PMP
-
ఆర్ఎంపీ, పీఎంపీలను నియంత్రించాలి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం లేని ఆర్ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు), పీఎంపీ (ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు)లను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. గ్రామాల్లో క్లినిక్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాల నిర్వహణకు అనుమతిస్తూ 2009లో జారీ చేసిన జీవో 1273ని రద్దు చేయాలని కోరుతూ హెల్త్‌కేర్ రీఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.మహేశ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. నైపుణ్యం ఉన్న వైద్యులు నిర్వర్తించాల్సిన విధులను ఆర్ఎంపీలు, పీఎంపీలు నిర్వర్తిస్తున్నారని, వారిని నిరోధించాలని పేర్కొన్నారు. ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఇస్తున్న కమ్యూనిటీ పారా మెడికల్ సర్టిఫికెట్లను జారీ చేయకుండా ఆదేశించాలని కోరారు. వైద్య రంగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 50 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య మండలి, పారా మెడికల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, వీరి శిక్షణకు సంబంధించి ఎలాంటి రికార్డుల్లేవని తెలిపారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలకు సర్టిఫికెట్లు ఇవ్వండి
వైద్య మంత్రికి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల జేఏసీ చైర్మన్, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ వైద్య మంత్రి లక్ష్మారెడ్డిని కోరారు. శనివారం సచివాలయంలో వైద్యుల సమస్యలపై మంత్రి లక్ష్మా రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీతో వైద్యుల జేఏసీ భేటీ అయింది. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆరోగ్యశాఖ ప్రవేశపెట్టే పలు పథకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభైవేల మంది శిక్షణ పొందిన ఆర్ఎంపీ, పీఎంపీలను ఉపయోగించుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వని వారికి తక్షణమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కనకయ్య, జూపల్లి రాజేందర్, శంకర్ ముదిరాజ్, బాల బ్రహ్మచారి, వెంకట్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎంపీ నిబంధనల్లో మార్పులు కోరిన యాపిల్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఫేజ్డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ)లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని కోరింది. కంపెనీ భారత్‌లో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోన్న విషయం తెలిసిందే. ఉపకరణాల తయారీలో ఉపయోగించే పలు విడిభాగాలు, యాక్ససరీస్‌పై పన్ను ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు అందించడం ద్వారా దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎంపీ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఈఐటీవై) యాపిల్ అంశంపై దృష్టిసారించింది. మొబైల్స్ విడిభాగాలకు సంబంధి పన్నుల నిర్మాణంపై వారు పూర్తి స్పష్టత కోరుకుంటున్నారు. ప్రస్తుత పీఎంపీ ప్రకారమైతే యాపిల్ ప్రణాళికలు కార్యరూపం దాల్చేలా లేవు’ అని ఒక అధికారి తెలిపారు. ఇక డీఈఐటీవై కూడా విడిభాగాల ప్రాతిపదికన యాపిల్‌తో చర్చలు జరుపుతోందన్నారు. -
మొబైల్స్ తయారీ ఇండస్ట్రీ ఎన్నికోట్లో తెలుసా?
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్ సెట్లకు ప్రధాన మార్కెట్ లో ఒకటి భారత్. ఈ మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ఇండస్ట్రీ వచ్చే 5-7 ఏళ్లలో భారీగా అభివృద్ధి చెందనుందట. వచ్చే ఏళ్లలో ఈ ఇండస్ట్రీ 500 బిలియన్ డాలర్లకు అంటే 32,50,000 కోట్లకు చేరుకోనుందని అంచనాలు వెలువడుతున్నాయి. దశలవారీగా తయారుచేసే కార్యక్రమం(పీఎంపీ) ద్వారా మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ఇండస్ట్రీ ఈ మేర పెరుగనుందని ఐటీ సెక్రటరీ అరుణా సుందరరాజన్ తెలిపారు. స్థానిక ఉత్పత్తిని పెంచడానికి ప్రధాన ప్రోత్సహకంగా బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉందన్నారు. టెక్ దిగ్గజం ఆపిల్ తన మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించాలంటే, పీఎంపీతో మీడియం టర్మ్ మానుఫ్రాక్ట్ర్చరింగ్ ప్లాన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్పారు. మొబైల్, కాంపొనెట్ మానుఫ్రాక్ట్ర్చరింగ్ హబ్ గా దేశాన్ని తీర్చిదిద్దడానికి ఓ టైమ్-బౌండ్ ప్రేమ్ వర్క్ లా ఈ పాలసీ ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాక ఈ ప్రక్రియలో భాగంగా 5.6 మిలియన్ ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. '' ఈ ఇండస్ట్రీ 500 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. దానిలో 230 బిలియన్ డాలర్లు మొబైల్ ఫోన్లు, 270 బిలియన్ డాలర్లు కాంపొనెంట్లకు చెందినది ఉంటాది. పీఎంపీ ద్వారా 40 శాతం గ్లోబల్ డిమాండ్ ను అందుకుంటాం'' అని సుందరరాజన్ చెప్పారు. పీఎంపీ ద్వారా 1.25 బిలియన్ ఫోన్లను ఉత్పత్తి చేసి, వాటిలో 800మిలియన్ ఫోన్లను వచ్చే ఐదు లేదా ఏడేళ్లలో ఎగుమతులు చేపడతామని సుందరరాజన్ విశ్వసిస్తున్నారు.