pledges
-
ఆరేళ్లలో రూ.30 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: భారత్ విధించుకున్న కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి వచ్చే ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2024–2030) రూ.30 లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఇరెడా’ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. దేశంలో సగం విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ ఏర్పాటు చేసుకోగా, 2070 నాటికి నికరంగా సున్నా కర్బన ఉద్గారాల స్థితికి చేరుకోనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. దీంతో సోలార్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్లు, పవన విద్యుత్ టర్బయిన్లు, వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ సామర్థ్యాల ఏర్పాటుపై పెట్టుబడులు అవసరమవుతాయని దాస్ చెప్పారు. ప్రపంచబ్యాంక్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. పీఎం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. దీని కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇందు కోసం కేంద్ర సర్కారు రూ.75,000 కోట్లను ఖర్చు చేయనుంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా దీన్ని చేపట్టనున్నారు. ఈ పథకం వల్ల గణనీయమైన ప్రయోజనాలకు తోడు, ప్రజల్లో పునరుత్పాదక ఇంధనం పట్ల పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడుతుందని దాస్ అభిప్రాయపడ్డారు. దేశ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సాయపడుతుందన్నారు. ‘‘వచ్చే మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ విధించుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధన డిమాండ్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో 90 శాతం పునత్పాదక ఇంధన వనరుల రూపంలోనే సమకూరనుంది’’అని దాస్ చెప్పారు. -
'ముస్లింలపై ప్రయాణ నిషేధం పునరుద్ధరిస్తా'
న్యూయార్క్: తాను అధ్యక్షునిగా ఎన్నికైతే ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. లాస్ వెగాస్‌లో నిర్వహించిన రిపబ్లికన్ జ్యూయిష్ కన్వెన్షన్‌లో ఈ మేరకు మాట్లాడారు. “మీకు ప్రయాణ నిషేధం గుర్తుందా? ఎన్నికైతే మొదటి రోజే నేను అప్పటి ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తాను. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను మా దేశానికి దూరంగా ఉంచుతాము" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇరాక్, సూడాన్ దేశాల ప్రయాణికులపై నిషేధం విధిస్తూ 2017లోనే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వివక్షతో కూడుకుని ఉన్నదని ఈ నిషేధాన్ని న్యాయస్థానాల్లో కూడా సవాలు చేశారు. ఏది ఏమైనప్పటికీ తాజా ప్రకటన ట్రంప్‌కు మద్దతునిచ్చే ఓటర్లలో గణనీయమైన ఆకర్షణను కలిగి ఉంది. ఈ ప్రకటన ఆయన కఠినమైన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే.. జో బైడెన్ అధికారంలోకి రాగానే 2021 ప్రారంభంలోనే ట్రంప్ చేసిన ప్రయాణ నిషేధాన్ని రద్దు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తాజా ప్రకటనను శ్వేతసౌధం ఖండించింది. ఇదీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. జో బైడెన్ కీలక సూచన -
నన్ను వెళ్లనివ్వు
