Poland team
-
ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్ జెట్స్ సాయంతో ఖతార్‌కు
విశ్వవ్యాప్తంగా యమ క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ సమరానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే సాకర్ సమరంలో పాల్గొననున్న 32 జట్లు ఖతార్‌కు చేరుకున్నాయి. ఇక నవంబర్ 20 నుంచి గోల్స్ వర్షం మొదలుకానుంది. ఇదిలా ఉంటే ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పోలాండ్ జట్టు ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌తో రావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బహుశా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే ఒక జట్టు ఎస్కార్ట్‌తో రావడం ఇదే తొలిసారి అనుకుంటా. పోలాండ్ ఇలా ఎస్కార్ట్‌తో రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై తొమ్మిది నెలలు కావొస్తున్నప్పటికి ఇప్పటికి మిస్సైల్ దాడులు జరగుతూనే ఉన్నాయి. అయితే పోలాండ్ రష్యా-ఉక్రెయిన్లకు బార్డర్ దేశంగా ఉంది. పోలండ్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్ జరగనున్న ఖతార్‌కు వెళ్లాలంటే ఈ రెండు దేశాల ఎయిర్‌బేస్‌ను దాటుకొని వెళ్లాల్సిందే. ఈ మధ్యనే ఉక్రెయిన్-పోలాండ్ బార్డర్లో రష్యా జరిపిన దాడిలో ఇద్దరు పోలాండ్ వ్యక్తులు కూడా మృతి చెందారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పోలాండ్ దేశం తమ ఫుట్‌బాల్ టీం ఖతార్‌కు వెళ్లాలంటే ఎస్కార్ట్ తప్పనిసరన్న విషయాన్ని గుర్తించింది. అందుకే ఖతార్‌కు బయలుదేరిన పోలాండ్ జట్టు విమానానికి ఫైటర్ జెట్-16ను ఎస్కార్ట్‌గా పంపింది. మధ్యలో విమానం వెళ్లగా.. ఇరువైపులా ఫైటర్ జెట్స్-16 ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఇది చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఇక విమానం ఖతార్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫైటర్ జెట్స్ మళ్లీ పోలాండ్‌కు చేరుకున్నాయి. ఇదే విషయాన్ని పోలాండ్ ఫుట్‌బాల్ టీమ్ తమ ట్విటర్లో వీడియో రూపంలో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం కారణంగా భయపడిన పోలాండ్ జట్టు ఎలాగోలా ఎస్కార్ట్ సాయంతో ఖతార్‌లో అడుగుపెట్టింది. ''ఫిఫా చరిత్రలోనే ఒక జట్టు ఇలా ఎస్కార్ట్‌తో వెళ్లడం ఇదే తొలిసారి'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో పోలాండ్ జట్టు గ్రూప్-సిలో ఉంది. ఇదే గ్రూప్‌లో మెక్సికో, అర్జెంటీనా, సౌదీ అరేబియాలు కూడా ఉన్నాయి. కాగా పోలాండ్ వచ్చే మంగళవారం మెక్సికోతో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఉన్న రాబర్ట్ లెవాండోస్కీ పోలాండ్ జట్టు కెప్టెన్‌గా ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న రాబర్ట్ లెవాండోస్కీనే జట్టుకు పెద్ద బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత నవంబర్ 26న సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇక చివరగా నవంబర్ 30న మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనాతో మ్యాచ్ ఆడనుంది. 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశకు చేరిన పోలాండ్ మళ్లీ ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేకపోయింది. Do południowej granicy Polski eskortowały nas samoloty F16! ✈️ Dziękujemy i pozdrawiamy panów pilotów! 🇵🇱 pic.twitter.com/7WLuM1QrhZ — Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022 ✈️ #KierunekKatar 🇵🇱 pic.twitter.com/1dFSxFt5ka — Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022 చదవండి: 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది' FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు' -
పోలాండ్ షూట్... స్విస్ అవుట్
