podium
-
హైదరాబాద్‌లో పోడియం పార్కింగ్ !
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లో పోడియం పార్కింగ్‌కు కూడా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భవన నిర్మాణ నియమావళి (జీవో నం.168)కు ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్, ఆపై కొన్ని ఫ్లోర్లను పార్కింగ్ అవసరాలకు తగ్గట్లు నిర్మించుకుని, ఆ తర్వాతి ఫ్లోర్లను నివాస/కమర్షియల్ అవసరాల కోసం నిర్మించుకోవడానికి పోడియం పార్కింగ్ రూల్స్ వీలు కల్పించనున్నాయి. దీంతో అండర్ గ్రౌండ్ పార్కింగ్, పోడియం పార్కింగ్ రెండింటిలో ఏదో ఒక పార్కింగ్ సదుపాయాన్ని ఎంపిక చేసుకుని నిర్మాణాలు చేపట్టడానికి బిల్డర్లు, డెవలపర్లకు అవకాశం కలిగింది. అండర్ గ్రౌండ్‌పై నిషేధం లేదు రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను నిషేధించలేదని, కొత్తగా పోడియం పార్కింగ్ రూల్స్‌ను మాత్రమే అమల్లోకి తెచ్చినట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ రెండు పార్కింగ్ సదుపాయాల్లో ఏదో ఒక దాన్ని బిల్డర్లు, డెవలపర్లు ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పోడియం పార్కింగ్ రూల్స్ పోడియం ఫ్లోర్ గరిష్ట ఎత్తు 15 మీటర్లు ఉండాలి. భవన నిర్మాణ నియమావళి, అప్రోచ్ రోడ్డు వైశాల్యం ఆధారంగా భవనం ఎత్తు ఉండాలి. పదెకరాలకు పైబడిన స్థలంలో నిర్మించే భవనాల్లో తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ పోడియం ఫ్లోర్లు ఉండాలి. భవనం ఎత్తు, సెట్ బ్యాక్స్ లెక్కించే సమయంలో పోడియం ఫ్లోర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించారు. పోడియం సెట్‌బ్యాక్స్... - 55 మీటర్ల వరకు ఎత్తు గల భవనం విషయం లో 12 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో 7 మీటర్ల సెట్ బ్యాక్ తప్పనిసరి. రెండు పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్ డ్రైవ్ అవే) 7 మీటర్లు ఉండాలి. - 55 మీటర్లకు మించి ఎత్తు కలిగిన భవనాల విషయంలో 14 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో 7 మీటర్ల సెట్‌బ్యాక్ తప్పనిసరి. పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్ డ్రైవ్ అవే) 9 మీటర్లు ఉండాలి. - పోడియంపై ఉండే భవనం సెట్ బ్యాక్‌లు బిల్డింగ్ రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. పోడియానికి వదిలిన సెట్‌బ్యాక్‌ను సైతం భవనం సెట్‌బ్యాక్‌లో భాగంగా పరిగణిస్తారు. - పోడియం ఫ్లోర్లను అనుమతిస్తే బేస్మెంట్/సెల్లార్ ఫ్లోర్ల సంఖ్యపై ఆంక్షలు ఉంటాయి. కమర్షియల్ భవనాల విషయంలో మూడు బేస్ మెంట్, నివాస భవనాల విషయంలో రెండు బేస్ మెంట్స్ మాత్రమే అనుమతిస్తారు. - పోడియం సెట్‌బ్యాక్‌లకు సమాన రీతిలో బేస్ మెంట్స్ సెట్‌బ్యాక్స్ ఉండాలి. - పోడియంపై టాట్–లాట్ అనుమతిస్తారు. - భవనం 10 వేల చదరపు మీటర్లలోపు ఫ్లోర్ ఏరియా మాత్రమే కలిగి ఉంటే కనీసం మూడో వంతు భవనంతో పాటు భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునేలా భవనం చుట్టూ సెట్‌బ్యాక్స్ ఉండాలి. - భవనం 10వేల చదరపు మీటర్లకు పైగా ఫ్లోర్ ఏరియా కలిగి ఉంటే కనీసం సగభాగం భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునే విధంగా సెట్‌బ్యాక్స్ ఉండాలి. - పోడియం ఫ్లోర్లను ప్రత్యేకంగా పార్కింగ్ కోసమే వినియోగించాలి. అయితే, విజిటర్స్ లాబీలు, డ్రైవర్ల కోసం వేయిటింగ్ రూమ్స్, టాయిలెట్ల సదుపాయాన్ని కల్పించవచ్చు. విజిటర్స్ లాబీల కోసం గరిష్టంగా 2%, డ్రైవర్లకు సదుపాయాల కోసం గరిష్టం 10 శాతం ఫ్లోర్ ఏరియాను మాత్రమే వినియోగించాలి. - రోడ్డుకు వెళ్లే మార్గం, పోడియం మధ్య ఎలాంటి గోడలు ఉండరాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్నాక పోడియం పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని వేరే అవసరాల కోసం దుర్వినియోగం చేస్తే, ఆ స్థలాలను సంబంధిత పురపాలిక జప్తు చేసుకుని తన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటుంది. -
బెజవాడ మున్సిపల్ సమావేశం రసాభాస
విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సభ మంగళవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యర్థులను అరెస్ట్ చేయడం అమానుషమని సభలో వైఎస్ఆర్ సీపీ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. ఇంతలో సభ సజావుగా జరిగేలా చూడాలంటూ మేయర్ సదరు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మేయర్ పోడియం వద్దకు చేరిన వైఎస్ఆర్ సీపీ కార్పోరేటర్లు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అక్కడితో ఆగకుండా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంతలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని... ధర్నాకు దిగిన కార్పోరేటర్లను శాంతింప చేశారు. -
బెజవాడ మున్సిపల్ సమావేశం రసాభాస
-
సోనియాకు కోపమొచ్చింది!
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ సభ్యుడొకరు తనపై చేసిన ఆరోపణపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు! ఎప్పుడూ లేని విధంగా తన సీటు వద్ద నుంచి వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళన చేశా రు. ‘ఆయన ఏమన్నారు? ఏంటిది?’ అని స్పీకర్‌ను ఉద్దేశించి ఆవేశంగా అన్నారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులంతా ఆందోళన చేయడంతో సభ గంటపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. లలిత్‌మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్న సమయంలో.. బీజేపీ ఎంపీ ఒకరు నల్లధనం విషయంలో సోనియాపై ఆరోపణ చేయడం దీనికి కారణమైంది. అయితే బీజేపీ సభ్యుడు ఏమన్నారో తనకు వినబడలేదని, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పరి శీలిస్తానని స్పీకర్ చెప్పారు. అయినా సోనియాతోపాటు కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. బీజేపీ సభ్యుడు క్షమాపణ చెప్పాల్సిందేనని ఖర్గే డిమాండ్ చేశారు. గొడవ సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2.45 వరకువాయిదా వేశారు. తర్వాత సభ సమావేశమైన తర్వాత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఎవరు ఎవరిపైనా ఆరోపణ చేసుకోవద్దని కోరారు. సోనియాపై చేసిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. ఇదిలా ఉండ గా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యు లకు అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం రాత్రి విందును ఇచ్చారు. -
వెల్‌లోకి దూసుకెళ్లిన సోనియా.. సభ వాయిదా
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లలిత్ గేట్ వివాదంపై లోక్‌సభలోచర్చకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో చర్చ వాడి వేడిగా సాగింది. కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీలు సహా సోనియా గాంధీ స్పీకర్ పోడియం ముందుకు దూసుకు రావడంతో గందరగో్ళం చెలరేగింది. దీంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను వాయిదా వేశారు. సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మల్లి ఖార్జున ఖర్గే తన విశ్వ రూపాన్ని చూపించారు. ప్రధాని నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. టీవీలు, రేడియోల్లో మాట్లాడుతారుగానీ చట్టసభలో ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వర్డ్ వార్ జరిగింది. దీంతో సోనియా సహా మిగిలిన ఎంపీలందరూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నినాదాలతో, ఆందోళనతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో 2.30 వరకు సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభలో్ గందరగోళం కొనసాగుతోంది. విపక్షాల నిరసనలతో ఇప్పటికి రెండు సార్లువాయిదా పడింది. కాగా వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి ఈ విషయంపై మొండిగా వ్యవహరించిన కేంద్రం ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చింది. కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ సుమిత్ర మహాజన్ బుధవారం అంగీకరించారు.