Post Matric Scholarship
-
ఫీజు పైసల్... ముందే వసూల్ !
సాయివర్ధన్ (పేరుమార్చాం) పాలీసెట్లో మెరుగైన ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నాడు. కాలేజీలో రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన ఆ విద్యార్థికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, ట్యూషన్ ఫీజు చెల్లించాలని, లేకుంటే అడ్మిషన్ ఇవ్వలేమని తెలియచెప్పింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలైన తర్వాత, ఆ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో రూ.52 వేల రూపాయలు చెల్లించి అడ్మిషన్ పొందాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన టి.మానస (పేరుమార్చాం) డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సు పూర్తి చేసింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, యాజమాన్య ఒత్తిడితో ఫీజు చెల్లించింది. ఏడాది క్రితం కోర్సు పూర్తి కావడంతో ఒరిజినల్ సరి్టఫికెట్ల కోసం కాలేజీకి వెళితే ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పారు. దీంతో మళ్లీ డబ్బు కట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.46 వేలు ఇప్పటికీ అందలేదు.సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హత సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా కాలేజీలో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాలేజీల్లో పరిస్థితి తారుమారైంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద అర్హత సాధించినా సరే... అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీజు పూర్తిగా చెల్లించాల్సిందే.సీనియర్ విద్యార్థులయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లించాలి. ప్రభుత్వం రీయింబర్స్ నిధులు కాలేజీకి విడుదల చేసినప్పుడు... సదరు విద్యార్థుల బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయడమో... లేక చెక్కు రూపంలో విద్యారి్థకి అందిస్తామంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యాకాలేజీలు ఇదే తరహా ముందస్తుగా ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. ఉచితంగా ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థులకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయి. ఏటా 12లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో 5,539 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. ఇందులో 2,641 జూనియర్ కాలేజీలు, 1,514 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. 235 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కాగా, 217 పారా మెడికల్ కాలేజీలున్నాయి. ఇతర వృత్తివిద్యా కేటగిరీల్లో మిగిలిన కాలేజీలున్నాయి. వీటి పరిధిలోని 12 లక్షల మంది విద్యార్థులు ఏటా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ముందస్తు వసూళ్లకు దూరంగా ఉంటున్నా, వృత్తి విద్యా కళాశాలలు మాత్రం అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ,ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కనీసం కాలేజీలకు వెళ్లి ఫీజులపై తనిఖీలు కూడా చేయడం లేదు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాంఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.1,550 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు చెల్లిపులు చేస్తున్నాం. మా కార్యాలయానికి విద్యార్థులు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి ముందస్తు ఫీజు వసూలపై సంక్షేమ శాఖల అధికారులు సీరియస్గా పరిగణించాలి. కాలేజీల వారీగా విచారణ చేపట్టాలి. అలా వసూళ్లకు పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులెవరూ ముందస్తుగా ఫీజులు చెల్లించొద్దు. – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ పరిస్థితి ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడంతోనే యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో ఫీజు నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – కందడి శ్రీరామ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
