swarnakumari
-
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి
-
మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి
పెదకూరపాడు: అధికారమే అండగా టీడీపీ ముష్కర మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగిస్తూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారి ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఒక్కసారిగా 15 మంది టీడీపీ రౌడీలు పెదకూరపాడు మండలం గారపాడులోని జెడ్పీటీసీ ఇంటిలోకి ప్రవేశించి ఆమె సెల్‌ఫోన్ లాక్కొని పగలకొట్టారు. వృద్ధురాలన్న కనికరం కూడా లేకుండా స్వర్ణకుమారి తల్లి గణేశ్ శివమ్మని కింద పడేశారు. దీంతో ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. టీడీపీ గూండాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన జెడ్పీటీసీ స్వర్ణకుమారిని, ఆమె పెద్ద కుమార్తెను పక్కకు తోసేశారు. ‘నీ భర్తను పిలువు.. మాకు అప్పగించు’ అంటూ దౌర్జన్యం చేశారు. తన భర్త ఇక్కడ లేరని చెప్పినా వినిపించుకోకుండా భయోత్పాతం సృష్టించారు. రెక్కీ నిర్వహించి మరీ.. వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా నాయకుడైన కంకణాల శివాజీ తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తుంటారు. గత ఎన్నికల్లో పెదకూరపాడు జెడ్పీటీసీ అభ్యరి్థగా తన భార్య స్వర్ణకుమారిని పోటీ చేయించి గెలిపించుకున్నారు. స్వర్ణకుమారి, శివాజీ దంపతుల ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఆ దంపతులు కొద్ది రోజులు హైదరాబాద్‌లో, మరికొద్దిరోజులు స్వగ్రామం గారపాడులో ఉంటున్నారు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తన భర్త తల్లిని స్వగ్రామంలో వదిలిపెట్టడానికి జెడ్పీటీసీ స్వర్ణకుమారి, తన కుమార్తెలతో కలిసి కారులో శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గారపాడుకు వచి్చన వెంటనే శివారులో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఉట్లపల్లి శ్రీనివాసరావు కారులో మాటు వేశాడు. జెడ్పీటీసీ తన అత్తను వారి ఇంటి వద్ద దించి, ఆమె బాగోగులు చూసుకోవడానికి చిన్న కుమార్తెను ఉంచారు. పెద్ద కుమార్తెను తీసుకుని తన తల్లి గణేశ్ శివమ్మ ఇంటికి జెడ్పీటీసీ వెళ్లారు. సెల్‌ఫోన్ పగులకొట్టి జెడ్పీటీసీ తల్లిపై దాడి ఈ క్రమంలో ఉట్లపల్లి శ్రీనివాసరావు తనతోపాటు నెల్లూరి వెంకటేశ్వర్లు, ఉట్లపల్లి కోటేశ్వరరావు, మక్కెన ప్రభాకరరావు, కొంకా శౌరీలు, మక్కెన పవన్, ఉట్లపల్లి శ్రీనివాసరావు, బండారు మాధవరావు, పొదిలె కోటేశ్వరరావు, మక్కెన అప్పారావు, పెనుముచ్చు రమేశ్లతోపాటు మరో ఐదుగురిని తీసుకుని ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు స్వర్ణకుమారి ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఆమె తలుపులు తీయగానే ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన టీడీపీ గూండాలు ‘నీ భర్త శివాజీ గాడు ఎక్కడ.. వాడి అంతుచూస్తాం.. బయటకు రమ్మను’ అంటూ బిగ్గరగా కేకలు వేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఎస్ఐకి ముందుగానే సమాచారమిచ్చినా.. తమపై టీడీపీ గూండాలు దాడికి దిగనున్నారని ముందుగానే తెలుసుకున్న జెడ్పీటీసీ స్వర్ణకుమారి భర్త శివాజీ పెదకూరపాడు ఎస్ఐ విపర్ల వెంకట్రావుకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు.. రెండు వేల ఓట్లు ఉన్న గారపాడులో గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు. ఇళ్లపైకి వచ్చి దాడి చేయడం ఏమిటి? మీ నేత చంద్రబాబు ఇదేనా మీకు నేరి్పంది? మా గ్రామంలోకి మేము రాకూడదా? మా ఇంటిపైకి బీభత్సం సృష్టించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.–స్వర్ణకుమారి, జెడ్పీటీసీ -
కలలు కల్లలు.. భార్యా, భర్తల బలవన్మరణం
తిరువూరు రూరల్ (ఎన్టీఆర్ జిల్లా): పని కోసం దుబాయ్ వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ విషయం తెలిసి తట్టుకోలేక అతడి భార్య కూడా బలవన్మరణం చెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. నిరాశ చెంది.. తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామానికి చెందిన గూడూరు నాగిరెడ్డి(38), స్వర్ణకుమారి(34) దంపతులకు ఇద్దరు కుమారులు. నాగిరెడ్డి స్థానికంగా ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సరైన ఆదాయం లేకపోవడంతో నాగిరెడ్డి ఏదైనా పని కోసం దుబాయ్ వెళ్లాలనే ప్రయత్నంలో వీసా కోసం దరఖాస్తు చే శాడు. పలుమార్లు ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ సాంకేతిక కారణాలతో వీసా పొందలేకపోయాడు. సమయం, డబ్బు వృథా కావడంతో పాటు ఇక తాను విదేశాలకు వెళ్లే అవకాశం లేదని ఆందోళనకు గురైన నాగిరెడ్డి బుధవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: (తప్పు మీద తప్పు.. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..) భర్త మృతిని తట్టుకోలేక.. గురువారం తెల్లవారుజామున తర్వాత భర్త మృతి విషయం తెలుసుకున్న భార్య స్వర్ణకుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. అంత్యక్రియలు పూర్తి కాకముందే ఆమె కూడా పురుగుమందు తాగింది. అపస్మారక స్థితికి చేరిన స్వర్ణకుమారిని గుంటూరు తరలించగా, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'పాలేరు' కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం
ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. పాలేరు శాససనభ నియోజకవర్గాన్ని తనకే కేటాయించాలని జిల్లా శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరడాన్ని స్థానిక ఎంపి నామా నాగేశ్వరరావు శనివారం ఖమ్మంలో తప్పు పట్టారు. పాలేరు టికెట్ ఎప్పటి నుంచో స్వర్ణకుమారి ఆశిస్తున్నారని ఈ సందర్బంగా నామా గుర్తు చేశారు. ఆమెకు పాలేరు టికెట్ ఇవ్వడమే సముచితమన్నారు. అయితే పాలేరు టికెట్ ఆమెకు దక్కకుండా తానే దక్కించుకోవాలని తుమ్మల ఆరాట పడుతున్నారని నామా ఆరోపించారు. తుమ్మల అలా చేస్తే ఓ ఆడబిడ్డకు అన్యాయం చేసినట్లే అవుతుందని నామా నాగేశ్వరరావు విమర్శించారు.