Pop albums
-
అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’
మనసును తాకండి. అందమే అంతా కాదు. అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’. ఆశల్ని తుంచేయకండి. నవ్వుల్ని ఆర్పేయకండి. అమ్మాయిల్ని.. జబ్బున పడేయకండి. కొత్త కొరియన్ ‘పాప్’! గర్ల్ బ్యాండ్ పాడుతోంది. ప్రపంచం ఇష్టంగా వింటోంది. ‘‘నీ కళ్ల ముందే కూలిపోతున్నా.. పాతాళంలోకి జారిపోతున్నా.. అయినా రెండు చేతులతో నా ఆశను పట్టుకుని పైకి ఎగబాకుతున్నా.’’పాడుతున్నారు ‘బ్లాక్‌పింక్’ గర్ల్స్. ‘‘నన్ను చూడు, నీకు ఏమనిపిస్తోంది?’’ అని.. కొనసాగింపుగా అడుగుతున్నారు జెన్నీ, జిసూ, లిసా, రోజ్. ఎవరిని అడుగుతున్నారు! ఆడపిల్లకు ఆశలు కల్పించి పారిపోయే మగధీరుడొకడు ఉంటాడు కదా, అతడిని. కొరియన్ గర్ల్ పాప్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ కొత్త ఆల్బమ్ ‘ది అల్బమ్’ లోని ఎనిమిది పాటల్లో ఒకటైన ‘హౌ యు లైక్ దట్’ లోని కూలిన ఆశల గీతమిది. అక్టోబర్ 2న ఈ నలుగురమ్మాయిల బ్యాండ్ విడుదల చేసిన ‘ది ఆల్బమ్’ అక్టోబర్ 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల 20 వేల కాపీలకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా అంటే ఇంతవరకు ఆ ఏడుగురు అబ్బాయిల బి.టి.ఎస్. బాయ్ బ్యాండ్ మాత్రమే. వారే పాప్ హీరోలు, వారే పాప్ కింగులు. ఇప్పుడీ గర్ల్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ ధాటికి ఆ ఏడుగురు 2013 నుంచీ నిర్మించుకుంటూ వస్తున్న ‘పాప్’ లోక దుర్భేద్య మహా సామ్య్రాజ్యం బీటలు వారబోతున్న దృశ్యం లీలగా ఆవిష్కృతం కాబోతున్నట్లే ఉంది. బ్లాక్‌పింక్ వరుసగా మూడో వారం ‘బిల్బోర్డ్ 200’ లిస్టులో తొలి పదిస్థానాలలో ఉంటూ వస్తోంది! ‘ది ఆల్బమ్’లోని రెండో ట్రాక్ ‘ది ఐస్ క్రీమ్’! ‘దాహంగా ఉన్నట్లున్నావు.. కొంచెం దగ్గరకు రా..’ అని కోన్ల లా మూతిని తెరిచి మూడు నిముషాల మూడు సెకన్లలో అబ్బాయిల్ని ఫ్రీజ్ చేసేసే బ్లాక్‌పింక్ గర్ల్స్.. మూడో ట్రాక్ ‘ప్రెట్టీ శావేజ్’లో ‘బాయ్స్.. మేం వైలెంట్గానే ఉంటాం. తట్టుకోగలిగితే ఉండండి’ అని కొంచెం రూడ్గానే చెబుతారు. ‘రూడ్ కాదు, అందరికన్నా రూడ్’ అని ఇప్పటికే, ఈ నాలుగేళ్లలో ఈ నలుగురు పిల్లలకు పేరొచ్చేసింది! 2016లో ప్రారంభించారు బ్లాక్‌పింక్ పాప్ బ్యాండ్‌ని. ఈ ఎనిమిది ట్రాక్‌లకు ముందు ఐదు సింగిల్స్ ఉన్నాయి. అసలు వాటితోనే వాళ్లేమిటో చూపించారు. ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్లాలి ‘ది ఐస్ క్రీమ్’ కోసం! మొత్తం 174 సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో పది లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడై రికార్డు నెలకొల్పిన తొలి బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’! ఏమిటి బ్లాక్‌పింక్ అంటే?! ఈ అమ్మాయిలు కల్పించిన అర్థం.. ‘అందమే అంతా కాదు’ అని! అమ్మాయిల్ని అందమైన పింక్ గులాబీతో పోలుస్తాం. ‘అందాన్నే చూడకండి’ అంటూ పింక్‌కి బ్లాక్‌ని జోడించి బ్లాక్‌పింక్ అని తమ బ్యాండ్‌కి పేరు పెట్టుకున్నారు. బ్లాక్‌పింక్ అని కాకుండా, పింక్బ్లాక్ అంటే మళ్లీ అది బ్లాక్‌కి పింక్ అందాన్ని అంటు కట్టినట్లు. అందుకే బ్లాక్‌ని ముందుకు తీసుకున్నారు. తెలివైన అమ్మాయిలే. ‘లవ్సిక్ గర్ల్స్’ ఐదో ట్రాక్. అమ్మాయిల్ని ప్రేమ సతాయింపులు ఎంత జబ్బున పడేస్తాయో చూడండి. ‘ప్రేమ మనల్ని వలపన్ని కిటీకీలు లేని గదిలో బంధించింది. ప్రతిసారీ బాధిస్తోంది. గుండెలు పగిలి ఏడ్చేలా చేస్తోంది. చివరికి ఏడుపు కూడా రానంతగా మొద్దుబారుతున్నాం..’’ అని పాడతారు. ‘బెట్ యు వాన్నా’, ‘క్రేజీ ఓవర్ యు’, ‘లవ్ టు హేట్ మీ’, ‘యూ నెవర్ నో’ మిగతా నాలుగు ట్రాక్స్. ‘ఎక్కడికెళదామో చెప్పు, అన్నీ సర్దుకుని నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను..’ (బెట్ యు వాన్నా), ‘నువ్వంటే నాకు పిచ్చి. నీ మనసులోనూ నేను ఉన్నానని తెలుసు. అయినా కానీ నువ్వు గీసుకున్న గీతను దాటి రానులే’ (క్రేజీ ఓవర్ యు), ‘నెగిటివ్ డేస్, నెగిటివ్ నైట్స్. బేబీ యు ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్’ (లవ్ టు హేట్ మీ), ‘నేను ప్రకాశవంతంగా నవ్వుదామని ప్రయత్నించిన రోజు.. చీకటి మరింతగా గాఢమైన నన్ను మింగేయాలని చూస్తుంటుంది ఎందుకనో..’ (యూ నెవర్ నో).. అని జెన్నీ, జిసూ, లిసా, రోజ్.. అమ్మాయిలు ఎంతగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ వల్ల అంతగా హర్ట్ అవుతూ ఉంటారని ‘ది అల్బమ్’ ట్రాకులలో పాడతారు. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’ అని చెబుతారు. అందుకే ‘బ్లాక్‌పింక్’ ఇంతగా హిట్ అయినట్లుంది. -
ప్రస్తుతం నా జీవితం ఈ మూడింటికే అంకితం!