‘‘దేశానికి ఆపద, ప్రజలకు ప్రమాదం వచ్చిపడ్డాయి. కౌరవసేనను ఎదిరించడానికి తనకో సారథి కావాలంటున్నాడు రాకుమారుడు. అతని శౌర్యధైర్యాలు సారథి లేనికారణంగా నిర్వీర్యం కావడానికి వీలు లేదు. బృహన్నల ఒకప్పుడు సారథి. అర్జునుడి దగ్గర అస్త్రవిద్య నేర్చుకున్నవాడు. అందువల్ల ఉత్తరకుమారుడికి సారథిగా పంపితే కార్యం సానుకూలమవుతుంది’’ అని సలహా చెప్పింది సైరంధ్రి. అలాగే అన్నాడు ఉత్తరకుమారుడు. బృహన్నలను పిలిచి ‘‘కౌరవులు మన గోవులను అపహరించుకుపోతున్నారు. వెంటనే రథం సిద్ధం చెయ్. కౌరవుల్ని పట్టుకుని నా ప్రతాపం చూపించాలి. తొందరగా పద’’ అంటూ హెచ్చరించాడు ఉత్తరకుమారుడు. క్షణాలలో రథం సిద్ధమైంది. గుర్రాలు ఆగమేఘాల మీద పోతున్నాయి. మహాసముద్రంలా ఉన్న కౌరవసేనను చూడగానే ఉత్తరకుమారుడి గుండెలు అవిసిపోయాయి. కాళ్లు గజగజా వణుకుతుండగా రథం మీద నిలబడటానికి కూడా ఓపిక లేనట్లుగా కూలబడిపోయాడు. ‘‘బృహన్నలా! మనవల్ల కాదు. రథాన్ని వెనక్కి తిప్పు. వెళ్లిపోదాం. బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అన్నాడు. బృహన్నల చిరునవ్వు నవ్వాడు. ‘‘ఉత్తరకుమారా! నువ్వు రాకుమారుడివి. అంతఃపుర స్త్రీల ముందు అనేక ప్రతిజ్ఞలు చేసి మరీ యుద్ధభూమికి వచ్చావు. మనం ఇప్పుడు శత్రువులకు భయపడి ఆవుల్ని తీసుకెళ్లకుండా ఉత్తిచేతులతో వెళ్తే మనల్ని చూసి అందరూ నవ్వుతారు. వెనకాముందూ చూసుకోకుండా బీరాలు పలకకూడదు. ధైర్యంగా పోరాడు. వెనక్కి వెళ్లే ఆలోచన మానుకో’’ అన్నాడు బృహన్నల. ‘‘నావల్ల కాదు, ఆడవాళ్లు నవ్వితే నవ్వనీ. ఎగతాళి చేస్తే చేయనీ, నన్ను మాత్రం వెళ్లనివ్వు’’ అంటూ రథం మీదినుంచి కిందికి దూకి పిచ్చివాడిలా పరుగెత్తుతున్న ఉత్తరకుమారుడి వెంటపడి పట్టుకున్నాడు బృహన్నల. అతన్ని రథం మీద కూర్చోబెట్టి తానే కార్యక్రమం నడిపించాడు. ప్రజల ముందు డాంబికాలు పలికి తీరా యుద్ధభూమికి వచ్చాక బెదిరిపోయి తిరుగుముఖం పట్టి పారిపోయిన ఉత్తరకుమారుడి కథ చెప్పే నీతి ఒకటే తగని మాటలు చెప్పకండి. తగని పనులు చేయకండి అని. -
గ్లోబల్ జర్నలిజం కోసం రూ.650 కోట్లు
వాషింగ్టన్ : స్వతంత్ర మీడియా, స్వేచ్ఛాయుత జర్నలిజం కోసం రాబోయే మూడేళ్లలో రూ.650 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఈబే సంస్థ వ్యవస్థాపకుడు పెర్రీ ఒమిడియార్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తప్పుడు సమాచారంతో పాటు, విద్వేష ప్రసంగాలను నిరోధించడానికి వినియోగిస్తామన్నారు. గతంలో పనామా పేపర్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) సంస్థకు తన దాతృత్వ సంస్థ ఒమిడియార్ నెట్వర్క్ ఇనిషియేటివ్(ఓఎన్ఐ) ద్వారా పెర్రీ 4.5 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించారు. ప్రస్తుతం ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా స్పందించకపోవడంతో పాటు, మీడియా సంస్థలు నమ్మకాన్ని కోల్పోవడం, తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నాయని ఓఎన్ఐ సభ్యుడు మ్యాట్ బెన్నిక్ తెలిపారు. సమాచార స్వేచ్ఛతో పాటు ప్రజల భాగస్వామ్యం, బాధ్యతాయుత జర్నలిజంకు తాము కట్టుబడి ఉన్నట్లు మాట్ స్పష్టం చేశారు. ఒమిడియార్ తన సొంత వార్తా నెట్వర్క్ ‘ది ఇంటర్సెప్ట్’లో రానున్న కాలంలో 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల యూదులపై విద్వేషాన్ని నిరోధించడానికి పోరాడే యాంటి డిఫమేషన్ లీగ్(ఏడీఎల్), లాటిన్ అమెరికాలో ప్రభుత్వాల జవాబుదారి కోసం పోరాడే లాటిన్ అమెరికన్ అలయెన్స్ ఫర్ సివిక్ టెక్నాలజీ(ఏసీటీ) సంస్థలు లబ్ధి పొందనున్నాయి. ఫ్రాన్స్‌లో జన్మించిన ఒమిడియార్ ఇరానియన్-అమెరికన్ పౌరుడు. -
మోదీ స్కీమ్‌కు 200 కిలోల షిరిడీ బంగారం!
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌కు దేవాలయాల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటీవలే సిద్ధి వినాయక దేవాలయం 40 కేజీల బంగారాన్ని ఈ పథకం కింద డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకోగా తాజాగా షిరిడీ సాయి బాబా ఆలయం నిర్వాహకులు ఇదే బాటలో పయనించాలని భావిస్తున్నారు. అయితే షిరిడీ సాయి దేవాలయ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో.. 200 కేజీల బంగారాన్ని ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి గతంలో బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకిగా ఉంది. భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని కరగదీయొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా బంగారాన్ని డిపాజిట్ చేసే విధంగా కోర్టు నుండి అనుమతులు పొందడానికి పిల్ దాఖలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. బంగారంపై వచ్చిన వడ్డీని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని, కోర్టు నుండి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే షిరిడీ ఆలయంలోని బాబా విగ్రహంపై ఉన్నటువంటి 180 కేజీల బంగారాన్ని మాత్రం అలాగే ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. అది కాకుండానే 200 కిలోల బంగారం షిరిడీ ఆలయానికి ఉంది. బంగారానికి భద్రత ఏర్పాట్లు చేయడం ఆలయ నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారిన నేపథ్యంలో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేయాలని నిర్ణయించారు. -
భార్య తాకట్టు...హత్య
చండీగఢ్: ఆపదలో వున్నపుడు, ఆర్థిక అవసరాలకోసం విలువైన వస్తువులను, ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలు విషయమే. కానీ ముప్పయి వేలకోసం భార్యను తాకట్టుపెట్టాడు హర్యానాలోని ఓ వ్యక్తి. అయితే తీసుకున్న అప్పు చెల్లించినా భార్యను విడుదల చేయడానికి నిరాకరించిన సదరు వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు ఉన్నతాధికారుల కథనం ప్రకారం సల్మాను సబ్బీర్ ఇద్దరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. కొంతకాలం క్రితం హరియాణా వచ్చిన స్థానికంగా ఒకఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ పొట్ట పొసుకుంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. బొంతలు కుట్టి అమ్ముకునే గోలం, సబ్బీర్ దంపతులు పక్క పక్కనే ఉండేవారు. ఈ క్రమంలో గోలం దగ్గర భార్య సల్మాను తాకట్టుపెట్టాడు సబ్బీర్ . కొంతకాలానికి ఎలాగోలా కష్టపడి ఆ అప్పును తీర్చేశాడు. కానీ సల్మాను విడిచిపెట్టడానికి గోలం నిరాకరించడంతో పాటుగా మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై నిలదీయడానికి అతని స్నేహితులు అక్తర్, గౌరవ్ తో కలిసి గోలం నివాసానికి వెళ్లాడు. అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే గోలంను హత్యచేసి సమీపంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయారని డిఎస్పీ రాజేంద్ర కుమార్ తెలిపారు అక్టోబర్ 31న హత్య జరిగితే నవంబర్ 1 న తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక యమునానగర్ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ మృతదేహం ఆచూకీ కోసం ఆరాతీయగా బొంతలు తయారు చేసుకొనే గోలందిగా స్థానికులు గుర్తించారు. హత్యకేసుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఎట్టకేలకు గత ఆదివారం ఛేదించారు. అనుమానాస్పద వ్యక్తులుగా సబ్బీర్, సల్మా దంపతులను అదుపులోకి ప్రశ్నించగా, నేరాన్ని అంగీకరించారు. అయితే గోలం ను హత్యచేసిన విషయాన్ని అతని బంధువులకు సమాచారం అందించినట్టు సల్మా పోలీసులతో చెప్పింది. ఈ విషయాన్ని గోలం బంధువు ఆలం కూడా ధృవీకరించారు. వారి మధ్య జరిగిన లావేదేవీల గురించి తనకు తెలియదు గానీ, గోలందగ్గర పాటుగా సల్మా నాలుగు ఉన్నట్టు అంగీకరించారు.