possition
-
కుతుబ్‌మినార్ కాదు సూర్య గోపురం!
Qutub Minar was built by Raja Vikramaditya to observe the sun: తాజ్‌మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేగాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్ మినార్‌ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్ అలల్ దిన్ ఐబాక్ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కతుబ్‌మినార్ కాదు సూర్యగోపురం(అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్‌లో పలుమార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉందని జూన్ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు. కుతుబ్‌మినార్ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం) -
పల్స్ సర్వే తీరుపై కలెక్టర్ సీరియస్
పనిచేయని ఎన్యూమరేటర్లను తొలగించాలని ఆదేశం మండలస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజల జీవన స్థితి గతులు, కుటుంబ సమగ్ర వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే జిల్లాలో కొనసాగుతున్న తీరు, తెన్నులపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో ఆయన మాట్లాడారు. సర్వే ప్రారంభించి 18 రోజులైనప్పటికీ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల పరిధిలో ఒకట్రెండు ఇళ్లకు మించి సర్వే చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేటర్లు సక్రమంగా పని చేయకుంటే తొలగించాలని ఆదేశించారు. సర్వే కార్యక్రమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. ఈ నెల 29న జిల్లాలో 11.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో కృష్ణా పుష్కరాల పనులు జరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో కె.నాగబాబు, జిల్లా అటవీ శాఖాధికారి పి.రామ్మోహన్, జెడ్పీ సీఈవో సోమేపల్లి వెంకట సుబ్బయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.