‘‘నేను చేసే ఏ పని అయినా సమాజానికి ఉపయోగపడాలన్నది నా ఆకాంక్ష’’ అని స్మిత అన్నారు. పాప్ గాయనిగా ఆమె తెచ్చుకున్న పేరు, ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కొంత కాలంగా ఆమె ‘పాప్’ ఆల్బమ్స్ చేయడం లేదు. ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారని తెలిసింది. అసలు స్మిత ఇప్పుడేం చేస్తున్నారు? ఆమె భవిష్యత్తు ప్రణాళిక లేంటి? వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? తదితర ప్రశ్నలకు సమాధానమే ఆమెతో జరిపిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ... ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అసలు మీ లక్ష్యం ఏంటి? డిసెంబర్లో నేనో కార్యక్రమం చేయనున్నా. దాని గురించి ఇప్పుడు చెప్పను. కానీ, దాని కోసమే ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఇందులో భాగంగా ‘కిక్ బాక్సింగ్’ నేర్చుకుంటున్నా. ఇంకా హిందుస్తానీ మ్యూజిక్‌కి సంబంధించిన డాన్స్‌ని వేరే పద్ధతిలో జనం ముందు ప్రదర్శించాలన్నది నా కోరిక. అందుకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నా. ‘ఆలయం’, ‘బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ’, ఎక్స్‌ప్రెస్’... ఇలా పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వాటి గురించి చెబుతారా? ‘ఆలయం’ అనేది పూర్తిగా చేనేత వస్త్రాలకు సంబంధించినది. చీరలు, డ్రెస్‌లు అన్నీ వుంటాయి. నవరాత్రులప్పుడు ప్రత్యేకంగా ఒక్కోరోజు ఒక్కోరకం చేనేత చీరలను కొత్తగా డిజైన్ చేసి, ప్రదర్శిస్తుంటాం. బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీకి సంబంధించి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటికే ఏడు శాఖలున్నాయి. ఇక, విజయవాడలో ఉన్న జిమ్ సెంటర్ ‘ఎక్స్‌ప్రెస్’ నిర్వహణ కూడా బాగుంది. ఇవే కాదు.. మ్యూజిక్‌కి సంబంధించి ‘మ్యాడ్’ అనే స్కూల్ కూడా నిర్వహిస్తున్నా. బేసిక్‌గా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా చిన్నప్పుడు మా అమ్మా, నాన్న చేసే వ్యాపారాల మీద ఆసక్తి కనబర్చేదాన్ని. బహుశా ఇన్ని వ్యాపారాలతో బిజీగా ఉండటంవల్లే ‘పాప్’ మ్యూజిక్‌కి దూరంగా ఉంటున్నారేమో? పాప్ అంటే అదేదో వెస్ట్రన్ మ్యూజిక్ అనుకుంటారు చాలామంది. కానీ, ‘పాపులర్ అయిన మ్యూజిక్’ని పాప్ మ్యూజిక్ అంటారు. అలా చూస్తే.. మన భారతీయ జానపద గీతాలు కూడా ‘పాప్’ కిందకే వస్తాయి. పాప్కి ఒక జానర్ అంటూ లేదు. నేను చేస్తున్న భక్తి గీతాలు కూడా పాప్ కిందే లెక్క. ఆ మధ్య ‘ఐ క్యాండీ’ అనే సంస్థ ఆరంభించి, బుల్లితెర కోసం ‘షో’ చేశారు. ఆ తర్వాత మళ్లీ చేయకపోవడానికి కారణం? వాస్తవానికి రెగ్యులర్‌గా షోస్ చేయాలనే ఆలోచనతో ఆ సంస్థ ఆరంభించలేదు. ప్రతిభ గల నృత్యకళాకారులను ప్రోత్సహించాలనే ఆకాంక్షతోనే అది చేశాను. ఆ షో ముగిసింది. భవిష్యత్‌లో మంచి మ్యూజిక్ బేస్డ్ షో చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా. కొంత కాలంగా ఆధ్యాత్మిక బాటలో వెళుతున్నట్లనిపిస్తోంది.. ముఖ్యంగా ‘ఇషా ఫౌండేషన్’పై మమకారం పెంచుకున్నట్లున్నారు? అవును. ఇషా గురించి నా స్నేహితురాలు చెబితే, కోయంబత్తూరు వెళ్లాను. అక్కడో మూడు రోజులున్నాను. ఆ మూడు రోజులూ నాకు లభించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. మాతా, పితా, దైవం కన్నా మంచి సద్గురువు ముఖ్యం. జగ్గీ వాసుదేవ రూపంలో సద్గురువు దొరికారు. ఇషా ఫౌండేషన్ నుంచి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం, జీవితాన్ని చూసే కోణం మారింది. నిర్ణయాలు తీసుకునే విషయంలో అంతకుముందుకన్నా వేగం, స్పష్టత వచ్చింది. జీవితంలో జరిగే ప్రతిదానికీ కారణం ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. అక్కడ పొందిన అనుభూతి వల్లేనా ‘యోగేశ్వరాయ...’ ఆల్బమ్ చేశారు? అవును. నాకో మంచి అనుభూతి కలిగేలా చేసిన నా గురువు జగ్గీ వాసుదేవ కోసం నేనేమైనా చేయాలనుకున్నాను. ఆల్బమ్ చేస్తానని నా గురువు దగ్గర చెప్పాను. సరే అన్నారు. ఆరు నెలల్లో పూర్తి చేశా. ఆల్బమ్ ద్వారా వచ్చిన డబ్బు సేవా కార్యక్రమాలకు వినియోగించినట్లున్నారు? సంగీతానికి సంబంధించి నేనేం చేసినా.. నా ట్రస్ట్‌కి కొంత డబ్బు వెళ్లిపోతుంది. ముఖ్యంగా నా ముందున్న లక్ష్యం ఖమ్మంలోని ఓ సంస్థ. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి సంబంధించిన ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యాను. అందుకే, నా వంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నా. ఈ మధ్యకాలంలో నేను ‘షో’స్ చేయలేదు. కానీ, ఈ సంస్థకు ఓ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న సదాశయంతో ఈ 20న యూఎస్‌లో ఓ షోలో పాల్గొంటున్నా. మీ జీవన శైలి ఆధునికం. మీరేమో ఆధ్మాత్మికమంటున్నారు. పొంతన కుదరట్లేదే? ఆధ్యాత్మికం అంటే అన్నీ త్యజించాల్సిన అవసరం లేదు. జీవితాన్ని తెలుసుకోవడం. మంచి పనులపై మనసుని కేంద్రీకరించడం. మా కుటుంబంలో మా అమ్మమ్మ లక్ష్మీ కాంతమ్మ ఆధ్యాత్మిక బాటలోనే వెళ్లేవారు. రాజకీయ నాయకురాలిగా ఆవిడకున్న పేరు నాటి తరం వారికి తెలుసు. అప్పట్లో తను ధ్యానంలో ఎంత లీనం కాగలిగిందో, ఇప్పుడు నేనూ ఆ స్థాయిలో లీనం కాగలుతున్నాను. అంతా బాగానే ఉంది.. మరి మీ వ్యక్తిగత జీవితం సంగతేంటి? నా కుటుంబం అండదండలు లేకపోతే నేననుకున్నవన్నీ చేయగలిగేదాన్ని కాదు. పెద్దయిన తర్వాత మనం హౌస్‌వైఫ్ కావాలని, మంచి హోమ్ మేకర్ కావాలని నేను అనుకోలేదు. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకునేదాన్ని. మా అమ్మమ్మ, అమ్మలా ఓ స్ట్రాంగ్ ఉమన్‌గా ఉండాలనుకునేదాన్ని. ఢిల్లీ యూనివర్శిటీకి జాయింట్ సెక్రటరీగా చేసేది. అప్పట్లో అమ్మని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేసినా తను ఒప్పుకోలేదు. అమ్మది మంచి గాత్రం. కానీ, గాయని కావాలనే తన కలను నెరవేర్చుకోలేకపోయింది. నేను గాయని అయినప్పుడు తన కలని నాలో చూసుకుంటుందేమో అనుకున్నాను. నా బలం మా అమ్మే. మీ భర్త గురించి... మీరిద్దరూ విడిపోయారనే టాక్ ఉంది? (నవ్వుతూ) ప్రముఖుల గురించి వదంతులు ప్రచారం చేసి, ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అని చిన్న మెలిక పెడతారు. కానీ, ఇక్కడ నిప్పే లేదు.. ఇక పొగ ఎలా వస్తుంది? నేనూ, నా భర్త శశాంక్ హాయిగా ఉన్నాం. నేనేం చేసినా ఆయన కాదనరు. మాకో మూడేళ్ల పాప ఉంది. పేరు ‘షివి’. ‘షివి’ అంటే అర్థం ఏంటి? పాప పుట్టిన తర్వాత నా గురువు జగ్గీ వాసుదేవ్ ‘మీ అమ్మాయికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావ్’ అనడిగితే ఆయన సలహా కోరా. ‘షివి’ అన్నారు. నేను కోరుకున్నట్లు.. ఎస్ అక్షరంతోనే పేరు ఉండటం, ఆ పేరుకి శివుడిలో ఒక భాగం అనే అర్థం ఉండటంతో ఆనందంగా అంగీకరించాం. ‘మల్లీశ్వరి’ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించకపోవడానికి కారణం? ఆ సినిమా ఒప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. యాక్ట్ చేయాలని ఉండేది కాదు. కానీ, ఎందుకు ఒప్పుకున్నానో ఇప్పటికీ తెలియదు. అయితే, ఆ సినిమా చేయడం ద్వారా ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి వంటి అన్న దొరికాడు. ‘యోగేశ్వరాయ..’ ఆల్బమ్ చేయాలనుకున్నప్పుడు, కెమెరామేన్‌గా సమీర్ అయితే బాగుంటుందనుకున్నా. కానీ, తను ఫుల్ బిజీ. అందుకని, మొహమాటపడుతూనే అడిగా. ‘ఇది అడగడానికి నువ్వింతగా ఫీలవ్వాలా’ అంటూ డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు. అలాగే... కెమెరా, లైట్.. అన్నీ ఉచితంగా ఇచ్చారు. అంటే.. ఇక నుంచి సినిమాల్లో అస్సలు నటించరా? కమర్షియల్ సినిమాలైతే చెయ్యను. గొప్ప సందేశం ఉన్న సినిమా అయితే ఓకే. ఆ సినిమా ద్వారా పది మందికీ ప్రయోజనం చేకూరుతుందనిపిస్తే చేస్తాను. ఆధ్యాత్మికం, దేశభక్తి, సేవ... మీ జీవితం వీటి చుట్టూ తిరుగుతోందన్నమాట? అవును. ఏ వ్యాపారం చేసినా కొంత సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నా. ప్రస్తుతం నా జీవితం మీరు చెప్పిన ఈ మూడింటికీ అంకితమైపోయింది. నరేంద్ర మోదీకి మద్దుతుగా ‘వేకప్ ఇండియా’ ఆల్బమ్ చేశారు.. మీ అమ్మమ్మగారిలా రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాలపరంగా నాకు అజెండా ఏదీ లేదు. నాకు దేశభక్తి ఎక్కువ. అందుకే మోదీగారంటే అభిమానం. ఆ కారణంగానే ఆయనకు మద్దతు ఇచ్చాను. కానీ, ఇప్పుడు ప్రపంచం ఎలా తయారయ్యిందంటే.. ఎవరికైనా ఏదైనా చేస్తే, ఏదో ఆశించే చేస్తున్నారు. కాబట్టి, పదవుల కోసమే చేస్తున్నాననుకుంటున్నారు. ‘వేకప్ ఇండియా’ చేసిన తర్వాత నాలోని దేశభక్తిని గౌరవిస్తున్నారు. ఆ సమయంలో నాకు లభించే అనుభూతి ఏ పదవి ఇస్తుంది? డి.జి. భవాని -
ఏడాది కాపురం పూర్తయ్యింది
