మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి | TDP goons attack on female ZPTC | Sakshi
Sakshi News home page

మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి

Published Mon, Aug 12 2024 5:50 AM | Last Updated on Mon, Aug 12 2024 5:50 AM

TDP goons attack on female ZPTC

పల్నాడు జిల్లా గారపాడులో దౌర్జన్యకాండ 

సెల్‌ఫోన్‌ పగులకొట్టి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ తల్లిని గాయపర్చిన వైనం 

జెడ్పీటీసీ స్వర్ణకుమారి భర్తను తమకు అప్పగించాలని వీరంగం 

భయంతో ఇంటి లోపల తాళాలు వేసుకున్న కుటుంబ సభ్యులు 

జెడ్పీటీసీ భర్త శివాజీని గ్రామంలోకి రావొద్దని పోలీసుల హుకుం  

పెదకూరపాడు: అధికారమే అండగా టీడీపీ ముష్కర మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగిస్తూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారి ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఒక్కసారిగా 15 మంది టీడీపీ రౌడీలు పెదకూరపాడు మండలం గారపాడులోని జెడ్పీటీసీ ఇంటిలోకి ప్రవేశించి ఆమె సెల్‌ఫోన్‌ లాక్కొని పగలకొట్టారు. 

వృద్ధురాలన్న కనికరం కూడా లేకుండా స్వర్ణకుమారి తల్లి గణేశ్‌ శివమ్మని కింద పడేశారు. దీంతో ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. టీడీపీ గూండాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన జెడ్పీటీసీ స్వర్ణకుమారిని, ఆమె పెద్ద కుమార్తెను పక్కకు తోసేశారు. ‘నీ భర్తను పిలువు.. మాకు అప్పగించు’ అంటూ దౌర్జన్యం చేశారు. తన భర్త ఇక్కడ లేరని చెప్పినా వినిపించుకోకుండా భయోత్పాతం సృష్టించారు.   

రెక్కీ నిర్వహించి మరీ.. 
వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా నాయకుడైన కంకణాల శివాజీ తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తుంటారు. గత ఎన్నికల్లో పెదకూరపాడు జెడ్పీటీసీ అభ్యరి్థగా తన భార్య స్వర్ణకుమారిని పోటీ చేయించి గెలిపించుకున్నారు. స్వర్ణకుమారి, శివాజీ దంపతుల ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఆ దంపతులు కొద్ది రోజులు హైదరాబాద్‌లో, మరికొద్దిరోజులు స్వగ్రామం గారపాడులో ఉంటున్నారు. 

మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తన భర్త తల్లిని స్వగ్రామంలో వదిలిపెట్టడానికి జెడ్పీటీసీ స్వర్ణకుమారి, తన కుమార్తెలతో కలిసి కారులో శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గారపాడుకు వచి్చన వెంటనే శివారులో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఉట్లపల్లి శ్రీనివాసరావు కారులో మాటు వేశాడు. జెడ్పీటీసీ తన అత్తను వారి ఇంటి వద్ద దించి, ఆమె బాగోగులు చూసుకోవడానికి చిన్న కుమార్తెను ఉంచారు. పెద్ద కుమార్తెను తీసుకుని తన తల్లి గణేశ్‌ శివమ్మ ఇంటికి జెడ్పీటీసీ వెళ్లారు.   

సెల్‌ఫోన్‌ పగులకొట్టి జెడ్పీటీసీ తల్లిపై దాడి 
ఈ క్రమంలో ఉట్లపల్లి శ్రీనివాసరావు తనతోపాటు నెల్లూరి వెంకటేశ్వర్లు, ఉట్లపల్లి కోటేశ్వరరావు, మక్కెన ప్రభాకరరావు, కొంకా శౌరీలు, మక్కెన పవన్, ఉట్లపల్లి శ్రీనివాసరావు, బండారు మాధవరావు, పొదిలె కోటేశ్వరరావు, మక్కెన అప్పారావు, పెనుముచ్చు రమేశ్‌లతోపాటు మరో ఐదుగురిని తీసుకుని ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు స్వర్ణకు­మారి ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఆమె తలుపులు తీయగానే ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన టీడీపీ గూండాలు ‘నీ భర్త శివాజీ గాడు ఎక్కడ.. వాడి అంతుచూస్తాం.. బయటకు రమ్మను’ అంటూ బిగ్గరగా కేకలు వేసి భయభ్రాంతులకు గురి చేశారు. 
   
ఎస్‌ఐకి ముందుగానే సమాచారమిచ్చినా..  
తమపై టీడీపీ గూండాలు దాడికి దిగనున్నారని ముందుగానే తెలుసుకున్న జెడ్పీటీసీ స్వర్ణకుమారి భర్త శివాజీ పెదకూరపాడు ఎస్‌ఐ విపర్ల వెంకట్రావుకు ముందుగానే సమాచారం ఇచ్చారు. 

ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు..  
రెండు వేల ఓట్లు ఉన్న గారపాడులో గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు. ఇళ్లపైకి వచ్చి దాడి చేయడం ఏమిటి? మీ నేత చంద్రబాబు ఇదేనా మీకు నేరి్పంది? మా గ్రామంలోకి మేము రాకూడదా? మా ఇంటిపైకి బీభత్సం సృష్టించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.–స్వర్ణకుమారి, జెడ్పీటీసీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement