Postponed indefinitely
-
జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జాతీయ క్రీడలు ఈసారి నిరవధికంగా వాయిదా వేశారు. క్రీడలకు ఆతిథ్యమివ్వాల్సిన గోవాలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జాతీయ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బకు జాతీయ క్రీడల నిర్వాహక కమిటీ ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని గోవా క్రీడల మంత్రి మనోహర్ అగోంకర్ ఐఓఏకు తెలిపారు. సెప్టెంబర్ చివర్లో జరిగే కమిటీ సమావేశంలో క్రీడల షెడ్యూల్‌ను నిర్ణయిస్తామన్నారు. నిజానికి 2018 నవంబర్లోనే జరగాల్సిన ఈ క్రీడలు గోవా ప్రభుత్వ అలసత్వం కారణంగా ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది గేమ్స్ నిర్వహించేందుకు గోవా సిద్ధమైనప్పటికీ కరోనాతో మరోసారి ఆటంకం ఏర్పడింది. చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జాతీయ క్రీడలు జరిగాయి. -
ఇప్పుడే ఏమీ చెప్పలేం
న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేయడంతో లీగ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. అయితే తాజా పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం. ప్రపంచమంతా లాక్డౌన్ అయిన ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపాదన గురించి ఆలోచించలేమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఐపీఎల్‌కు ఆతిథ్యమివ్వాలనే తమ ఆకాంక్షను గురువారం బయటపెట్టాడు. కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న తమ దేశంలో లీగ్ నిర్వహిస్తే లంక బోర్డుకు ఆర్థికంగా దన్నుగా ఉంటుందన్నారు. అయితే శ్రీలంక బోర్డు నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని దీనిపై ఇప్పుడు చర్చ అనవసరమని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ ‘భారత్‌కు శ్రీలంక మిత్ర దేశం. వారి ప్రతిపాదనలో అర్థముంది. కానీ మే నెలలో ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ విరమణ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులన్నీ తారుమారవుతాయి. భారత్ అధికారికంగా లీగ్ నిర్వహించలేమని పేర్కొంటే మరిన్ని విదేశీ బోర్డులు ఆతిథ్యం కోసం ముందుకొస్తాయి’ అని పేర్కొన్నారు. -
తెర పడినట్లేనా!
ప్రపంచంలో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై నిర్ణయం ప్రకటించే విషయంలో సాగతీత వైఖరిని అవలంబించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు వాస్తవంలోకి వచ్చింది. దేశంలో లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ‘వేసవి వినోదానికి’ చెల్లుచీటీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన బోర్డు... ఈ ఏడాది ముగిసేలోగా టోర్నీని నిర్వహించే విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. రాబోయే రోజుల్లో అంతా చక్కబడినా కూడా... బిజీ షెడ్యూల్లో లీగ్‌కు చోటు కల్పించడం కష్టంగా మారుతుండటమే కారణం. ముంబై: కోవిడ్–19 నేపథ్యంలో ఒలింపిక్స్ నుంచి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వరకు ఎన్నో ప్రతిష్టాత్మక ఈవెంట్స్ రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగాయి. కానీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్ విషయంలో చాలా వరకు ఆశతోనే ఉంది. షెడ్యూల్ ప్రకారం టోర్నీ మార్చి 29 నుంచి జరగాల్సి ఉంది. అయితే లాక్డౌన్ ప్రకటించకముందే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోవడంతో ఏప్రిల్ 15 తర్వాత అంతా కుదురుకోవచ్చని, ఆ తర్వాత లీగ్ నిర్వహించుకోవచ్చని ఆశించింది. అయితే ఆపై దేశం మొత్తం స్తంభించిపోయింది. టోర్నీని నెల రోజులకు కుదించి జూన్ మొదటి వారంలో ఫైనల్ జరిగేలా చూడవచ్చని కూడా కొందరు పెద్దలు వ్యాఖ్యానించారు. ఒకదశలో ప్రేక్షకులు లేకుండా ఒకటి, రెండు నగరాలకే పరిమితం చేసి టీవీ రేటింగ్స్ కోసమైనా ఆడించవచ్చని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇప్పుడు కథంతా మారిపోయింది. మే 3 వరకు లాక్డౌన్ పొడిగించగా... ఆ తర్వాత వెంటనే ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత స్థితిలో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించాల్సి వచ్చింది. బుధవారం ఉదయం అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలకు ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంగ్ అమీన్ సమాచారం అందించారు. ఇతర బోర్డులు అంగీకరిస్తాయా? ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌ను సరైన సన్నాహకంగా చాలామంది భావించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇక ఈ సంవత్సరం లీగ్ నిర్వహించడం చాలా కష్టంగానే అనిపిస్తోంది. ఐపీఎల్ వాయిదా గురించి వెల్లడిస్తూ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘పరిస్థితి మెరుగైతే సెప్టెంబర్–అక్టోబర్ మధ్య లీగ్ నిర్వహించేందుకు ఆలోచిస్తున్నాం’ అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్య కూడా కాస్త అతిశయంగానే కనిపిస్తోంది. నిజానికి బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకే లీగ్ జరుగుతుందన్న ఆశ లేదు. ప్రపంచ క్రికెట్‌కు సంబంధించి అన్ని జట్ల భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) ఎప్పుడో ఖరారైపోయింది కాబట్టి వాటిని మార్చడం కష్టమంటూ అతను ఇటీవల చేసిన వ్యాఖ్యనే వాస్తవానికి దగ్గరగా ఉంది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు శ్రీలంక, జింబాబ్వేలతో సిరీస్‌లు, ఆసియా కప్‌లతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి రెండింటిని ఎలాగోలా సర్దుబాటు చేయగలిగినా... ఆసియా కప్ విషయంలో వెనక్కి తగ్గమని ఆతిథ్య పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆసియాలోని చిన్న జట్లకు పంచాల్సి ఉంటుంది కాబట్టి అంతా బాగుంటే షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌లోనే టోర్నీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇక టెస్టు క్రికెట్‌కు అమిత ప్రాధాన్యతనిచ్చే ఇంగ్లండ్ బోర్డు కూడా ఇప్పటికే భారత్‌కు సిరీస్‌కు సంబంధించి వాణిజ్యపరమైన ఒప్పందాలు పూర్తి చేసుకొని ఉంటుంది కాబట్టి అదీ అంగీకరించకపోవచ్చు. లీగ్ కోసం ప్రపంచకప్‌ను వాయిదా వేయించడం భారత్ చేతుల్లో లేని పని. కాబట్టి ఎలా చూసినా ఐపీఎల్ కథ ఈ ఏడాదికి ముగిసినట్లే అనిపిస్తోంది. బుధవారం ఒక బోర్డు ఉన్నతాధికారి చెప్పినదాని ప్రకారం... ఇప్పుడు లీగ్ గురించి అసలు మాట్లాడటమే అనవసరం. ప్రపంచంలో పరిస్థితి అంతా మెరుగుపడ్డాకే అసలు ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. ‘స్టార్’ ఏం చేస్తుందో... ఒకవేళ ఐపీఎల్ జరగకపోతే ఆటగాళ్లతో సహా అనేక మంది నష్టపోతారు. వేలంలో రూ. 15 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయిన ప్యాట్ కమిన్స్ వేదన చెప్పలేనిది. లీగ్ నిబంధనల ప్రకారం టోర్నమెంట్ ప్రారంభమయితే తప్ప ఆటగాళ్లకు ఫ్రాంచైజీ డబ్బులు చెల్లించదు. మూడు వాయిదాల్లో వారు సొమ్ము చెల్లిస్తారు. కాబట్టి టోర్నీ జరగకపోతే ఒక్క రూపాయి కూడా దక్కదు. ఇక సత్తా చాటాలనుకున్న కుర్రాళ్ల సంగతి సరేసరి. ఫ్రాంచైజీలకు కూడా నష్టం తప్పదు. 2017లో స్టార్ స్పోర్ట్స్ భారీ మొత్తానికి ప్రసార హక్కులు కొనుగోలు చేసిన తర్వాత బోర్డు ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం రూ.150 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పుడు ఆ డబ్బులు రానట్లే. అయితే ఓవరాల్‌గా లీగ్ ద్వారా రూ. 3,800 కోట్ల నష్టం జరుగుతుందని భావిస్తుండగా ఇందులో సింహభాగం ‘స్టార్’దే. బోర్డుతో ఒప్పందంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో బయటకు తెలీదు కానీ లీగ్ అసలు జరగకపోతే ముందే అంగీకరించిన ఒప్పందం ప్రకారం ‘స్టార్’ ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకపోవచ్చు. నాకు తెలిసి ప్రతీ క్రికెట్ బోర్డు దృష్టిలో ఐపీఎల్ ఒక పెద్ద టోర్నమెంట్. దీనిని అందరూ గుర్తించారు. సరిగ్గా ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి టోర్నీ ఉంటే మంచి ఊపు వస్తుంది. అయితే అంతా బాగుండి, ఎవరూ ప్రమాదంలో పడే అవకాశం లేదనుకుంటే లీగ్‌ను నిర్వహించుకోవచ్చు. –వీవీఎస్ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్ -
