కోహ్లి పెయింటింగ్‌కు అత్యధిక ధర | British Indian buys Kohli painting for Rs 2.4 crore | Sakshi
Sakshi News home page

కోహ్లి పెయింటింగ్‌కు అత్యధిక ధర

Published Tue, Jun 13 2017 8:56 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

కోహ్లి పెయింటింగ్‌కు అత్యధిక ధర

కోహ్లి పెయింటింగ్‌కు అత్యధిక ధర

బర్మింగ్‌హోమ్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పెయింటింగ్‌ను ఓ అభిమాని అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు. బ్రిటీష్‌ ఇండియన్‌ పూనమ్‌ గుప్తా అనే పారిశ్రామికవేత్త రూ.2.4 కోట్లుకు కోహ్లీ పెయింటింగ్‌ను దక్కించుకున్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు శషా జెఫ్రీ కోహ్లీ ఐపీఎల్‌ ప్రయాణాన్ని పెయింటింగ్‌ మార్చిన విషయం తెలిసిందే. ఇటీవల కోహ్లి చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  పూనమ్‌ గుప్తా ఈ పెయింటింగ్‌ను కొనుక్కున్నారు.

భారత యువ ఆటగాళ్లు ఆటలోనే కాకుండా ఆఫ్‌ ఫీల్డ్‌లో సేవా కార్యాక్రమాలు చేపట్టడం హర్షనీయమని, నా అభిమాన చిత్రకారుడు నా అభిమాన క్రికెటర్‌ పెయింట్‌ వేయడంతో కొనుక్కున్నట్లు పూనమ్‌ తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప చిత్రకారుడిగా గుర్తింపు పొందిన శషా యువీ, ధోనీ చారిటీల కోసం కూడా పెయింటింగ్‌లు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement