polavaram contractors
-
టీడీపీ నేత దేవినేనిని నమ్మి మోసపోయాం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
బాబు 40ఏళ్ల అనుభవం అక్కరకొచ్చిందా..?
సాక్షి, అమరావతి : నలభై ఏళ్ల అనుభవం.. రాజధానికి ఒక్క శాశ్వత ఇటుక కూడా వేయలేకపోయింది.. సమర్థుడిని, పాలనాదక్షుడినని చెప్పుకునే నాయకుడి ఐదేళ్ల పాలనలో స్వయంగా సీఎం నివాసానికి కూతవేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పూర్తికాలేదు. దార్శనికుడి ఐదేళ్ల ఏలుబడిలో... రాజధానిలో భాగమైన విజయవాడ, గుంటూరు నగరాలు మురికి కూపాలుగా మారింది వాస్తవం కాదా? నిప్పునని నిత్యం చెప్పుకునే నిజాయితీపరుడి రాజ్యంలో.. లక్షల కోట్లు అవినీతి ఎలా జరిగింది? రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నానని ఊదరగొట్టే.. కూలీనెం.1 ఐదేళ్ల పరిపాలనలో చిన్నచిన్న పెండింగ్ పనులు సైతం పూర్తికాలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు, ప్రజాధనం దుబారా, విలువలకు తిలోదకాలు.. ప్రచార కండూతి.. ఇవి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కనిపించే సచిత్ర దృశ్యాలు. అనుభవజ్ఞుడి ఐదేళ్ల అసమర్థ,అవినీతి పాలననే.. స్వర్ణాంధ్ర అనుకుందామా..? నలభై ఏళ్ల అనుభవంతో ఆంధ్రావనికి అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తానన్నారు..కాని ఐదేళ్లుగా రాజధాని కోసం కనీసం ఒక్క శాశ్వత ఇటుకైనా వేశారా.. రైతుల నుంచి 35 వేల ఎకరాల పంట భూములు లాక్కోవడం, తన వాళ్లకు కట్టబెట్టడం తప్ప.. రాజధాని నిర్మాణానికి ఒక్క రాయి అయినా ఎత్తారా? లేదే!!మరి అనుభవం అక్కరకొచ్చినట్టా... మాటలతో మభ్యపెట్టినట్టా..?! రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలకోసమే పని చేస్తున్నానంటూ..ఉపన్యాసాలు ఇస్తూ... గత ఐదేళ్లలో రాజధానిలో తాత్కాలిక సచివాలయం..తాత్కాలిక శాసనసభ.. శాసన మండలి.. అన్నీ తాత్కాలిక కట్టడాలే! ఈ తాత్కాలిక నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.11వేలను ఖర్చు చేసి తన కోటరీకి లబ్ధి చేకూర్చడం చంద్రబాబుకే చెల్లింది. అవినీతిలో ఎత్తిపోతలు నిజాయితీ... తాను నిప్పునని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ఇసుక, మట్టి, గనుల దగ్గర నుంచి రాజధాని భూముల వరకూ.. జన్మభూమి కమిటీల నుంచి టీడీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దల దాకా.. వాటాలు వేసుకొని మరీ సాగించిన దోపడీ పర్వం లక్షల కోట్లు దాటిందన్నది జగమెరిగిన సత్యం కాదా? అంతెందుకు ఒక్క పట్టిసీమ ఎత్తిపోతల్లోనే.. రూ.374 కోట్ల దోచేశారని కాగ్ ఇచ్చిన నివేదికే చంద్రబాబు అవినీతికి అధికారిక నిదర్శనం. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు నిప్పా.. అవినీతి కుప్పా? విలువలకు వలువలేవీ? నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్నా అంటూ పదే పదే చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. దేశంలో రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలింది చంద్రబాబేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశంలో ఆ ఎన్నికల్లోనే ఓటర్లకు డబ్బులను ఎరగా వేసి..ప్రలోభ పెట్టే కార్యక్రమానికి మొట్టమొదట సారిగా చంద్రబాబే ప్రారంభించారు. 1998 లోక్‌సభ మధ్యంతరఎన్నికల్లో.. 1999 సాధారణ ఎన్నికలు, 2004, 2014 ఎన్నికల్లోనూ ధనప్రవాహాన్ని ఏరులై పారించారు. నంద్యాల ఉప ఎన్నికలో ధనప్రవాహాన్ని పరాకాష్టకు చేర్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.30 కోట్లు వెదజల్లి.. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి.. వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లకుపైగా వెదజల్లి.. కొనుగోలు చేశారు. ఇవీ రాజకీయాల్లో చంద్రబాబు పాటిస్తున్న నైతిక విలువలు..! దుబారా బాబు రెవెన్యూ లోటు, ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. అందుబాటులో ఉన్న వనరులకు సమర్థవంగా వినియోగించుకుని.. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. గత ఐదేళ్లలో హంగులు ఆర్భాటాలు.. విందులు వినోదాలు.. స్వదేశీ, విదేశీ యాత్రలు.. విహారయాత్రలు.. రియాలిటీ షోల పేరుతో భారీఎత్తున ప్రజాధనాన్ని దుబారా చేశారు. రాజధానికి భూమి పూజ పేరుతో ఒకసారి.. శంకుస్థాపన పేరుతో మరోసారి.. ప్రభుత్వ భవనాల శంకుస్థాపన పేరుతో ఇంకోసారి.. రహదారులకు శంకుస్థాపన పేరుతో మరొకసారి.. ఇలా అనేకసార్లు రాజధానికి శంకుస్థాపనలు చేసి భారీగా రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. చివరకు పోలవరం విహారయాత్ర పేరుతో రూ.121.81 కోట్లను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు చెప్పండి ప్రజాధనాన్నిసద్వినియోగం చేసుకునే తీరు ఇదేనా? ప్రచార యావకి29 మంది బలి 2015లో గోదావరి పుష్కరాల ప్రారంభ ముహూర్తంలోనే గోదావరిలో స్నానం చేస్తే.. పుణ్యం వస్తుందంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. దాంతో రాజమహేంద్రవరానికి ప్రజలు పోటెత్తారు. సీఎం చంద్రబాబు నిబంధనల ప్రకారం– వీఐపీ ఘాట్ వద్ద స్నానం చేయకుండా.. భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చారు. భారీఎత్తున పోటెత్తిన భక్తుల నడుమ.. పుష్కరాల్లో తన వైభవాన్ని చాటిచెప్పేలా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రీకరణకుప్రయత్నించారు. చిత్రీకరణ పూర్తయి.. చంద్రబాబువెళ్లిపోయాక పుష్కర ఘాట్‌లోకి భక్తులను ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది కన్నుమూశారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో స్నానం చేసి ఉంటే ఈ ఘోరం జరిగేదా? ఇప్పుడు చెప్పండి చంద్రబాబు ప్రచార కండూతి వల్లే 29 మంది బలయ్యారన్నది వాస్తవం కాదా?! నీ అసమర్థ పాలనకు ‘దుర్గమ్మే’ సాక్షి తన సమర్థతతో, పాలనాదక్షతతో నవ్యాంధ్రను నిర్మిస్తానన్ననాయకుడు.. ఐదేళ్ల పాలన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల పొడవైన కనకదుర్గ ప్లైఓవర్‌ను కూడా నిర్మించలేకపోయారు.. కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా అంటే.. ఆగస్టు 12, 2016 నాటికే ప్లైఓవర్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా పుష్కరాలు పూర్తయి 32 నెలలు గడిచిపోయాయి. కానీ.. ప్లైఓవర్ పూర్తి కాలేదు. విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనేలేదు. ఇప్పుడు చెప్పండి.. బాబు సమర్థుడా.. పాలనా దక్షుడా?! లేక అది ఆయన అసమర్థతకు నిలువుటద్దమా?! సమీక్షలు సరే.. పనులెక్కడ? హార్డ్‌వర్క్.. ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్లు ఊదరగొట్టే చంద్రబాబు పాలన అంటే.. ఉత్తి సమీక్షలే సమీక్షలు.. పనులు నత్తనడక.. ఫలితాలు శూన్యం..! అనే విషయం ఏ చిన్న అధికారిని అడిగినా చెబుతారు. ఉదాహరణకు వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో కేవలం 3.2 కిమీల పనులు పూర్తి చేస్తే నీటిని విడుదల చేయవచ్చు. కానీ.. ఐదేళ్ల తర్వాత కూడా పనులు ముందుకు సాగక.. ఇప్పటికీ 2.8 కి.మీ. సొరంగం పనులు మిగిలిపోవడాన్ని బట్టి చూస్తేబాబు హార్డ్ వర్క్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. -
అవినీతిలో చంద్రబాబుది ‘గిన్నిస్’ రికార్డు
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఏవిధంగా ఖర్చు చేయాలనే దానిపై నిబంధనలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరీ దుబారా ఖర్చులు చేస్తుంది. విదేశీ పర్యటనల పేరుతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లపై తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాధారణ విమానాలలో రూ.వేల వ్యయంతో ప్రయాణిస్తుంటే.. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారు. ఓ పక్క ఆదాయం లేదంటూనే నెలకు ఒక్క రోజు కూడా ఉపయోగించని ప్రత్యేక బస్సును రూ.5.5 కోట్ల తో కొన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిలో భవనాలకు శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రాళ్ళు వేసి రూ.350 కోట్లు ఖర్చు చేయడం ఏ పరిపాలనానుభవం కిందకు వస్తుందో టీడీపీ నాయకులే చెప్పాలి’ అన్నారు.. ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం.. ‘పోలవరం సందర్శనకు రూ.84.5 కోట్లు పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాష్ట్రానికి అప్పగించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మొత్తం కేంద్రం మంజూరు చేస్తోంది. కేంద్ర నిధులను పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్ళించి తమకు సంబంధించిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంకా పూర్తిగా నిర్మించని పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని తరలించడానికి, ఉచితంగా భోజనాలు పెట్టడానికి, సుమారు రూ.84.5 కోట్లు ఖర్చు పెట్టారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో సుమారు రూ.63 కోట్లు ఖర్చు చేశారు. 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు చేతులు ఎత్తివేసి కేంద్రాన్ని విమర్శించడానికి పూనుకున్నాడు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఉండాల్సిన దానికన్నా అధిక వ్యయానికి టెండర్లు పిలవడాన్ని వివిధ కేంద్ర సంస్థలు తప్పు పట్టాయి. కేంద్రం ఇచ్చిన సొమ్ము ఎంత, పనులకు రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందీ శ్వేతపత్రం విడుదల చేయమంటే విడుదల చేయలేదు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి, భూముల వంటి అన్ని వనరులనూ దోచుకున్నారు. ఇలాంటి అవినీతి పాలనలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించాడు. అమరావతి కాదు భ్రమరావతి.. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సచివాలయం, హై కోర్టు, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా తదితర భవనాలు రాజధానిలో నిర్మించడానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వం భవనాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా శాశ్వత భవనం నిర్మాణం చేపట్టలేదు. హైకోర్టు, సచివాలయం వంటి వాటికి కూడా తాత్కాలిక భవనాలు నిర్మించారు. వర్షం వస్తే ఆ భవనాలలో నీరు చేరుతుంది. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను తన అనుయాయులకు, ప్రైవేటు విద్యావైద్య సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించకపోగా, వారికి ఉపాధి కల్పించలేదు. రైతులకు ఏవిధమైన ప్రభుత్వం నుంచి సహాయం అందక వీధిన పడ్డారు. దీక్షల పేరుతో రూ.కోట్ల దుర్వినియోగం నవ నిర్మాణ దీక్షల పేరుతో సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే దీక్షల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టింది. ఒక్క సంవత్సరం కూడా హైదరాబాద్ సచివాలయంలో ఉండకుండా సచివాలయం ఎల్ బ్లాక్ రిపేర్లుకు రూ.14.63 కోట్లు ఖర్చు చేశారు. దీనిని ఏవిధంగా సమర్థిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం మరమ్మతులకు సుమారు రూ.6.90 కోట్లు ఖర్చు చేశారు. తన కుటుంబాన్ని హోటల్ పార్కు హయాత్‌లో పెట్టి కోట్లు ఖర్చు చేయడం నిజం. దీని వలన ప్రజలకు ఒనగూరేది ఏమీ లేదు. పుష్కరాల పేరుతో కోట్లు ఖర్చు చేసి 29 మందిని బలి చేశారు. అనేక మంది క్షతగాత్రులవడానికి కారకులయ్యారు. ప్రత్యేకహోదాపై యూ టర్న్ కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ మిత్రత్వం కొనసాగినంత కాలం ప్రత్యేక హోదాను వ్యతిరేకించి అదేమైనా సంజీవినా, దానివల్ల ఒరిగేది ఏమీ లేదని చెబుతూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో పొత్తుకు స్వస్తి చెప్పాక యూ టర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కు తానే పోరాట యోధుడినని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం. విద్యార్థులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానన్న చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు. ‘ఐటీ గ్రిడ్స్’పై సమగ్ర విచారణ జరపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం నేరం. పౌరుల ప్రైవసీ సమాచారాన్ని సేవా మిత్ర పేరుతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు అందజేయడం, నాలుగు విభాగాలు గా విభజించి ఏ పార్టీకి చెందిన వారు, ఏపార్టీకి అభిమానులు వంటి మొత్తం సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. వీటిని ప్రశ్నించిన వారిని రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను ఇవ్వడం దారుణం. దీని పై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. యాప్‌ను ఏర్పాటు చేసి ప్రైవేటు సంస్థల ద్వారా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ‘బాబు’కు బుద్ధి చెప్పడం తథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓట్ల తొలగింపు చేస్తున్న ప్రైవేటు సంస్థల పై చర్యలు తీసుకోవడం మాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సమస్యగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం. దీనిపై ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం దారుణం. నేరం ఎక్కడ జరిగితే అక్కడ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. అంతే గాని చంద్రబాబు తెలంగాణ పోలీసులకు సంబంధం లేనట్లు మాట్లాడడం అవివేకం. చట్టం ముందు అందరూ సమానులే ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు. -
పోలవరం పచ్చ రాబందులు
-
రూ.102.39 కోట్ల పనికి.. 440.54 కోట్లు
సాక్షి, అమరావతి : పోలవరం నిర్మాణాన్ని ప్రభుత్వ పెద్దలు కమీషన్లు కురిపించే అక్షయపాత్రలా మార్చుకున్నారనేందుకు ఇది మరో తార్కాణం! ఎడమ కాలువ నాలుగో ప్యాకేజీ కింద మిగిలిపోయిన రూ.102.39 కోట్ల పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించిన ముఖ్యనేత తన సన్నిహితుడికి నామినేషన్‌పై కట్టబెట్టిన అనంతరం అంచనా వ్యయాన్ని నాలుగు రెట్లకుపైగా అదనంగా పెంచేయటం గమనార్హం. పాత ధరలతో పనులు అంటూ... పోలవరం ఎడమ కాలువ నాలుగో ప్యాకేజీలో మిగిలిన పనులను ఆరెస్సార్–సాగిట్టాల్ సంస్థ పాత ధరలతోనే చేపడుతుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిలో జలవనరుల శాఖ అధికారులు పనులను అప్పగించారు. అయితే మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని రూ.440.53 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ నుంచి కమీషన్ల రూపంలో ముఖ్యనేతకు రూ.200 కోట్ల మేర దక్కనున్నట్లు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లులు రాక ఆగిన పనులు.. పోలవరం ఎడమ కాలువ నాలుగో ప్యాకేజీ (69.145 కి.మీ. నుంచి 93.70 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, లైనింగ్, 1,243 మీటర్ల పొడవున అక్విడెక్టుల నిర్మాణ పనులను రూ.206.80 కోట్లతో పూర్తి చేసేలా తొలుత సాబీర్డ్యామ్ అండ్ వాటర్ వర్క్స్ కన్స్ట్రక్షన్ కంపెనీతో 2005 మార్చి 23న ఒప్పందం కుదిరింది. అయితే రూ.104.41 కోట్ల విలువైన (50.49 శాతం) పనులు మాత్రమే పూర్తి చేసింది. 2009 తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఎడమ కాలువ పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. నామినేషన్‌పై పనులు... పోలవరం ఎడమ కాలువ పనులపై 2017 మే 21న సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాలుగో ప్యాకేజీలో మిగిలిన పనులను పాత ధరలకే పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ఆరెస్సార్–సాగిట్టాల్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని ఆదేశించారు. ఆర్థిక, జలవనరులశాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సర్కార్ ఆ సంస్థకే పనులు కట్టబెట్టింది. పాత ధరలకే పూర్తి చేస్తామన్న ఆ సంస్థకు ఆ తర్వాత ధరల సర్దుబాటు (జీవో 22) కింద, పనుల పరిమాణం పెరిగితే ఆ మేరకు అదనపు బిల్లులు(జీవో 63) చెల్లించాలని సర్కార్ ఆదేశించింది. 36 కాంక్రీట్ నిర్మాణాలకు జీవో 22, జీవో 63లను వర్తింపజేయడం వల్ల రూ.51.22 కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని ఎడమ కాలువ అధికారులు లెక్క కట్టారు. ఉన్నత స్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో చేసేది లేక రూ.51.22 కోట్లు అదనంగా ఇచ్చేందుకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) ఆమోద ముద్ర వేసింది. కాలువ తవ్వకం, లైనింగ్ పనులకూ.. కాంక్రీట్ నిర్మాణాలకు జీవో 22, జీవో 63ల కింద అదనపు బిల్లులు ఇచ్చేందుకు ఎస్ఎల్ఎస్సీ అంగీకరించాక 4.70 కి.మీ. మేర కాలువ తవ్వకం, లైనింగ్ పనులకూ తాజా ధరలను వర్తింపజేసి అదనపు బిల్లులు ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నామినేషన్ పద్ధతిలో అప్పగించే సమయంలో పాత ధరలకే పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకరించారని గుర్తు చేసిన అధికారులపై ముఖ్యనేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో చేసేదిలేక తాజా ధరల మేరకు మిగిలిన కాలువ తవ్వకం, లైనింగ్ పనులకు రూ.389.32 కోట్లను అదనంగా చెల్లించాలంటూ పోలవరం ఎడమ కాలువ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో ఆ ప్రతిపాదనలపై ఎస్ఎల్ఎస్సీ ఆమోద ముద్రవేసింది. మిగిలిన పనుల విలువ రూ.102.39 కోట్లు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్నాక పోలవరం ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచుతూ 2016 డిసెంబర్ 6న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ వెంటనే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను 60 సీ నిబంధన కింద తొలగించింది. ఈ క్రమంలో నాలుగో ప్యాకేజీ కాంట్రాక్టర్‌పై కూడా వేటు వేసింది. అప్పటికే నాలుగో ప్యాకేజీలో రూ.104.41 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో రూ.102.39 కోట్ల పనులు మాత్రమే మిగిలిపోయాయి. -
పైసా పనిచేయకుండా రూ.500 కోట్ల బిల్లు
పోలవరం కాంట్రాక్టర్ మాయాజాలం ♦ మరో రూ.400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌కు అర్హతుందంటూ లేఖ ♦ మొత్తం రూ.900 కోట్లు చెల్లించడానికి రంగం సిద్ధం ♦ పోలవరం నిర్మాణ ప్రగతిపై వాస్తవ నివేదికలిచ్చిన ఇంజనీర్‌పై బదిలీ వేటు సాక్షి, హైదరాబాద్: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరున కూర్చున్నా అన్నీ అందుతాయి.. అన్న సామెత పోలవరం కాంట్రాక్టర్‌కు బాగా సరిపోతుంది. పైసా పనిచేయకుండా రూ. 500 కోట్ల విలువైన పనులు చేసినట్లు ప్రభుత్వానికి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ బిల్లులు సమర్పించగా.. అందుకు పోలవరం అధికార యంత్రాంగం వత్తాసు పలికింది. సదరు కాంట్రాక్టు సంస్థ చెబుతున్న మేరకు పని చేసిందంటూ ఏకంగా ధ్రువీకరించింది. ప్రాజెక్టు నిర్మాణ పని ఒక్క సెంటీమీటర్ కూడా ముందుకు సాగలేదని హైదరాబాద్‌లో కూర్చున్న నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు తెలుసు. అయినప్పటికీ సదరు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలకడానికి వెనుక సర్కారు పెద్దల హస్తమున్నట్టు ఇంజనీర్లు చెబుతుండడం గమనార్హం. పరిశీలన.. నాణ్యత తనిఖీ.. అన్నీ ఒక్కరే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్ ఎంత పనిచేశారనే విషయాన్ని నిర్ధారించడం, చేసిన పనిలో నాణ్యత ఉందో లేదో తనిఖీ చేసి ధ్రువీకరించడం, కాంట్రాక్టర్ పెట్టిన బిల్లులను ప్రభుత్వానికి పంపించడం.. ఇలా అన్ని బాధ్యతలనూ ఒకే అధికారికి ప్రభుత్వం అప్పగించింది. కాంట్రాక్టు సంస్థ పైసా పని చేయకున్నా రూ.500 కోట్ల పనిచేసినట్లు బిల్లులు సమర్పించడానికి ఈ అధికారి సహకరించినట్టు పోలవరం ఇంజనీర్లు చెబుతున్నారు. వాస్తవ నివేదికలిచ్చిన ఇంజనీర్‌పై బదిలీ వేటు పోలవరంలో వాస్తవంగా జరుగుతున్న నిర్మాణ ప్రగతిని వివరిస్తూ ఈఈ స్థాయి ఇంజనీర్ ప్రతినెలా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. గత మూడు నెలలుగా అక్కడ పనులేమీ జరగట్లేదని, చూట్టానికి కొన్ని డొక్కు వాహనాలు అక్కడ ఉంచారని, వాటిల్లో సగం వాహనాలకు టైర్లు కూడా లేవంటూ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటే, కాంట్రాక్టర్‌కు అప్పనంగా రూ.500 కోట్లు బిల్లులు చెల్లించడానికి వీలుకాదని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఆ నివేదికలను బుట్టదాఖలు చేయడమేగాక..ౠ ఈఈపై బదిలీ చేయడం విశేషం. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపునకు రంగం సిద్ధం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు కాంట్రాక్టు సంస్థకు రూ.250 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద చెల్లించింది. కానీ ఆ సంస్థ గత ఏడాదికాలంగా.. అంత మొత్తానికి సరిపడా పనులను కూడా చేయలేదు. కానీ తాజాగా జీవో-22 ప్రకారం మరో రూ.400 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడానికి తమకు అర్హతుందని, ఆమేరకు సొమ్మివ్వాలని కోరుతూ ట్రాన్స్ట్రాయ్ సర్కారుకు లేఖ రాసింది. కాంట్రాక్టర్ అడిగిందే తడవుగా మొబిలైజేషన్ కాంట్రాక్టర్ పెట్టిన రూ.500 కోట్ల బిల్లుతో కలిపి.. మొత్తం రూ.900 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. -
'నందిగామలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు'
హైదరాబాద్: నందిగామలో ఉప ఎన్నికలో తమ పార్టీకి దక్కిన ఓట్ల పట్ల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంప్రదాయ ఓట్లు తిరిగొచ్చాయని చెప్పారు. తంగిరాల ప్రభాకరరావు కుటుంబంపై సానుభూతి, నామినేషన్ తర్వాత విజయవాడను రాజధానిగా ప్రకటించడం వంటి కారణాల వల్ల టీడీపీ విజయం సాధించిందని అన్నారు. నందిగామలో గెలుపు కోసం అధికార టీడీపీ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిందని, మద్యం ఏరులై పారించిందని ఆరోపించారు. ఎన్నికల అధికారులే ఇది నిజమని ఒప్పుకున్నారని తెలిపారు. పోలవరం కాంట్రాక్టర్ల నుంచి టీడీపీకి డబ్బు అందిందని ఆరోపించారు. వీరి పేర్లు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. ఉప ఎన్నికలో తాము రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తమ అభ్యర్థి దగ్గర డబ్బు లేదు, తమ దగ్గర డబ్బు లేదని రఘువీరారెడ్డి చెప్పారు.