నెల రోజుల్లో పరిశీలన.. ఆపై ఉపకారవేతనాలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మార్చి 31తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా... మొత్తం 12,59,812 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో రెన్యువల్స్ 7,36,799 కాగా, ఫ్రెషర్స్ దరఖాస్తులు 5,23,013 ఉన్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గత సెపె్టంబర్లో ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ... డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావడంలో తీవ్ర జాప్యం జరగడంతో జనవరి 31 వరకు గడువు పొడిగించారు. కానీ అప్పటివరకూ అడ్మిషన్లు కొనసాగుతుండటంతో చివరి అవకాశం కింద మార్చి 31 వరకు గడువు పొడిగించారు. ఇప్పుడు దరఖాస్తుల గడువు ముగియడంతో అధికారులు వాటి అర్హత నిర్ధారణపై దృష్టి సారించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే సంక్షేమ శాఖలు అందుబాటులో ఉన్న నిధులను ముందుగా ఉపకారవేతనాలు విడుదల చేసి, ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. నెలరోజుల్లో పరిశీలన పూర్తి... ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలనకు సంక్షేమ శాఖలు నెలరోజుల గడువును నిర్దేశించుకున్నాయి. ఏప్రిల్ ఆఖరు కల్లా వీటిని పరిశీలించి అర్హులను నిర్ధారించాలని నిర్ణయించాయి. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ , వికలాంగుల సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు ముందుగా సంబంధిత కాలేజీ యాజమాన్యం యూజర్ ఐడీకి చేరతాయి. కళాశాల ప్రిన్సిపల్ దరఖాస్తులను పరిశీలించి వాటిని సంక్షేమాధికారికి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులను నిర్ధారిస్తారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి విద్యార్థి మీసేవా కేంద్రాల్లో వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తయ్యాక సంక్షేమ శాఖలు సదరు దరఖాస్తును ఆమోదిస్తాయి. ఈ ప్రక్రియ కోసం సంక్షేమ శాఖలు నెలరోజులు గడువు నిర్దేశించుకున్నప్పటికీ మరింత ఎక్కువ సమయం పడుతుందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. పరీక్షలు, ప్రిపరేషన్ నేపథ్యంలో విద్యార్థులు వేలిముద్రలు సమర్పించడంలో జాప్యం జరుగుతుందని, ఏటా ఇదే జాప్యం వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. -
ఫీజులు దులపండి
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకారవేతన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కనిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో క్రమంగా బకాయిలు పెరిగిపోతున్నాయి. 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు నిధుల విడుదలకు ప్రభుత్వం తాత్సారం చేయడంతో బకాయిలు ఏకంగా రూ.2,117.66 కోట్లకు పేరుకుపోయాయి. తాజాగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం వరకు గడువుండగా, ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టి అర్హతను నిర్ధారిస్తారు. అనంతరం తాజా విద్యా సంవత్సర చెల్లింపులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రెండేళ్లుగా బకాయిలు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు కూడా ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ‘బీసీ’ నిధులు భారీగా పెండింగ్.. గత విద్యా సంవత్సరం వరకు ఉన్న రూ.2117.6 కోట్ల బకాయిల్లో బీసీ సంక్షేమ శాఖకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ శాఖకు సంబంధించి రూ.1,376.36 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2020–21కు సంబంధించి రూ.322.25 కోట్లు, 2021–22కు చెందిన రూ.1,054.11 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఉండడం, ఆ మేరకు అందుబాటులో ఉన్న నిధులను సర్దుబాటు చేస్తుండడంతో ఆయా శాఖలకు సంబంధించిన బకాయిలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు కూడాపెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నట్లు ఆయా శాఖలు చెబుతున్నాయి. ఖజానా శాఖకు అనుమతులు లేక... ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కో సం వచ్చిన దరకాస్తులను పరిశీలించి వాటిని ఆమోదిస్తున్న సంక్షేమ అధికారులు.. జిల్లా స్థాయిలో వాటికి బిల్లులు రూపొందించి నిధుల విడుదల కోసం ఖజానా విభాగానికి పంపిస్తున్నారు. అలా పంపిన బిల్లులు సంక్షేమ శాఖల్లో పరిష్కరించినట్లు రికార్డు చూపిస్తున్నప్పటికీ.. ఖజానాల్లో నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన బిల్లులను మాత్రమే ఖజానా అధికారులు క్లియర్ చేస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ నిధులు మాత్రమే సకాలంలో పరిష్కరిస్తుండగా... మిగతా ఎలాంటి బిల్లులకు ఆమోదం లభించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పరిశీలనతోనే సరి! 