మొబైల్స్ తయారీ ఇండస్ట్రీ ఎన్నికోట్లో తెలుసా?
Published Wed, May 3 2017 4:42 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్ సెట్లకు ప్రధాన మార్కెట్ లో ఒకటి భారత్. ఈ మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ఇండస్ట్రీ వచ్చే 5-7 ఏళ్లలో భారీగా అభివృద్ధి చెందనుందట. వచ్చే ఏళ్లలో ఈ ఇండస్ట్రీ 500 బిలియన్ డాలర్లకు అంటే 32,50,000 కోట్లకు చేరుకోనుందని అంచనాలు వెలువడుతున్నాయి. దశలవారీగా తయారుచేసే కార్యక్రమం(పీఎంపీ) ద్వారా మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ఇండస్ట్రీ ఈ మేర పెరుగనుందని ఐటీ సెక్రటరీ అరుణా సుందరరాజన్ తెలిపారు. స్థానిక ఉత్పత్తిని పెంచడానికి ప్రధాన ప్రోత్సహకంగా బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉందన్నారు. టెక్ దిగ్గజం ఆపిల్ తన మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించాలంటే, పీఎంపీతో మీడియం టర్మ్ మానుఫ్రాక్ట్ర్చరింగ్ ప్లాన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్పారు.
మొబైల్, కాంపొనెట్ మానుఫ్రాక్ట్ర్చరింగ్ హబ్ గా దేశాన్ని తీర్చిదిద్దడానికి ఓ టైమ్-బౌండ్ ప్రేమ్ వర్క్ లా ఈ పాలసీ ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాక ఈ ప్రక్రియలో భాగంగా 5.6 మిలియన్ ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. '' ఈ ఇండస్ట్రీ 500 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. దానిలో 230 బిలియన్ డాలర్లు మొబైల్ ఫోన్లు, 270 బిలియన్ డాలర్లు కాంపొనెంట్లకు చెందినది ఉంటాది. పీఎంపీ ద్వారా 40 శాతం గ్లోబల్ డిమాండ్ ను అందుకుంటాం'' అని సుందరరాజన్ చెప్పారు. పీఎంపీ ద్వారా 1.25 బిలియన్ ఫోన్లను ఉత్పత్తి చేసి, వాటిలో 800మిలియన్ ఫోన్లను వచ్చే ఐదు లేదా ఏడేళ్లలో ఎగుమతులు చేపడతామని సుందరరాజన్ విశ్వసిస్తున్నారు.
Advertisement
Advertisement