► తొలిసారి క్వార్టర్స్‌కు చేరిన పోలాండ్ ► షూటౌట్లో స్విట్జర్లాండ్‌కు నిరాశ ► యూరో కప్ టోర్నీ సెయింట్ ఎటెని (ఫ్రాన్స్): కీలకదశలో ఒత్తిడిని అధిగమించిన పోలాండ్ జట్టు ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోలాండ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4తో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో అరగంటపాటు అదనపు సమయం పొడిగించారు. అయితే అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోవడంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో స్విట్జర్లాండ్ తరఫున రెండో కిక్‌ను జాకా వృథా చేయగా... మిగతా నలుగురు ఆటగాళ్లు స్కోరు చేశారు. మరోవైపు పోలాండ్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లూ సఫలమై చిరస్మరణీయ విజయాన్ని సాధించారు. యూరో టోర్నీ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశకు చేరుకున్న పోలాండ్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన పోలాండ్ అవకాశం దొరికినపుడల్లా స్విట్జర్లాండ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఎట్టకేలకు ఆ జట్టు 39వ నిమిషంలో ఖాతా తెరిచింది. ఎడమవైపు నుంచి గ్రోసిస్కీ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న బ్లాస్జికౌస్కీ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో పోలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు స్కోరును సమం చేయాలనే ఏకైక లక్ష్యంతో జోరు పెంచారు. అయితే పోలాండ్ గోల్‌కీపర్ లుకాస్ ఫాబియాన్స్కీ వారికి అడ్డుగోడలా నిలిచాడు. ఇక పోలాండ్ విజయం ఖాయమైందని అనుకుంటున్న తరుణంలో... స్విస్ స్టార్ జెర్దాన్ షాకిరి 82వ నిమిషంలో గాల్లో తేలుతూ బైసైకిల్ కిక్‌తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నిర్ణీత సమయం ముగిసేలోపు రెండుసార్లు పోలాండ్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా ఆ జట్టు ఆటగాళ్లు వృథా చేసుకున్నారు. అయితే షూటౌట్లో మాత్రం గురి తప్పకుండా విజయాన్ని ఖాయం చేసుకున్నారు. వేల్స్ జోరు... తొలిసారి యూరో టోర్నమెంట్లో ఆడుతోన్న వేల్స్ జట్టు మరో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. నార్తర్న్ ఐర్లాండ్‌తో శనివారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో వేల్స్ జట్టు 1-0తో గెలుపొందింది. ఆట 75వ నిమిషంలో నార్తర్న్ ఐర్లాండ్ ఆటగాడు మెకౌలే ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో వేల్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వేల్స్ స్టార్ ప్లేయర్ గ్యారెత్ బేల్ ఆడిన క్రాస్ షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు నుంచి తప్పించబోయిన నార్తర్న్ ఐర్లాండ్ ఆటగాడు మెకౌలే బంతిని తమ గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో వేల్స్ ఖాతాలో గోల్ చేరింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్ చేసిన బేల్ నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు సెల్ఫ్ గోల్ చేయడంలో కీలకపాత్ర పోషించడం విశేషం. -
భారత్ మహిళల బోణీ
యాంట్‌వర్ప్ (బెల్జియం) : వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత మహిళల హాకీ జట్టు మూడో మ్యాచ్‌లో తేరుకుంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పోలండ్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్‌కు క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా నిలిచాయి. భారత్ తరఫున రాణి రాంపాల్ (20వ, 29వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... వందన కటారియా (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. పోలండ్‌కు మగ్దలీనా జగాజ్‌స్కా (50వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించింది. ఈనెల 27న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. పోలండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి క్షణం నుంచే దూకుడుగా ఆడింది. 16వ నిమిషంలో భారత్‌కు వెంటవెంటనే రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ఈసారి రాణి వీటిని లక్ష్యానికి చేర్చలేకపోయింది. అయితే 20వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను రాణి రాంపాల్ గోల్‌గా మలిచింది. అనంతరం 29వ నిమిషంలో కెప్టెన్ రాణి అందించిన పాస్‌ను రాణి రాంపాల్ చాకచక్యంతో గోల్ పోస్ట్‌లోనికి పంపించింది. చివరి క్వార్టర్లో వందన గోల్‌తో భారత్ విజయం ఖాయమైంది.