ఫ్లిప్ కార్ట్ పై దుమారం | IIM-A Graduates Furious as Flipkart Postpones Their Joining Dates | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ పై దుమారం

Published Wed, May 25 2016 4:05 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్ కార్ట్ పై  దుమారం - Sakshi

ఫ్లిప్ కార్ట్ పై దుమారం

అహ్మదాబాద్: ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందించని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ పై ఇండియన్  మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు  ఆందోళనకు దిగారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఎంపిక చేసుకుని నియామక తేదీని వాయిదా వేస్తూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌పై గుజరాత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిసెంబరులో విధుల్లో చేరాల్సిన తేదీని జూన్‌కు వాయిదా వేశారని  మండిపడ్డారు.  ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ బిన్నీ బన్సల్‌కు మెయిల్ప్ పంపించారు. వెంటనే తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.

తమ ఉద్యోగాల పట్ల హామీ ఇవ్వాలని కోరుతూ  చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ నితిన్‌ సేథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సచిన్‌ బన్సల్‌ తదితరులకు కూడా ఐఐఎం ఈమెయిల్‌ పంపించారు. దీంతోపాటుగా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేసిన రూ.1.5లక్షల నష్టపరిహారం కూడా ఆమోదయోగ్యంకాదని తెలిపారు. జూన్ నెల నుంచి  మొదలు,  ఒకేసారి కాకపోయినా, జోయినింగ్ బోనస్ గా కానీ, బకాయిల రూపంలోగానీ   నెలవారీ పరిహారంగా  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు ఎంపికయ్యామనే కారణంతో ఇతర  కంపెనీల మంచి ఉద్యోగ  అవకాశాలను  చాలా వదులుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
దీనిపై ఐఐఎం అహ్మదాబాద్ ప్లేస్మెంట్ కమిటీ చైర్పర్సన్ ఆశా కౌల్   మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్‌ ఫిబ్రవరిలో 18 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని జూన్  లో ఉద్యోగాలిస్తామన్నారని తెలిపారు.  ఉద్యోగ నియామక తేదీ మార్పు వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొందరికి లోన్లు చెల్లించాల్సిన అవసరాలు ఉన్నాయంన్నారు. సంస్థ కార్పొరేట్ విస్తరణలో భాగంగా   నియామకాలు ఆలస్యమవుతాయని చెప్పందన్నారు.  ఇదే  సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సి ఉందని తెలిపారు. మరోవైపు తమ వ్యాపారాలు పునర్నిర్మాణం చేసుకునే పని లోఉన్నాం  కాబట్టి కానీ సమయం పడుతుంది దని సంస్థ తెలిపినట్టు సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement