ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తుపాకుల
సీఎం చైర్మన్‌గా కమిటీ
అందులో సభ్యుడిగా తుపాకుల
1983లో కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి..
సిద్దిపేట రూరల్: ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా సిద్దిపేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాల్‌రంగం నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన మండలంలో క్రియాశీల నాయకుడిగా పని చేయడంతోపాటు సీఎం కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యముంది. మూడు దశాబ్దాలకుపైగా కేసీఆర్‌తో ఉన్న అనుబంధతో రాజకీయం కొనసాగుతోంది. 1983లో కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు.
1995 నుంచి 2001 వరకు పొన్నాల సర్పంచ్‌గా పని చేశారు. 1990 నుంచి 2006 వరకు పార్టీ మండల అధ్యక్షుడిగా పని చేశారు. 2006 నుంచి 2011 వరకు సిద్దిపేట జెడ్పీటీసీగా పని చేశారు. 2011 నుంచి టీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. రిజర్వేషన్ నేపథ్యంలో పొన్నాల సర్పంచ్‌గా తుపాకుల బాల్‌రంగం సతీమణి ఎల్లమ్మ రెండు దఫాలుగా సర్పంచ్‌గా పని చేశారు. తాజాగా ఆయన ఉపాధి హామీ మెంబర్‌గా నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ చైర్మన్‌గా ఉండే రాష్ట్ర కౌన్సిల్లో 15మంది సభ్యులుంటారు. అందులో కేటగిరీ2 విభాగంలో ఈయనకు అవకాశం లభించింది.
ఉపాధిహామీ బలోపేతానికి కృషి
ఉపాధిహామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తుపాకుల బాల్‌రంగం అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో జిల్లా నుంచి ఉపాధిహామీ రాష్ట్రకౌన్సిల్ మెంబర్‌గా ఎన్నుకున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతోపాటు పనుల రూపకల్పనలో క్రియాశీలకంగా పని చేస్తానన్నారు.
క్షేత్రస్థాయిలో కూలీల ఇబ్బందులను తొలగించడంతోపాటు ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధంగా చేసి, రైతుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, మామిండ్ల ఉమారాణి ఐలయ్య, పయ్యావుల రాములు, పీఏసీఎస్ చైర్మన్ నల్ల నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు గంగపురం మహేష్, కదుర్ల బాలయ్య, బరిగెల నర్సింలు, నాయకులు గ్యార యాదగిరి, శ్రీనివాస్, భాస్కర్‌గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.