Poonam Gupta
-
మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్
ఉన్నత చదువులు చదువుకుంది. కానీ ఆశించిన ఉద్యోగమేదీ రాలేదు. రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆమెను రూ. 800 కోట్ల కంపెనీకి అధిపతిగా మార్చింది. గట్టి కృషి, పట్టుదలతో వ్యాపార వేత్తగా రాణిస్తోంది. ఎంతోమంది మహిళా పారిశ్రామిక వేత్తలకు, పర్యావరణవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, పూనమ్ గుప్తా స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం రండి..! ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త పూనమ్ గుప్తా ఢిల్లీలో 1976, ఆగష్టు 17న ఢిల్లీలో పుట్టింది. లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం. ఆ తర్వాత, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ FORE స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హాలెండ్లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. 2002లో వివాహం కావడంతో భర్త పునీత్ గుప్తాతో కలిసి స్కాట్లాండ్కు వెళ్లారు. స్కాట్లాండ్లో ఆమెకు ఉద్యోగం దొరక లేదు. అర్హతలున్నప్పటికీ, పదేపదే తిరస్కరణలను ఎదుర్కొంది. సాధారణంగా ఎన్ఆర్ఐలకు ఎదురయ్యే అనుభవమే ఇది. ఇదే సమయంలో అనారోగ్యంతో తల్లి ఆకాల మరణం ఆమెను మరింతషాక్‌కు గురిచేసింది. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా విభిన్నంగా ఆలోచించింది. వ్యాపారంవైపు అడుగులు వేసింది. అలా 2003లో స్కాట్లాండ్లోని కిల్మాకోమ్‌లోని కేవలం రూ. లక్ష పెట్టుబడితో పర్యావరణ స్పృహతో, రీసైకిలింగ్ బిజినెస్ పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించింది. స్క్రాప్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనతో స్కాటిష్ ప్రభుత్వ అనుమతి తీసుకొని మరీ దీన్ని స్థాపించింది. మొదటి రెండేళ్లు పూనమ్ ఒంటరిగానే పనిచేసింది. రెండేళ్ల తర్వాత, ఒక స్నేహితుడు ఆమెతో పార్ట్ టైమ్ ప్రాతిపదికన చేరాడు. వ్యాపారం విస్తరించడంతో భర్త రూ. 1.5 కోట్ల ప్యాకేజీతో కంపెనీలో చేరడం విశేషం. యూకేలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పేపర్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 800 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా యూరప్, అమెరికాలోని కంపెనీల నుంచి చిత్తు కాగితాలను కొనుగోలు చేసి, దాన్నుంచి మంచి నాణ్యమైన కాగితాన్ని కూడా తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతిచేస్తుంది. ఇలా పీజీ పేపర్ ప్రపంచంలోని 53 దేశాల నుండి వస్తువులను దిగుమతి, ఎగుమతులను చేస్తుంది. పీజీ కంపెనీ ఉత్పత్తులను తొలుత ఎగుమతి చేసింది ఇండియాకే. ఇక్కడితో ఆగిపోలేదు. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్. మెడికల్‌తో సహా ఐటీ రంగంలోకి కూడా ప్రవేశించింది. దాదాపు 350 మంది ఉద్యోగులతో స్కాట్లాండ్ ప్రధాన కార్యాలయం వేదికగా తన సేవల్ని అందిస్తోంది. 7 దేశాలలో ఉన్న అనేక కార్యాలయాలతో 9 కంపెనీలున్నాయి. రానున్న కాలంలో పీజీ పేపర్ ఆదాయం రూ. 1000 కోట్లను అధిగమించాలనేది పూనమ్ గుప్తా టార్గెట్. పీజీ పేపర్ సీఈవో, యూకేలో ఉమెన్స్ ఎంటర్ప్రైజ్ స్కాట్లాండ్ అంబాసిడర్, అత్యంత గుర్తింపు పొందిన పారిశ్రామిక వేత్తలలో ఒకరు, యూకే-ఇండియా సంబంధాలలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది నాయకులలో ఒకరిగా పేరొందారు పూనమ్. స్థానిక, జాతీయ , అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తారు. భారత్‌లోని యువతుల విద్యకోసం, మహిళలను సాధికారతకు తప్పకుండా మద్దతు నిస్తున్న గొప్ప దాత కూడా. ఈమెకు ఇద్దరు కుమార్తెలు సాన్వి, అన్య, “వ్యాపారం చేయాలనే ఆలోచన మాత్రమే సరిపోదు; రంగంలోకి దిగాలి. పరిశోధన చేయాలి, ఎక్కడో ఒక చోట మొదలు ప్రారంభించండి లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. అలాగే మీ లాభాలను కంపెనీకి తిరిగి ఇవ్వడం మర్చిపోవద్దు’’ - పూనం గుప్తా -
Poonam Gupta: వ్యాపారాన్ని ఫైల్ చేసింది!
సాధారణంగా చదువు అయి΄ోగానే వెంటనే ఉద్యోగ వేటలో పడతారు చాలామంది. మంచి ఉద్యోగం కోసం వెతికి వెతికి చివరికి చిన్నపాటి జాబ్ దొరికినా చేరి΄ోతారు. కొంతమంది మాత్రం తాము కోరుకున్న దానికోసం ఎంత సమయం అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరందరిలాగే ప్రయత్నించింది పూనమ్ గుప్తా. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో తనే ఒక వ్యాపారాన్నిప్రారంభించి వందలమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది. సమస్య ఏదైనా నిశితంగా ఆలోచిస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనడానికి పూనమ్ గుప్తానే ఉదాహరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార కుటుంబంలో పుట్టింది పూనమ్ గుప్తా. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనమిక్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన పూనమ్.. తరువాత ఎమ్బీఏ చేసింది. చదువు అయిన వెంటనే ఉద్యోగాన్వేషణప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇలా జాబ్ ప్రయత్నాల్లో ఉండగానే... 2002లో పునీత్ గుప్తాతో వివాహం జరిగింది. పునీత్ స్కాట్లాండ్లో స్థిరపడడంతో పూనమ్ కూడా భర్తతో అక్కడికే వెళ్లింది. పెళ్లి అయినా.. దేశం మారినా పూనమ్ మాత్రం ఉద్యోగ ప్రయత్నాన్ని మానుకోలేదు. ఎలాగైనా జాబ్ చేయాలన్న కోరికతో అక్కడ కూడా ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. అనుభవం లేదని ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. స్కాట్లాండ్లో అయినా జాబ్ దొరుకుతుందనుకున్న ఆశ నిరాశగా మారింది. అలా వచ్చిన ఆలోచనే... ఉద్యోగం కోసం వివిధ ఆఫీసులకు వెళ్లిన పూనమ్‌కు.. అక్కడ కట్టలు కట్టలుగా పేర్చిన ఫైళ్లు కనిపించేవి. ఉద్యోగం దొరకక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఫైళ్లను రీసైక్లింగ్ చేయవచ్చు గదా. అన్న ఐడియా వచ్చింది. పేపర్‌ను రీసైక్లింగ్ ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను క్షుణ్ణంగా తెలుసుకుని కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది. స్కాటిష్ ప్రభుత్వం ఓ పథకం కింద ఇచ్చిన లక్షరూపాయల రుణంతో 2003లో ‘పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్’ కంపెనీని పెట్టింది.ప్రారంభంలో యూరప్, అమెరికాల నుంచి పేపర్ వ్యర్థాలను కొని రీసైక్లింగ్ చేసేది. రీసైక్లింగ్ అయిన తరువాత నాణ్యమైన పేపర్‌ను తయారు చేసి విక్రయించడమే పూనమ్ వ్యాపారం. ఏడాదికేడాది టర్నోవర్‌ను పెంచుకుంటూ కంపెనీ విలువ ఎనిమిది వందల కోట్లకు పైకి చేరింది. ప్రస్తుతం అరవై దేశాల్లో పీజీ పేపర్స్ వ్యాపారాన్ని విస్తరించింది. అమెరికా, చైనా, ఇండియా, ఈజిప్టు, స్వీడన్లలో సొంతకార్యాలయాలు ఉన్నాయి. పూనమ్‌కు అండగా... పీజీ పేపర్స్‌ని పూనమ్ ప్రారంభించిన రెండేళ్లకు భర్త పునీత్‌గుప్తా కూడా ఎనభై లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కంపెనీలో చే రారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యాపారాభివృద్ధికి కృషిచేశారు. దీంతో అనతి కాలంలోనే పీజీ పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పేపర్ ట్రేడింగ్ కంపెనీతోపాటు డెంటల్ హెల్త్ వంటి వ్యాపారాల్లోనూ పూనమ్ రాణిస్తోంది. అందరూ అదర్శమే... ‘‘నాకు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఒక్కోక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగాను. నాన్న, మామయ్య, టీచర్స్ నన్ను చాలా ప్రభావితం చేశారు. పెద్దయ్యాక మదర్ థెరిసా, ఇందిరా గాంధీ వంటి వారు మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించి చూపించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్తూ విజయాలు సాధిస్తున్నాను’’. – పూనమ్ గుప్తా -
పూనమ్‌కి చాన్స్
పోటీకి దీటుగా నిలబడితే కనుక పూనమ్ గుప్తా భారతదేశపు తొలి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అవుతారు. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సి.ఇ.ఎ.) అనేది దేశంలో పెద్ద పోస్టు. ఈ పోస్టులో ఉన్నవాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సలహాలు ఇస్తుండాలి. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే దాన్నుంచి గట్టెక్కించాలి. కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేస్తూ, అవసరమైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని, ఒప్పించేలా ఉండాలి. అయితే అంత కీలకమైన ఈ పోస్టులో ఇంతవరకు ఒక్క మహిళ కూడా లేరు! ప్రస్తుత సి.ఇ.ఎ. అరవింద్ సుబ్రహ్మణియన్. ఆయన పదవీకాలం గత ఆగస్టులోనే ముగిసింది. అప్పటి నుంచీ ఆయనే సలహాదారుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో అరవింద్ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక మహిళ వైపు మొగ్గు చూపుతోంది. ఆ మహిళే పూనమ్ గుప్తా. ప్రస్తుతం ఆమె ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్నారు. అంతకుముందు వరకు పూనమ్ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ’ (ఎన్.ఐ.పి.ఎఫ్.పి.) లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ ప్రొఫెసర్. అయితే సి.ఇ.ఎ. పదవికి పూనమ్‌కు గట్టి పోటీ ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అయిన జె.పి.మోర్గాన్‌లో చీఫ్ ఇండియా ఎకనమిస్టుగా ఉన్న సాజిద్ చినాయ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్ అయిన కృష్ణమూర్తి పేర్లను కూడా భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. మోదీ ప్రభుత్వానికి మరో ఆరు నెలల్లో కాల పరిమితి తీరిపోతున్నప్పటికీ.. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒడిదుదుకుల్లో ఉన్నందున వెంటనే సి.ఇ.ఎ. పోస్టును భర్తీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ త్వరపడుతోంది. అరవింద్ సుబ్రహ్మణ్యంని మొదట మూడేళ్ల పదవీ కాలానికి నియమించి, కాల పరిమితి తీరాక పన్నెండు నెలల పొడిగింపు ఇచ్చారు. ఆ పొడిగింపు కూడా గత ఆగస్టులో పూర్తయి నెలలు దాటింది. ఆ వారసుడిని / వారసురాలిని వెదికిపట్టే పట్టేందుకు ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యంలో ప్రభుత్వం ఒక ‘సెర్చ్ కమిటీ’ని కూడా ఏర్పాటు చేసింది. అరవింద్ సుబ్రహ్మణ్యం కన్నా ముందు రఘురామ్ రాజన్ సి.ఇ.ఎ.గా పని చేశారు. వీళ్లిద్దరూ కూడా ఐ.ఎం.ఎఫ్., వరల్డ్ బ్యాంకుల్లో పని చేసిన అనుభవం ఉన్నవారే. ఒకవేళ ఇప్పుడు పూనమ్ గుప్తా సి.ఇ.ఎ.గా ఎంపికైతే ఆమె కూడా ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంకుల నుండి వచ్చిన వారే అవుతారు. -
కోహ్లి పెయింటింగ్‌కు అత్యధిక ధర
బర్మింగ్‌హోమ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పెయింటింగ్‌ను ఓ అభిమాని అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు. బ్రిటీష్ ఇండియన్ పూనమ్ గుప్తా అనే పారిశ్రామికవేత్త రూ.2.4 కోట్లుకు కోహ్లీ పెయింటింగ్‌ను దక్కించుకున్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు శషా జెఫ్రీ కోహ్లీ ఐపీఎల్ ప్రయాణాన్ని పెయింటింగ్ మార్చిన విషయం తెలిసిందే. ఇటీవల కోహ్లి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ గుప్తా ఈ పెయింటింగ్‌ను కొనుక్కున్నారు. భారత యువ ఆటగాళ్లు ఆటలోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లో సేవా కార్యాక్రమాలు చేపట్టడం హర్షనీయమని, నా అభిమాన చిత్రకారుడు నా అభిమాన క్రికెటర్ పెయింట్ వేయడంతో కొనుక్కున్నట్లు పూనమ్ తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప చిత్రకారుడిగా గుర్తింపు పొందిన శషా యువీ, ధోనీ చారిటీల కోసం కూడా పెయింటింగ్‌లు వేశారు.