హృదయం: మొన్నటి జూలై 11 తో జోడీ రోస్, లె పాంట్ డు డయబుల్ వివాహ బంధానికి ఏడాది పూర్తి అయ్యింది! ఈ సందర్భంగా జోడీ లెపాంట్ డు మీద గంతులేస్తూ తన ఆనందాన్ని పంచుకొంది. చాలా మంది తమ బంధాన్ని అవమానిస్తూ మాట్లాడారని, తనను పిచ్చిదాన్ని చూసినట్టుగా చూశారని, అయితే ఏడాదిగా లెపాంట్ డుతో బంధాన్ని కొనసాగించి తన ప్రేమను నిరూపించుకొన్నానని, తమ వివాహ బంధం ఇలాగే నిండునూరేళ్లు కొనసాగుతుందని జోడీ చెప్పుకొచ్చింది! అయితే లెపాంట్ డు మాత్రం మారు మాట్లాడలేదు. ఎందుకంటే అది ఒక రాతి కట్టడం, కాంక్రీట్ స్ట్రక్చర్! ప్రకృతిరమణీయ ప్రదేశాలపై ఎంతోమంది మనసు పారేసుకొంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన నిర్మాణాలను, కట్టడాలను ప్రేమిస్తారు. అయితే జోడీ రోస్కు మాత్రం ఈ ప్రేమ ముదిరింది. ఏకంగా ఒక బ్రిడ్జిని పెళ్లి చేసుకొంది! ఆ బ్రిడ్జినే తన భర్తగా భావిస్తోంది! చట్టబద్ధంగా ఆ పెళ్లి చెల్లకపోయినా... జోడీ మాత్రం తమ జోడీని ఎవరూ విడదీయలేరని అంటోంది. జోడీ రోస్ ఒక ఆస్ట్రేలియన్. పాపులర్ పాప్ సింగర్. పాప్ ఆల్బమ్స్‌ను రూపొందించడంలో భాగంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలను సంద ర్శించిందామె. అనేక వంతెనల మీద నిలబడి పాడుతూ ఆల్బమ్స్‌ను రూపొందించింది. అలాంటి ఆమెకు ఫ్రాన్స్‌లోని లెపాంట్ డు డయబుల్ బ్రిడ్జ్ చాలా నచ్చేసింది! ఎంతగానంటే పెళ్లి చేసుకోవాలనేంతగా! ఇంకేముంది... తన నిర్ణయాన్ని సన్నిహితులందరికీ చెప్పేసింది. వాళ్లందరినీ తన పెళ్లికి ఆహ్వానించింది. అంతా ఆశ్చర్యపోయారు. ఒక వంతెననుపెళ్లి చేసుకోవడం ఏమిటి? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే అప్పటికే జోడీ ఆ బ్రిడ్జితో నిండా ప్రేమలో మునిగిపోయిన తీరును చూసి ఎవరూ వాళ్ల పెళ్లికి అడ్డుగా మారలేదు. అయితే ఫ్రాన్స్‌లో ఇలాంటి పెళ్లిళ్లు చెల్లవు. మనుషులు ఇలా కట్టడాలను పెళ్లి చేసుకొంటే తాము గుర్తించమని స్థానిక మేయర్ స్పష్టం చేశాడు. అయితే అంత కోరికగా ఉంది కాబట్టి... పెళ్లి చేసుకొంటే చేసుకోవచ్చని అనుమతినిస్తూ మేయర్ స్వయంగా ఆ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. ఆ విధంగా ఏడాది కిందట జోడీ ముచ్చట తీరింది. ‘‘నేను ప్రపంచంలో ఎన్నో బ్రిడ్జిలను చూశాను. కానీ లె పాంట్ డు డయబుల్లో సొగసు ఎక్కడా కనపడలేదు. ఇది నా మీద తనప్రేమను ప్రకటిస్తున్నట్టుగా అనిపించింది. ఈ వంతెన మీద నిలబడి నేను అద్భుతమైన సంగీతాన్ని కంపోజ్ చేయగలిగాను. క్రమంగా దీని మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను...’’అంటూ జోడీ తన ప్రేమ గురించి, పెళ్లి నిర్ణయం గురించి వివరిస్తుంది. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా... జోడీతో పెళ్లి కి లె పాంట్కు ఇష్టం ఉందా? లేదా? అనే ది కనుక్కోవాల్సిందని కొంతమంది చమత్కరిస్తున్నారు. ప్రేమ సరిగమలు భూగోళం వేగంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు మనుషులు ఎగిరిపోయి పడకుండా పట్టి ఉంచే బంధమే ప్రేమ. అలాంటి పవిత్రమైన ప్రేమకు ఉన్నశక్తులు అన్నీ ఇన్నీకావు! - ప్రేమ గురించి, ప్రియమైన వాళ్ల గురించి ఎక్కువగా ఊహించుకొనే వాళ్లలో సృజనాత్మక శక్తి , ఏకాగ్రతలు పెరుగుతూ ఉంటాయట! - ప్రియమైన వాళ్ల చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే మనసులోని ఎంత బాైధె నా ఇట్టే తరిగిపోతుందట. - కళ్లలోకి సూటిగా చూస్తూ ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేస్తుంటే అపరిచితుల మధ్యనైనా సరే ప్రేమ పొంగుకొస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. - ఉదయాన్నే ప్రియురాలిని కిస్ చేస్తూ ఆమెతో సరదాగా గడిపే మగాళ్లు మిగతా వాళ్లకన్నా ఐదేళ్లపాటు ఎక్కువగా బతుకుతారని అంటోంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తల అధ్యయనం. - తొందరగా ప్రేమలోపడేది మగవాళ్లే. అలాగే ఆ ప్రేమ విఫలం అయితే ఎక్కువగా బాధపడేది కూడా వాళ్లే! -
నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు
‘నాక్కొంచెం తిక్కుంది... అయితే... దానికో లెక్కుంది’ అని ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ అన్నట్లు... ‘నాక్కొంచెం పొగరెక్కువ. అందుకని నేను గర్విష్టిని మాత్రం కాను’ అని మీడియా ముందు అదిరిపోయే స్టైల్లో చెప్పేశారు ప్రియాంక చోప్రా. ఇటీవల ఓ చానల్ రియాలిటీ షోలో అతిథిగా పాల్గొన్న ప్రియాంక... తన గురించి పలు అసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘నా జీవితమే ఒక విచిత్రం. ఎందుకంటే... నా లైఫ్‌లో నేను దేని గురించీ పోరాడింది లేదు. అసలు నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు. అయితే... కోరుకున్న దానికంటే ఎక్కువ నాకు దక్కింది. ఇంజినీరింగ్ కానీ, క్రిమినల్ సైకాలజీ కానీ చదవాలనేది నా యాంబిషన్. అదే లక్ష్యంగా స్కూల్‌కి వెళ్లేదాన్ని. స్కూల్ చదువు పూర్తయింది. మిస్ వరల్డ్ కిరీటం తలపైకొచ్చింది. ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు చుట్టుముట్టాయి. ప్రపంచ స్థాయి మీడియా నా ముందుకొచ్చి నిలబడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సెలబ్రిటీ అయిపోయాను. అయితే... ఎంత ఎదిగినా నా కళ్లు మాత్రం నెత్తిపైకి ఎక్కవు. ఎందుకంటే... నా తిక్కను దించడానికి పక్కనే మా అమ్మ సిద్ధంగా ఉంటుంది’’ అని చెప్పారు ప్రియాంక. ‘‘కెరీర్లో నేను అనుకున్నదేం జరగ్గపోయినా... ఒక విషయంలో మాత్రం పోరాడాలని నిశ్చయించుకున్నా. అదే ‘మ్యూజిక్’. గతంలో కొన్ని పాప్ ఆల్బమ్స్ పాడాను. అనుకోకుండా పాడినా... మంచి పేరొచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో నటిగా ఉండి పాప్ మ్యూజిక్ పాడింది జెన్నిఫర్ లోపెజ్ తర్వాత నేను మాత్రమే. భవిష్యత్తులో పాప్ మ్యూజిక్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉంది’’ అని ప్రియాంక ఆశాభావం వెలిబుచ్చారు.