
మొక్కలు పంపిణీ చేస్తున్న జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి
చింతకొమ్మదిన్నె: స్థానికంగా ఏపీఎస్‌బీబీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం జెడ్పీటీసీ సభ్యుడు పి.నరేన్ రామాంజులరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 12 పంచాయతీల పరిధిలో గల వివిధ గ్రామాలకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మొక్కలు పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్‌రెడ్డి, గంగాదేవి, రమేష్, మండల కన్వీనర్ గూడ ప్రభాకర్‌రెడ్డి, కో–కన్వీనర్ కళాయాదవ్, మండల ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీపై విమర్శలకే మహానాడు పరిమితం
ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కేవలం వైఎస్సార్‌సీపీపై విమర్శలకే పరిమితమైందని జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి అన్నారు. సీకేదిన్నె ఎంపీడీవో కార్యాలయంలోని చాంబర్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గతంలో వాగ్దానాలు ఏవీ నెరవేర్చకపోగా.. ప్రస్తుతం ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment