సిక్కింలో స్వచ్ఛమైన దీపావళి !
గ్యాంగ్టక్: ధ్వని, గాలి కాలుష్యం జరగకుండా దీపావళి జరుపుకుని చిన్న రాష్ట్రం సిక్కిం ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాలు చేయని విధంగా బాణాసంచాపై నిషేధం విధించి, ‘క్లీన్ అండ్ గ్రీన్’ దీపాల పండగను నిర్వహించింది.
2014లో దీపావళికి వెలువడిన శబ్ద కాలుష్యం, బాణాసంచా చెత్త వల్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అదే ఏడాది డిసెంబర్ 19న అన్ని రకాల బాణాసంచాను సర్కారు నిషేధించింది. దీంతో 2015లో టపాసుల వాడకం 50 శాతానికి తగ్గింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వీధుల్లో చిన్నారులతో నాటకాలు వేయించారు. వీటికి ప్రజలు ముఖ్యంగా యువత నుంచి ఊహించని స్పందన లభించింది.