2022–23కు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చివరి తేదీ జనవ రి 31 నాటికి 12.5 లక్షల దరఖాస్తులు వస్తాయని సంక్షేమ శాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ పరిశీలన పూర్తి చేసేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి చూస్తే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ రూ.2,350 కోట్లు ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో కేవలం దరఖాస్తుల పరిశీలనతోనే సరిపెట్టి, పాత బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఖాజీపేటకు చెందిన రాఘవేంద్ర కుమార్ కూకట్పల్లి సమీపంలోని ఓ కాలేజీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్ష ఫీజు సమయంలో మొదటి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం మెలిక పెట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అర్హులు సైతం ట్యూషన్ ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాక వారికి తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ట్యూషన్ ఫీజు రశీదు ఇచ్చిన విద్యార్థుల నుంచే సెమిస్టర్ పరీక్ష ఫీజు స్వీకరిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో రాఘవేంద్రకుమార్ డబ్బులు వడ్డీకి తెచ్చి ట్యూషన్ ఫీజు, సెమిస్టర్ ఫీజు చెల్లించాడు. -
ఎస్సీ విద్యార్థులపై కేంద్రం వరాలు
న్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థులకు భారీగా పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈమేరకు బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ స్కాలర్షిప్ మొత్తాన్నిఐదు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు రూ.59 వేల కోట్ల స్కాలర్షిప్లు అందించనున్నట్లు తెలిపింది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతంగా అంటే రూ.35,534 కోట్లుగా ఉండగా మిగిలిన వాటా రాష్ట్రాలదే బాధ్యత అని స్పష్టం చేసింది. డీటీహెచ్ సర్వీసుల మార్గదర్శకాలను సైతం సవరించింది. ఇక నుంచి 20 ఏళ్లకు ఒకసారి డీటీహెచ్ సర్వీస్ లైసెన్స్ ఉంటుందని, ప్రతి మూడు నెలలకోసారి లైసెన్స్ ఫీజు చెల్లించాలని వివరించింది. డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య మౌలిక సదుపాయాల షేరింగ్కు అనుమతినిచ్చింది. (చదవండి: ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్) ఎల్లుండి పీఎం కిసాన్ నిధులు విడుదల నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు విభాగాలను విలీనం చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్ఎఫ్డీసీలో ఫిల్మ్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ విలీనాలను ఆమోదించింది. ఇదిలా వుండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రూ.9 కోట్లకు పైగా రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆరు రాష్ట్రాల రైతులతో మాట్లాడనున్నారు. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమాలను వివరించనున్నారు. (చదవండి: స్పెక్ట్రమ్ వేలానికి సై!) -
716 కళాశాలలకు... ఏదీ గుర్తింపు..?
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల పరిశీలన ప్రహసనంగా మారింది. 2019–20 విద్యా సంవత్సరానికి గాను పలు కళాశాలలు ఇప్పటికీ యూనివర్సిటీ/బోర్డు గుర్తింపు పొందిన పత్రాలను సంక్షేమ శాఖలకు సమర్పించలేదు. ఏటా పునరుద్ధరీకుంచుకున్న తర్వాత వాటిని సంక్షేమశాఖ కార్యాలయంలో, ఈ–పాస్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన 716 కాలేజీలు ఇప్పటికీ గుర్తింపు/రెన్యువల్ పత్రాలను సమర్పించకపోవడం గమనార్హం. 5,712 కళాశాలలకు లభించిన ధ్రువీకరణ.. రాష్ట్ర వ్యాప్తంగా 6,428 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కాలేజీలున్నాయి. ఇందులో అత్యధికంగా 2,888 ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొంది ఉన్నాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గాను అవన్నీ గుర్తింపు పత్రాలు సమర్పించాయి. మిగతా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల్లో చాలా వరకు గుర్తింపు పత్రాలను సమర్పించలేదు.కొన్ని ఈ–పాస్ వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయి డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా సంక్షేమ శాఖాధికారులు వాటిని ధ్రువీకరించలేదు.రాష్ట్రంలో 6,428 కాలేజీల్లో ఇప్పటివరకు కేవలం 6,120 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో 5,712 మాత్రమే ధ్రువీకరణ పొందాయి. ఆ కాలేజీ విద్యార్థులకే ఫీజులు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేనాటికే గుర్తింపు పత్రాలు, రెన్యువల్ వివరాలను సంక్షేమ శాఖలకు సమర్పించాలి. అలాంటి వాటికే వెబ్సైట్లో పొందుపరుస్తారు. అప్పుడు ఆయా కళాశాలల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.కానీ గుర్తింపు పత్రాల సమర్పణ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పూర్తి కావడం లేదని, పలు యూనివర్సిటీలు/ బోర్డులు వీటిని జారీ చేసేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నందున విద్యార్థుల దరఖాస్తుకు అనుమతి ఇవ్వాలని పలు కాలేజీల యాజమాన్యాలు కోరాయి.దీంతో స్పందించిన ప్రభుత్వం ఆమేరకు అవకాశం కల్పించింది. 2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 12.58లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.ఈ–పాస్ వెబ్ పోర్టల్లో ధ్రువీకరణ పొందిన కాలేజీ విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా ధ్రువీకరణ పొందని వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిని అందుకున్న కళాశాలలు స్పందించి పత్రాలు సమర్పించకుంటే ఆ కాలేజీ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తారు. మొత్తంగా అన్ని పత్రాలు సమర్పించిన కళాశాలల విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఫీజులకు 2,042 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కోసం రూ.2,042.5 కోట్లు అవసరమని సంక్షేమ శాఖలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఇందులో ఫీజు రీయింబర్స్ కోసం రూ.1,385.5 కోట్లు, ఉపకారవేతనాల కోసం రూ.657 కోట్లు అవసరమని అంచనా వేశాయి. ఈ మేరకు ప్రాథమిక ప్రతిపాద నలు రూపొందించిన అధికారులు.. ప్రభు త్వానికి నివేదించేందుకు సిద్ధ మవుతున్నారు. మరోవైపు పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేత నాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దర ఖాస్తు గడువు మంగళవారంతో ముగియ నుంది. ఇప్పటికే రెండుసార్లు గడువును పెంచిన ప్రభుత్వం.. ఇకపై పొడిగింపు ఉండబోదని ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 తర్వాత ఈపాస్ వెబ్సైట్ ద్వారా నమోదు ప్రక్రియను నిలిపేయనుంది. దరఖాస్తు చేసు కుంది 93 శాతమే... పోస్టుమెట్రిక్ విద్యార్థుల 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఈ ఏడాది జూలై రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. సెప్టెంబర్ 30తో దరఖాస్తుల స్వీకరణ ముగించాలని ప్రభుత్వం భావించింది. కానీ గడువు నాటికి 40 శాతం దరఖాస్తులు కూడా రాకపోవడంతో గడువు తేదీని అక్టోబర్ 31 వరకు పొడిగించినప్పటికీ.. దరఖాస్తులు 55 శాతం దాటలేదు. దీంతో చివరి అవకాశంగా డిసెంబర్ 31 వరకు గడువును పొడిగించారు. ఈక్రమంలో సోమవారం నాటికి 12,06,518 దరఖాస్తులు వచ్చాయి. అదే గత వార్షిక సంవత్సరంలో 12,86,898 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 93 శాతం దరఖాస్తులు రాగా... మంగళవారం రాత్రి వరకు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మరో అవకాశం ఇవ్వండి.. ఆర్టీసీ సమ్మె, రెవెన్యూ ఉద్యోగుల పెన్డౌన్లతో చాలాచోట్ల విద్యార్థులు సకాలంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేకపోయారు. దీంతో కొందరు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు. చివరి అవకాశంగా పక్షం రోజులు గడువును పెంచాలి. దీనిపై ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులకు సోమవారం వినతిపత్రం ఇచ్చాం. ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. –గౌర సతీశ్, ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం కన్వీనర్ గడువు పొడిగించలేం.. ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు, స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించాం. ఇకపై పొడిగించే అవకాశం లేదు. వెబ్సైట్ సాంకేతిక కారణాలతో దరఖాస్తు చేసుకోకుంటే (సంబంధిత ఆధారాలు సమర్పిస్తే) తప్ప అవ కాశమివ్వలేం. దరఖాస్తు గడువును పొడిగిస్తూ పోవడంతో బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ -
ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు, కాలేజీల రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును రాష్ట్రప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది. ప్రస్తుతం విద్యార్థులు, కాలేజీల రిజిస్ట్రేషన్లు ఇంకా కొనసాగుతున్నందున చివరి అవకాశం ఇచ్చేందుకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్ పీటర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.