీల్లో మొక్కల పెంపకం నగరంలోని 34 నర్సరీల్లో 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా వేప, జువ్వి, కానుగ, జమ్మితో పాటు పండ్ల మొక్కలైన సపోట, మామిడి, అల్లనేరేడు, బాదం తదితర పలు రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్లలో పెంచుకునేందుకు ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. గృహోపయోగ గ్యాస్ వినియోగదారుల కోసం మాత్రం ఔషధ, పూల మొక్కలను సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ గోదాములకు మొక్కలు సరఫరా కాగానే సిలిండర్లతోపాటు వాటిని పంపిణీ చేసే విధంగా డిస్ట్రిబ్యూటర్లు సంసిద్ధులవుతున్నారు. మొక్కలను పరిరక్షించండి మానవుడి మనుగడకు పర్యావరణ పరిరక్షణ అవసరం. అందుకు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. ప్రభుత్వం చేపట్టిన హరితహారం మంచి కార్యక్రమం. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇంటింటికీ సిలిండర్‌తో పాటు ఉచితంగా పంపిణీ చేసే మొక్కలు వృథాగా పారేయకుండా పరిరక్షించాలి. ఇంట్లో మొక్కలు నాటేందుకు స్థలం లేనివారు కూడా కుండీల్లో మొక్కలను పెంచుకోవచ్చు. అప్పుడే ఇంటి ముందు పచ్చతోరణం కళకళాడుతుంది. ఇది కుటుంబం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. – అశోక్‌కుమార్, ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం, గ్రేటర్ హైదరాబాద్. -
ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయాల్సిందే
‘హరితహారం’ అమలుపై సర్పంచులు, ఎంపీటీసీలకు ముఖ్యమంత్రి హెచ్చరిక కరీంనగర్/సంగారెడ్డి: ‘‘ఒక్కో గ్రామానికీ 40 వేల మొక్కలు సరఫరా చేసే బాధ్యత మాది. మీకు నయాపైసా ఖర్చు లేదు. ట్రాలీ ద్వారా మీ ఊరికే తెచ్చి మొక్కలు సరఫరా చేస్తాం. ఆ మొక్కలన్నింటినీ పెంచే బాధ్యత మాత్రం మీదే. ఏ ఊర్లో 40 వేల కంటే ఒక్క మొక్క తక్కువగా బతికినా ఆ ఊరి సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలి’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల స్వయంగా మొక్కలు నాటిన కేసీఆర్ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హరితహారమంటే నాలుగు మొక్కలు పెట్టి మంచిగ సాకుడే. దానికి ఇంత హడావుడి ఎందుకు? ఇంత కథ ఏంది? సీఎం వచ్చి మొత్తుకునుడేంది? ఎక్కడో తప్పు జరిగింది. దారి తప్పిపోయినం. సర్పంచులు, ఎంపీటీలకు తెలివి ఉంటే మీ గ్రామంలోనే నర్సరీ పెంచుకుని ఉంటే... ప్రభుత్వం ఇంత బాధపడాల్సిన అవసరమేముంది? పంచాయతీ వ్యవస్థ ఫెయిలైంది. చెట్టు పెంచాలనే సోయి కూడా మర్చిపోయినం కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది. అసలు సర్పంచులు ఊళ్లల్లో ఉంటలేరు. పొద్దున లేవగానే పంచె సదురుకుని పట్టణాల్లో పడుతుండ్రు. హుస్నాబాద్‌లోనే కాదు. తెలంగాణ అంత టా పరిస్థితి ఇట్లనే తయారైంది’’అని చురకలంటించారు. సభలో మంత్రులు ఈటల, జోగు రామన్న, కేటీఆర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నర్సరీలో పెరిగిన మొక్కను... ‘‘నేను సిద్దిపేట నర్సరీలో పెరిగిన మొక్కను. ఇయ్యాల పెద్దగ పెరిగి నీడపట్టి తెలంగాణ అంతటా విస్తరించాను. మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి’’ అని కేసీఆర్ ప్రజలను కోరారు. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలోని ‘తెలంగాణ రిలే దీక్షల స్ఫూర్తి’ పైలాన్ వద్ద మొక్కను నాటాక జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ హరితహారం పథకం అమల్లో 100 శాతం విజయం సాధించిన ప్రతి నియోజకవర్గానికీ రూ. 5 కోట్ల బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ పథకానికి ఓ రైతే తనకు స్ఫూర్తినిచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి తన వ్యవసాయ పొలాన్ని చూసేందుకు వచ్చిన ఒక రైతుతో కలసి భోజనం చేస్తూ ‘మీ దగ్గర వర్షాలు కురుస్తున్నాయా?’ అని అడగ్గా ... ‘జంగల్ ఉంది కాబట్టి మాకు వర్షాలకు ఇబ్బంది లేదు’ అని ఆ రైతు చెప్పినప్పుడే తెలంగాణవ్యాప్తంగా చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణ వస్తే బంగారు కిరీటం చేయిస్తా స్వామీ’ అని తన భార్య కాళేశ్వరస్వామికి మొక్కుకుందని, త్వరలోనే కిరీటం చేయించి స్వామికి తొడిగుతానని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నార్త్‌లో శామీర్‌పేట్ వద్ద మరో పెద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే మెదక్ జిల్లాను సిద్దిపేట, మెదక్ జిల్లాలుగా చేయబోతున్నామని సీఎం తెలిపారు. మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, జె డ్పీచైర్మన్ రాజమణిముర ళీయాదవ్ పాల్గొన్నారు.