ponnaa lakshmaiah
-
ధన్వంతిపై వేటు
ఆరేళ్లపాటు బహిష్కరించిన కాంగ్రెస్ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి దుగ్యాల ఫిర్యాదు పొన్నాల అనుమతితో చర్యలు వరంగల్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసినందుకు డీసీసీ ఉపాధ్యక్షురాలు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిపై ఆ పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాం గ్రెస్ అభ్యర్థిగా దుగ్యాల శ్రీనివాసరావు పోటీ చేయగా... రెబల్‌గా ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ఇదివరకే పార్టీ నుంచి బ హిష్కరించారు. ఈ క్రమంలో ధన్వంతిపై దుగ్యాల తెలంగాణపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి, సభ్యులు బండాప్రకాష్, ఫరూఖ్ తదితరులు చర్చించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల అనుమతితో ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. తొలి నుంచి ధన్వంతి, లక్ష్మీనారాయణ దంపతులు పొన్నాలకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. పొన్నాల సహకారంతోనే జెడ్పీ చైర్పర్సన్ పదవి ధన్వంతిని వరించినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతుం టారుు. ఇటీవల వారి మధ్య కొంత విభేదాలు పొడచూపినట్లు ప్రచారం సాగింది. తాజాగా డాక్టర్ లక్ష్మీనారాయణ మొన్నటి ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన స్వతంత్రుడిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో భర్తకు మద్దతుగా ధన్వంతి ప్రచారం చేశారు. ఎన్నికల ఏజెంట్‌గా పనిచేశారు. లక్ష్మీనారాయణ పోటీ వల్ల తాను ఓటమిపాలయ్యాయని దుగ్యాల రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. దుగ్యాలకు లక్ష్మీనారాయణ దెబ్బ పాలకుర్తి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన లక్ష్మీనారాయణకు 3,129 ఓట్లు లభించాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దు గ్యాల శ్రీనివాసరావుకు 53,486 ఓట్లు... విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 57,799 ఓట్లు లభించాయి. కేవలం 4,313 ఓట్ల మెజార్టీతో ఎర్రబెల్లి గెలుపొందారు. లక్ష్మీనారాయణ స్వతంత్రుడిగా బరిలో లేకుంటే తానే విజయం సాధించే అవకాశాలున్నాయని దుగ్యాల భావించారు. తన ఓటమికి కారణమైన లక్ష్మీనారాయణను బహిష్కరించినప్పటికీ... ఆయనకు సహకరించిన ధన్వంతిపై చర్య తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా ఏర్పాటైన టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా జిల్లా నుంచి ధన్వంతి పేరును ప్రతిపాదించారు. ఈ లోపే ధన్వంతి భర్త లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు నిర్ణయించుకోవడంతో క్రమశిక్షణ కమిటీలో చోటు కల్పించకుండా వెనుకంజ వేసినట్లు సమాచారం. -
అన్నీ మాయమాటలే!
కేసీఆర్ వైఖరిపై పొన్నాల ధ్వజం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎన్నికల ప్రణాళికను చూస్తుంటే ప్రజల మోచేతికి బెల్లం పెట్టకుండానే నాకమంటున్నట్లుగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఇన్నాళ్లు మోసం చేసిన కేసీఆర్ ఆచరణ సాధ్యంకాని హామీలు, మాయమాటలతో మేనిఫెస్టోను రూపొందించి మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రకటించిన 69 మంది అభ్యర్థుల్లో 80 శాతం మంది బయట నుంచి అరువు తెచ్చుకున్న వాళ్లేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీగా ఎదగని టీఆర్ఎస్కు అధికారమెలా వస్తుందని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వాపును బలుపుగా కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం పీసీసీ అధికార ప్రతినిధులు బి.కమలాకరరావు, వకుళాభరణం కృష్ణమోహన్‌లతో కలిసి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాతోపాటు కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలమీద స్పందించారు. వృద్ధులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పెన్షన్ ఇస్తాడట. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు పెన్షన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? రైతులు పరిహారం కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎద్దేవా చేసిన చంద్రబాబు శిష్యరికంలో పెరిగిన మీరు పెన్షన్ గురించి మాట్లాడటమా..? యూపీఏ రూపొందించిన ఐటీఐఆర్ అంటే కేసీఆర్‌కు ఏం తెలుసా? నియోజకవర్గానికో లక్ష ఎకరాలకు కొత్త ఆయకట్టును అందిస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? ఆకాశానికి నిచ్చెన వేసి అధికారం అందుకోవాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ మేనిఫెస్టో వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగాలతో కలిపి జిల్లాకో లక్ష ఉద్యోగాలిస్తాం. టీఆర్ఎస్ మాదిరిగా మాట ఇస్తే తప్పే పార్టీ కాంగ్రెస్ కాదు. అధికారంలోకొస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ 69 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలో ఆ మేరకు చోటెందుకు ఇవ్వలేదు? -
మామా కోడళ్ల పోరు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరంగా ఉన్నత పదవులు పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఇప్పుడు ఇంటిపోరు మొదలైంది. జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఆయనకు ఇంటి నుంచే పోటీ నెలకొంది. సీటు కోసం పొన్నాల లక్ష్మయ్యకు, ఆయన కోడలు వైశాలికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఈ పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే సీటు కోసం ఇంటి నుంచే పోటీ వస్తుండడంతో... మునిసిపల్ ఎన్నికలను అనుకూలంగా మలుచుకోవాల ని పొన్నాల లక్ష్మయ్య భావించినట్లు తెలిసిం ది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇప్పుడు జనరల్ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పదవిని తీసుకుని... వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని లక్ష్మయ్య వర్గం నుంచి వైశాలికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పుడు చైర్మన్‌గా ఉంటే... 2019 ఎన్నికల వరకు జనగామతో పాటు చేర్యాల లేదా మరో కొత్త నియోజకవర్గం అందుబాటులోకి వస్తుందని చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై వైశాలి నుంచి ప్రతికూల స్పందన వచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉండగా... పునర్విభజనతో సాధ్యం కాలేదని, ఇప్పుడు పోటీ చేయాల్సిందేనని ఆమె పట్టుదలతో ఉన్నా రు. మునిసిపల్ చైర్మన్ ప్రతిపాదనతో రెండు రోజులగా వైశాలి అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే గా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలని లక్ష్మయ్య కోడలు పొన్నాల వైశాలి పట్టుదలతో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఈ మేరకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే లక్ష్మయ్య భువనగిరి లోక్‌సభకు పోటీ చేయాలని... తాను మాత్రం ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెప్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ఇచ్చి న నేపథ్యంలో కాంగ్రెస్‌పై సానుకూలత ఉన్న ప్రస్తుత ఎన్నికల్లోనే బరిలోకి దిగాలని వైశాలి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మరింత క్రీయాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే యోచనతో పొన్నాల లక్ష్మ య్య తానే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో ముఖ్యు లు లేకపోవడం ఈసారి తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. ఎన్నికల ముందే ఏర్పడితే ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉంటానని.. సీనియర్ నేతగా అన్ని అర్హతలు ఉన్నాయని లక్ష్మయ్య భావిస్తున్నారు. కాగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య పేరు బాగా విని పించింది. లక్ష్మయ్యనే ఈ పదవి వరిస్తుం దని ఆయన వర్గీయులు ఇప్పటికీ ఆశిస్తున్నారు. అరుుతే ఇది ఇతర జిల్లా నేతలకు ఖరారైనట్లు ప్రచారం జరుగుతండడంతో పొన్నాలను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి కొత్త రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు లక్ష్మయ్య సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొన్నాల ఇంట్లో నుంచే ఎమ్మెల్యేగా బరిలో దిగేం దుకు ఆయన కోడలు ప్రయత్నాలు ముమ్మ రం చేస్తుండడం.. మున్సిపల్ చైర్మన్ పదవి ప్రతిపాదనను తిరస్కరించడంతో జనగామ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్‌లో ముఖ్యపదవి కోసం పొన్నాల లక్ష్మయ్య మార్గం సుగమం చేసుకుంటుండగా.. జనగామ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వైశాలి ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.