విశాఖకు మోడీ... 1.20 నుంచి ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: హుదూద్ తుపాన్ సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించేందకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం 1.05 గంటలకు ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 1.20 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా విశాఖపట్నంతోపాటు దక్షిణ ఒడిశాలోని ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించానున్నారు. సర్వే అనంతరం విశాఖ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.20కి మళ్లీ విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకుని న్యూఢిల్లీ పయనమవుతారు.