postpones
-
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. -
ఏపీలో సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు
-
ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు...
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది. సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చదవండి: ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే మా సంకల్పం: సీఎం జగన్ థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. -
బ్రెగ్జిట్ ఓటింగ్ వాయిదా
లండన్: బ్రెగ్జిట్‌పై పార్లమెంట్లో మంగళవా రం చేపట్టే ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెలిపారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశా లపై ఎంపీల్లో విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పార్లమెం ట్లో ప్రకటించారు. బ్రెగ్జిట్ తర్వాత కూడా ఈయూ కస్టమ్స్ యూనియన్లోనే బ్రిటన్ కొనసాగనుండడంపై ఎంపీల్లో ఆందోళన వ్యక్త మవుతోందని ఆమె తెలిపారు. ఈ పరిస్థి తుల్లో ఒప్పందంపై ఓటింగ్ పెడితే భారీ తేడాతో ఓడిపోయే ప్రమాదముందని మే అంగీకరిం చారు. సభ్యుల అభ్యంతరాలపై వచ్చే వారం జరగనున్న ఈయూ నేతల భేటీలో చర్చించి, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా హామీ పొందేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
స్వేచ్చా హననం
-
ఫ్లిప్ కార్ట్ పై దుమారం
అహ్మదాబాద్: ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందించని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై ఇండియన్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు ఆందోళనకు దిగారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకుని నియామక తేదీని వాయిదా వేస్తూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌పై గుజరాత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిసెంబరులో విధుల్లో చేరాల్సిన తేదీని జూన్‌కు వాయిదా వేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ బిన్నీ బన్సల్‌కు మెయిల్ప్ పంపించారు. వెంటనే తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాల పట్ల హామీ ఇవ్వాలని కోరుతూ చీఫ్ పీపుల్ ఆఫీసర్ నితిన్ సేథ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సచిన్ బన్సల్ తదితరులకు కూడా ఐఐఎం ఈమెయిల్ పంపించారు. దీంతోపాటుగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన రూ.1.5లక్షల నష్టపరిహారం కూడా ఆమోదయోగ్యంకాదని తెలిపారు. జూన్ నెల నుంచి మొదలు, ఒకేసారి కాకపోయినా, జోయినింగ్ బోనస్ గా కానీ, బకాయిల రూపంలోగానీ నెలవారీ పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు ఎంపికయ్యామనే కారణంతో ఇతర కంపెనీల మంచి ఉద్యోగ అవకాశాలను చాలా వదులుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఐఐఎం అహ్మదాబాద్ ప్లేస్మెంట్ కమిటీ చైర్పర్సన్ ఆశా కౌల్ మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరిలో 18 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని జూన్ లో ఉద్యోగాలిస్తామన్నారని తెలిపారు. ఉద్యోగ నియామక తేదీ మార్పు వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొందరికి లోన్లు చెల్లించాల్సిన అవసరాలు ఉన్నాయంన్నారు. సంస్థ కార్పొరేట్ విస్తరణలో భాగంగా నియామకాలు ఆలస్యమవుతాయని చెప్పందన్నారు. ఇదే సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సి ఉందని తెలిపారు. మరోవైపు తమ వ్యాపారాలు పునర్నిర్మాణం చేసుకునే పని లోఉన్నాం కాబట్టి కానీ సమయం పడుతుంది దని సంస్థ తెలిపినట్టు సమాచారం. -
అగ్రిగోల్డ్ కేసు మధ్యాహ్నానికి వాయిదా
హైదరాబాద్: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఉదయం హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణకు వచ్చింది. ఆస్తుల వేలానికి సంబంధించి MSTCతో పాటు మరో మూడు కంపెనీలపై అధ్యయనం చేస్తామని కమిటీ సభ్యులు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. -
రచ్చబండ పై సీఎం వెనకడుగు