ఫలప్రదంగా జరిగాయ్!!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసి, నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 18వ తేదీ నుంచి మొదలయిన ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతోపాటు కీలకమైన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండటంతో వాటిని రికార్డుల నుంచి తొలగించటం గమనార్హం. అయితే, ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ప్రవేశపెట్టలేకపోయింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలు ఫలవంతంగా సాగడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసం.. కీలక బిల్లులు గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి ‘సంతృప్తికరం, ఫలప్రదం’గా జరిగాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే కీలక బిల్లులతోపాటు అవినీతి నిరోధక, క్రిమినల్ లా, ఆర్థిక ఎగవేతదారుల బిల్లు, బాలలకు ఉచిత, నిర్బంధ హక్కు బిల్లు, మనుషుల రవాణా వ్యతిరేక బిల్లు వంటివి 21 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 4,140 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఇందులో 75 ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు. వివిధ అంశాలపై సభ్యుల నిరసనల కారణంగా 27 గంటల సభాకాలం వృథా అయింది. ‘ట్రిపుల్ తలాక్’ను చర్చించని రాజ్యసభ రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభ సజావుగా సాగలేదు. త్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేయాలని, పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో చర్చకు తీసుకోవట్లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. త్వరలో దీనిపై ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది. అత్యంత ఫలప్రదం జూలై 18వ తేదీ నుంచి మొదలైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఈ సెషన్లో భాగంగా 24 రోజుల్లో 17 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా ప్రకారం లోక్‌సభ 118 శాతం, రాజ్యసభ 74 శాతం సమర్ధంగా నడిచింది. లోక్‌సభ 21 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి. 21 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు మొదటిసారిగా కల్పించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన ఈ సమావేశాలను సామాజిక న్యాయ ఉత్సవంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ అభివర్ణించారు. ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగటం 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. 16వ లోక్‌సభలో ఇదే రికార్డు. మొత్తం బిల్లుల్లో 26శాతం మాత్రమే పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు ప్రభుత్వం పంపగా ఇది 15వ లోక్‌సభలో 71శాతం, 14వ లోక్‌సభలో 60శాతం వరకు ఉంది. మొత్తం 999 ప్రైవేట్ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం కూడా 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమం. రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్‌పై ప్రధాని మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా భావిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం అధికార పార్టీని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లయింది. ప్రధాని మాటలను, అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలతో రికార్డుల నుంచి తీసివేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారని రాజ్యసభ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధిగా ప్రతిపక్షం బలపరిచిన హరిప్రసాద్‌పై ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ గెలుపు సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ పేరులోని ‘బి.కె.’ కలిసి వచ్చేలా అమర్యాదకరమైన 3 హిందీ పదాలను వాడారు. దీంతో ఆ వ్యాఖ్యలను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. -
తుడిచిపెట్టుకుపోయిన మలిదశ
