ఒంగోలు: రాష్ట్రంలోబీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని, మూడేళ్ల తరువాత రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఊహించలేమని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక ఏకేవీకే కాలేజీలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్దికి రూ.1.40 లక్షల కోట్లను కేంద్రం అందించిందన్నారు. విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలకు బీజేపీ సహకారం అందిస్తుందన్నారు. కృష్ణానదిపై కర్నాటక, మహారాష్ట్రలు 400 ప్రాజెక్టులు నిర్మించాయని, తాజాగా తెలంగాణ ప్రభుత్వం డిజైన్ మార్చడం వల్ల కూడా ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. సోదరుడు బాలకృష్ణ గౌతమీపుత్రశాతకర్ణి చిత్రం తీయడం శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అయితే దానికి సంబంధించిన వివరాలు కోరినపుడు రాష్ట్రం సత్వరమే వాటిని పంపిస్తే నిధులు సకాలంలో విడుదలవుతాయన్నారు. బీజేపీ, టీడీపీలు అన్నదమ్ముల కుటుంబాల్లా ఉంటున్నాయని, రెండింటి మధ్య చిన్నచిన్న విభేదాలు వచ్చినా వాటిని రాష్ట్రస్థాయి నాయకత్వం ఎక్కడికక్కడ సరిచేస్తుందన్నారు.
'తెలంగాణ ప్రాజెక్టులపై గళం విప్పాలి?'
Published Sun, Apr 10 2016 6:53 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement