ఆర్‌ఎంపీ, పీఎంపీలకు సర్టిఫికెట్లు ఇవ్వండి
వైద్య మంత్రికి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల జేఏసీ చైర్మన్, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ వైద్య మంత్రి లక్ష్మారెడ్డిని కోరారు. శనివారం సచివాలయంలో వైద్యుల సమస్యలపై మంత్రి లక్ష్మా రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీతో వైద్యుల జేఏసీ భేటీ అయింది.
అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఆరోగ్యశాఖ ప్రవేశపెట్టే పలు పథకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభైవేల మంది శిక్షణ పొందిన ఆర్‌ఎంపీ, పీఎంపీలను ఉపయోగించుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వని వారికి తక్షణమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కనకయ్య, జూపల్లి రాజేందర్, శంకర్ ముదిరాజ్, బాల బ్రహ్మచారి, వెంకట్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.