Polyethylene bags
-
Sakshi Cartoon: ...ప్లాస్టిక్ సామాన్లు కొంటాం! ప్లాస్టిక్...
...ప్లాస్టిక్ సామాన్లు కొంటాం! ప్లాస్టిక్... -
రక్తంలో తిష్ట వేసిన ప్లాస్టిక్ కణాలు..షాక్‌లో శాస్త్రవేత్తలు!
Microplastic in human blood: ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా మొత్తుకుంటున్నారు. కానీ ప్రజలు తమ నిత్య జీవన విధానంలో ఈ ప్లాస్టిక్ వస్తువులకు అలవాటుపడిపోయారు. అంతతేలిగ్గా బయటేపడే అవకాశం తక్కువ. అదీగాక ప్లాస్టిక్ చాలా చౌకగా దొరకడమే కాకుండా సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉంటుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం అందువల్ల దయచేసి వాడొద్దు అంటూ నినాదాలు చేసి మరీ సహజ పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు కూడా. ప్రజలు ఇటీవలే వాటిని వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గానీ ఆ ప్లాస్టిక్ వల్ల జరగవల్సిన నష్టం ఎప్పడో మనిషికి జరిగిపోయింది అంటున్నారు డచ్ శాస్త్రవేత్తలు. అసలేం జరిగిందంటే...పది మంది వ్యక్తుల రక్త నమూనాల్లో దాదాపు 8 మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించామని డచ్ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనాల్లో వెల్లడించారు. తాము పరిశోధనలు చేసిన సుమారు 77 శాతం మందిలో రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ గాలితో పాటు ఆహారం, పానీయాల ద్వారా కూడా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ నివేదికలో తెలిపారు. పైగా పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలిన్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) వంటి ఐదు రకాల ప్లాస్టిక్‌ల గురించి పరిశోధనాలు చేయడం మెదలు పెట్టారు. అందులో భాగంగా దాదాపు 22 మంది రక్త నమునాలను సేకరించారు. అయితే ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుమారు 17 మంది రక్తదాతల రక్తంలో ప్లాస్టిక్ రేణువుల ఉన్నాయని తెలిపారు. ఆ పరిశోధనల్లో కొంతమంది రక్తదాతల్లో గృహోపకరణాలకు వినియోగించే ప్లాస్టిక్ ఉందని, మరికొంతమంది రక్తం క్యారియర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పాలిథిన్‌ని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు పరీక్షించిన వారిలో 50 శాతం మంది రక్తంలో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, 36 శాతం మంది రక్తప్రవాహంలో పాలీస్టైరిన్ కూడా ఉందని వెల్లడించారు. ఏదీఏమైన మానవుని ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి చేరకమునుపే ప్లాస్టిక్‌కి సంబంధించిన వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయాల్సిందే. (చదవండి: బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట! -
పుట్టగొడుగులు పెంచుదామా..
పుట్టగొడుగుల పెంపకం ఇలా.. పుట్టగొడుగులను వరిగడ్డి, చిట్టు, తవుడు, చెరకు దవ్వ, జొన్నచొప్ప లాంటి ఏ రరమైన వ్యవసాయ పదార్థాల పైనైనా పెంచవచ్చు. వీటిలో లిగ్నిస్, సెల్యులోజ్ అధికంగా ఉంటుంది. పెంచే పద్ధతి కూడా చాలా సులువైనది. ప్రారంభ పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. ఏమేం సామగ్రి కావాలంటే.. పూరిపాక, గది లేక పక్కా షెడ్, వినియోగంలోని కోళ్ల షెడ్ అయినా ఫర్వాలేదు. గడ్డి కత్తిరించడానికి కట్టర్, వేలాడదీయడానికి ఏర్పాటు అంటే పైకప్పుకు కడ్డీలు లేక కొక్కేలు లేక 3-4 అరలున్న చెక్క ర్యాక్, గడ్డిని ఉడకబెట్టడానికి పెద్ద పాత్ర, నాణ్యమైన స్పాన్(పుట్టగొడుగుల విత్తనం) బెడ్స్‌పై గదిలో ఇసుక, గోనె సంచులపై నీరు చల్లడానికి స్ప్రేయర్లు, మంచి ఎండుగడ్డి, జొన్పచొప్ప, వరి ఊక, బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు, సంచుల మూతులు కట్టడానికి దారం లేక రబ్బరు బ్యాండ్లు, థర్మామీటర్, హైగ్రోమీటర్(ఆర్ధ్రతా మాపకం), చేతులు శుభ్రం చేసుకునేందుకు దూది, స్పిరిట్ లేదా డెటాల్, ఫార్మాలిన్ ద్రావణం అవసరమవుతాయి. సబ్స్ట్రాట్(ఆధారం) తయారు చేసే పద్ధతి నీటిలో ఉడకబెట్టడం ద్వారా సబ్స్ట్రాట్ని స్టెరిలైజ్ చేయవచ్చు. తాజా వరిగడ్డి లేక మరే ఇతర వ్యవసాయ వ్యర్థాన్ని తీసుకుని 2-3 అంగుళాల పొడవున్న ముక్కలుగా కత్తిరించాలి. ఆ ముక్కలను 12-18 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రమైన నీటిలో కడగాలి. గడ్డి ముక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. మరుగుతున్న నీరున్న పాత్రలో 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అనంతరం వాటిని తీసి చాపలపై పరచాలి. బెడ్స్ తయారీ.. బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు వాడాలి. 12ఁ18 అంగుళాలు లేదా 100జీ మందంతో 14ఁ24 అంగుళాలు ఉండాలి. గాలి వెళ్లేందుకు వీలుగా పాలీథిన్ సంచులకు 9-15 రంధ్రాలు చేయాలి. చేతులను డెట్టాల్ లేదా స్పిరిట్‌తో శుభ్రం చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసిన గడ్డిముక్కలను పొరలు పొరలుగా బ్యాగ్‌లో నింపాలి. ఎక్కడా ఖాళీ లేకుండా గుండ్రంగా ఉండేలా గడ్డిని నొక్కాలి. గుప్పెడు విత్తనాలను(40 గ్రాములు) బెడ్ ఉపరితలంపై ఒకే రీతిలో చల్లాలి. ఈ విధంగా 4-5 పొరలు తయారు చేయాలి. బ్యాగ్ మూడొంతులు నిండాక విత్తనాలను మరోసారి ఉపరితలమంతటా సమంగా చల్లాలి. తర్వాత బ్యాగును దారం లేదా రబ్బరు బ్యాండుతో బిగించి కట్టి, తేదీ రాసిన లేబుల్ అతికించాలి. ఇంక్యుబేషన్, క్రాపింగ్ బెడ్స్‌తో కూడిన సంచులను చీకటిగా ఉన్న గదిలో వేలాడదీయడమో లేదా షెల్ఫ్ పై పెట్టడమో చేయాలి. ఆ విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వ్యాధులు, పురుగులను నివారించవచ్చు. ఇంటిలో ఒకమూల భాగాన్నయినా ఇందుకోసం వాడుకోవచ్చు. బెడ్స్‌పై ఉన్న సంచులను ర్యాక్‌లపై ఉంచాలి లేదా కొక్కేలకు వేలాడదీయాలి. 