polvaram project
-
పోలవరాన్ని సందర్శించిన మంత్రి అంబటి రాంబాబు
సాక్షి, ఏలూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో కేంద్ర బృందంతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. -
పోలవరం: ఫలించిన వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల సమావేశం విజయవంతమైంది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన రూ.47,725 కోట్ల మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ అంగీకరించారు. ఈ క్రమంలో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. వచ్చేవారం కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం రానుంది. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా... నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. భేటీ అనంతరం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీయింబర్స్మెంట్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ‘‘ఐదు అంశాలపై కేంద్రమంత్రి షెకావత్‌తో చర్చించాం. మొదటిది పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడులను క్లియర్ చేయడం.. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరాం. కమిటీ సూచించిన మేరకు రూ.47,725 కోట్లు ఆమోదిస్తామన్నారు. ఇక బిల్లుల విషయంలో కాలయాపన లేకుండా ఎస్క్రో ఖాతా తెరవాలని అడిగాం. అది సాధ్యం కాదు.. వారం పదిరోజుల్లో రీయింబర్స్ చేస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ.1920 కోట్లు రీయింబర్స్ చేస్తామన్నారు. రూ.47,725 కోట్లు కేబినెట్ ద్వారా ఆమోదించేందుకు సిద్ధమని తెలిపారు. రానున్న కేబినెట్ సమావేశంలో అంచనాలను ఆమోదించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాజమండ్రికి తరలించాలని కోరాం. ఇందుకు కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. -
అలసత్వం వద్దు.. నాణ్యత ఉండాలి
-
రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్ వే లో 2, 17, 443 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేయగా.. స్పిల్ వే పిల్లర్లు పై 160 గడ్డర్లు ఏర్పాటుతో 52మీటర్లు ఎత్తుకు నిర్మించారు. గేట్ల ఏర్పాటు లో కీలకమైన 48 ట్రూనియన్ భీంలకు గాను 30 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తి చేశారు. కరోనా కాలంలోను లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనితో పాటు స్పిల్ ఛానల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు.. అలాగే 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. 902 కొండ తవ్వకం, గ్యాప్ 3, గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు వేగంగా సాగుతున్నాయి. కాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తయ్యేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 2017 లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్న సీఎం జగన్ కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 2,234 కోట్ల నిధులు సాధించారు. -
పోలవరం
-
పోలవరం పూర్తి చేసే సత్తా వైఎస్ జగన్‌కే ఉంది
-
నేడు పోలవరానికి సీఎం వైఎస్ జగన్...
-
'తెలంగాణ ప్రాజెక్టులపై గళం విప్పాలి?'
ఒంగోలు: రాష్ట్రంలోబీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని, మూడేళ్ల తరువాత రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఊహించలేమని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక ఏకేవీకే కాలేజీలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్దికి రూ.1.40 లక్షల కోట్లను కేంద్రం అందించిందన్నారు. విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలకు బీజేపీ సహకారం అందిస్తుందన్నారు. కృష్ణానదిపై కర్నాటక, మహారాష్ట్రలు 400 ప్రాజెక్టులు నిర్మించాయని, తాజాగా తెలంగాణ ప్రభుత్వం డిజైన్ మార్చడం వల్ల కూడా ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. సోదరుడు బాలకృష్ణ గౌతమీపుత్రశాతకర్ణి చిత్రం తీయడం శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అయితే దానికి సంబంధించిన వివరాలు కోరినపుడు రాష్ట్రం సత్వరమే వాటిని పంపిస్తే నిధులు సకాలంలో విడుదలవుతాయన్నారు. బీజేపీ, టీడీపీలు అన్నదమ్ముల కుటుంబాల్లా ఉంటున్నాయని, రెండింటి మధ్య చిన్నచిన్న విభేదాలు వచ్చినా వాటిని రాష్ట్రస్థాయి నాయకత్వం ఎక్కడికక్కడ సరిచేస్తుందన్నారు.