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలి దశ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. సమావేశాల చివరి రోజూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. మొదటి రోజు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకింగ్ కుంభకోణాలు, కావేరీ బోర్డు ఏర్పాటు, తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపు తదితర అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాయి. రెండో దశలో ఉభయ సభలు 22 సార్లు సమావేశం కాగా ఒక్కరోజు కూడా కార్యకలాపాలు సాగలేదు. బడ్జెట్ సమావేశాల రెండు దశల్లోను లోక్‌సభ 29 సార్లు, రాజ్యసభ 30 సార్లు సమావేశం కాగా.. ఉభయ సభల్లోను కలిపి 250 గంటల పనిదినాలు వృథా అయ్యాయి. సభలో కొన్ని పార్టీల ఆందోళనల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని కూడా లోక్‌సభ చర్చకు చేపట్టలేదు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు సాగాయి. లోక్‌సభలో 127 గంటలు వృథా లోక్‌సభ నిరవధిక వాయిదాకు ముందు స్పీకర్ మహాజన్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్ సమావేశాల రెండు విడతల్లోను సభ 29 సార్లు సమావేశమైంది. మొత్తం 34 గంటల 5 నిమిషాలు పనిచేయగా.. అంతరాయాలు, వాయిదాల వల్ల మొత్తం 127 గంటల 45 నిమిషాలు వృథా అయ్యాయి. మొత్తం 580 ప్రశ్నల్ని సభ్యులు లోక్‌సభ ముందుంచగా.. కేవలం 17 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానమిచ్చారు’ అని చెప్పారు. గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు 2017లు లోక్‌సభ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ‘ఈ రోజు చివరిరోజు.. సభ సజావుగా సాగేందుకు మీరు సిద్ధంగా లేకపోతే నిరవధికంగా వాయిదా వేస్తా. చర్చ జరిగేందుకు దయచేసి సహకరించండి’ అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో 121 గంటల వృథా రాజ్యసభలోను అదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను చైర్మన్ వెంకయ్య నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 30 సార్లు సమావేశం కాగా 44 గంటలపాటు సభా కార్యకలాపాలు కొనసాగాయని, 121 గంటల సమయం వృథా అయ్యిందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ.. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర మంత్రులు ఆందోళన నిర్వహించారు. -
రాజ్యసభ ప్రొరోగ్
ఎగువ సభను అర్ధంతరంగా ముగించిన ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీకి మార్గం సుగమం న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్‌ను.. పునఃజారీ చేయటం కోసం రాజ్యసభ బడ్జెట్ సమావేశాల కాలాన్ని తగ్గించి.. శనివార ం నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేశారు. రాజ్యసభ 234వ సమావేశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరవిధికంగా వాయిదా వేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ బడ్జెట్ సమావేశాలకు ఈ నెల 20వ తేదీ నుంచి సెలవులు ఉండగా.. వచ్చే నెల 20వ తేదీన తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ సమావేశాలు మే 8వ తేదీ వరకూ కొనసాగాల్సి ఉంది. అయితే.. తాజాగా రాజ్యసభను ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటంతో ఈ సమావేశాలు ముగిసినట్లయింది. భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్ 5వ తేదీతో ముగియనుంది. దీనిస్థానంలో చట్టం తెచ్చేందుకు.. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన భూసేకరణ బిల్లును బడ్జెట్ భేటీల ఆరంభంలోనే లోక్‌సభలో ఆమోదించారు. ఆ బిల్లు రాజ్యసభలో ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోయింది. ఎగువసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటం దీనికి కారణం. ఆర్డినెన్స్ గడువు ముగిసే లోగా దాని స్థానంలో చట్టం తీసుకురానట్లయితే.. అది చెల్లుబాటు కాదు. గడువు ముగిసే లోగా మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ జారీ చేయాలంటే.. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభ అయినా నిరవధికంగా వాయిదాపడి ఉండాలి.