18-25 రోజులపాటు బెడ్స్‌ను ఉంచాలి. ఇంక్యుబేషన్ కాలంలో పాలిథిన్ సంచులలోని బెడ్స్‌పై తెల్లని నూలుదారాల వంటి మైసీలియంలు పెరగడం కనిపిస్తుంది. అప్పుడు ప్లాస్టిక్ కవరును తొలగిస్తే పుట్టగొడుగులు పెరగడానికి వీలుంటుంది. బెడ్స్‌లో తేమ ఉండేలా అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. 5-6 రోజుల తర్వాత బెడ్స్ అంతటా సూదిమొనంత ఉన్న పుట్టగొడుగులు కనిపిస్తాయి. 7 నుంచి 10 రోజుల్లో మొదటి పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. రేకులు పూర్తిగా విచ్చుకుని అంచులు పలచబడితే ఆ పుట్టగొడుగులు కోతకు వచ్చినట్లే. వాటిని అడుగున కొద్దిగా మెలితిప్పి కాండంతో సహా గిల్లివేయాలి. ఒక్కో దిగుబడిని ప్లస్ అంటారు. వారానికి ఒకసారి కోయాలి. ఒక్కో బెడ్ నుంచి కనీసం 2-3 పంటలను తీయవచ్చు. ఒక్కో బెడ్ నుంచి 500 నుంచి 800 గ్రాముల పుట్టగొడుగులను పొందవచ్చు. తర్వాత బెడ్‌ను తీసివేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. పుట్టగొడుగుల్లో రకాలు పుట్టగొడుగుల్లో తినేందుకు వీలైన జాతులు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. వాటిలో మూడు జాతులను మనదేశంలో పెంచుతున్నారు. అవి వైట్ బటన్(అగారికస్ స్పీషిస్), అయిస్టర్ లేక థింగ్రీ(ఫెయిరోటస్ స్పీషిస్), చైనీస్(ఓల్వోరిల్లా స్పీషిస్). వైట్ బటన్ : దీనిని యూరోపియన్ లేక సమశీతోష్ణ(టెంపరేట్) పుట్టగొడుగులు అని కూడా అంటారు. వీటి పెంపకానికి 15-18 డిగ్రీల సెంటిగ్రేడ్ నియంత్రిత ఉష్ణోగ్రత కావాలి. అందుకోసం ఇన్సులేటెడ్ గదులు, ఏసీ ఫ్లాంట్, హ్యుమిడిఫైయర్, ఏహెచ్‌యూ లాంటి యంత్రాలు అవసరం. అందువల్ల పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. పెంపకానికి సాంకేతిక నైపుణ్యం అవసరం. ఈ రకాన్ని సాధారణంగా చల్లగా ఉండే కొండ ప్రాంతాల్లో పెంచుతారు. మన రాష్ర్టంలో మైదాన ప్రాంతాల్లో శీతాకాలంలో పెంచుతుంటారు. అయిస్టర్(ముత్యపుచిప్ప) : ఈ రకం పుట్టగొడుగులను చౌకగా లభించే రకరకాల వ్యవసాయ వ్యర్థ పదార్థాలపై పెంచవచ్చు. ఉష్ణోగ్రత 25-32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. తేమ శాతం 75-85 ఉండాలి. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ రకాలను మన రాష్ట్రంలో పెంచుకోవచ్చు. చైనీస్ : ఈ రకానికి 35-38 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ అవసరం. అత్యధిక ఉష్ణోగ్రత అవసరమైనందున ఈ రకాన్ని వేసవిలో పెంచుకోవచ్చు. -
వాయనం: కలర్‌ఫుల్ బ్యాగ్స్ తయారు చేద్దామా!
పాలిథీన్ బ్యాగ్స్‌ని వాడకూడదని పర్యావరణవేత్తలు చెప్పడంతో వాటి వాడకం తగ్గిపోయింది. వాటి స్థానంలో పేపర్బ్యాగ్స్ వాడుతున్నారు. అయితే వాటి ఖరీదు పాలిథీన్ బ్యాగ్స కంటే కొంచెం ఎక్కువ. అదే కాస్త ఇబ్బంది. కానీ దీనికో మంచి పరిష్కార మేమిటంటే బ్యాగ్సని మనమే చేసుకోవడం! నిజానికి పేపర్ బ్యాగ్ తయారు చేయడం చాలా తేలిక. పేపర్, గమ్, చిన్న తాడు, కత్తెర ఉంటే చాలు. ముందుగా పేపర్‌ను ముడతలు లేకుండా నేలమీద పరవాలి. బ్యాగ్ ఎంత పొడవు, వెడల్పు ఉండాలో... అంత పొడవు, వెడల్పు ఉన్న రెండు మూడు పుస్తకాలను దొంతరలాగా పేపర్ మీద పెట్టాలి. తర్వాత పేపర్ని అన్ని వైపులా మడవాలి (ఫొటో 1,2,3). ఒక పక్క వదిలేసి మిగతా అన్ని పక్కలా కాగితాన్ని గమ్‌తో అంటించాలి. అంటించని వైపున మడతను విప్పి పుస్తకాలు బయటకు తీసేయాలి (ఫొటో 4లో చూపినట్టు అవుతుంది). ఆపైన మడత విప్పిన వైపున కాగితాన్ని సమానంగా పట్టుకుని కత్తిరించాలి (ఫొటో 5). చివరిగా బ్యాగుకు చిన్న చిన్న రంధ్రాలు చేసి తాడు లేక వైరును అమర్చుకోవాలి (ఫొటో 6). అంతే... బ్యాగ్ రెడీ అయిపోయినట్టే! స్టేషనరీ షాపుల్లో రకరకాల కాగితాలు, డిజైన్లతో దొరుకుతాయి. తెచ్చుకుని ఒకేసారి నాలుగైదు బ్యాగ్స్ చేసి పెట్టేసుకుంటే... అస్తమానం బ్యాగ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. కాస్త మందంగా ఉన్నవి ఎంచుకుంటే ఎక్కువ బరువును తట్టుకుంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. బ్యాచిలర్స్ కోసం భలే మెషీన్! ఇడ్లీని మించిన టిఫిన్ మరొకటి లేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇడ్లీని కాస్త ఎక్కువగానే తింటుంటాం మనం. అయితే బ్యాచిలర్స్కి వీటిని రోజూ తినే అదృష్టం ఉండదు. ఎందుకంటే వాళ్లు అంత కష్టపడి ఇడ్లీలు చేసుకోలేరు. పప్పు నానబెట్టాలి, కడగాలి, రుబ్బాలి, ఇడ్లీ గిన్నెల్లో వేయాలి, నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఆన్ చేయాలి, కూత పెట్టేవరకూ చూసి ఆపాలి... అబ్బబ్బబ్బ, బోలెడు పని అంటారు వాళ్లు. అయితే వాళ్లకు తెలియనిది ఒకటుంది. ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడున్న ఈ బుజ్జి మిషన్... ఇడ్లీలను చాల ఈజీగా వండేస్తుంది. ఇందులో ఉన్న గిన్నెల్లో పిండిని పోసి, మూతపెట్టి, స్విచ్ ఆన్ చేయడమే. క్షణాల్లో ఇడ్లీలు రెడీ అయిపోతాయి. కాచుకుని కూచోవాల్సిన పని లేదు. ఇడ్లీలు తయారయ్యాక కుక్కర్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది. కాబట్టి ఆన్‌చేసి, బయటకు కూడా వెళ్లి రావచ్చు. మరి పిండి సంగతేంటి అంటారా? ఆల్రెడీ మార్కెట్లో రెడీమేడ్ పిండి దొరకుతోంది. పచ్చళ్లూ దొరుకుతున్నాయి. కాబట్టి నో టెన్షన్. దీని ధర రూ. 1,100. ఆన్లైన్లో కొంటే రూ.900. దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు. బ్యాచిలర్స్కి గుడ్లు కూడా మంచి ఫుడ్డే కదా! అలాగని వాళ్లే కొనాలని లేదు. కరెంటుతో పని చేస్తుంది కాబట్టి గ్యాస్ అయిపోయినప్పుడు వాడుకోవడానికి అందరిళ్లలో ఉండటం మంచిదే!