వినియోగదారులతో చెలగాటం
మాడభూషి శ్రీధర్
వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం డిస్కం వారి బాధ్యత. 49 శాతం ప్రభుత్వ వాటాలున్నప్పటికీ తమది ప్రభుత్వ సంస్థ కాదని డిస్కం వాదించడం, సహ చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తమకు లేదనడం బాధ్యతారాహిత్యం.
పక్కవాడి ఆస్తి కాజేయడా నికి ఎన్నెన్నో కుట్రలు చేయ డం మానవుడి నైజంగా మారి పోయింది. తన పేరును, తన అడ్రసును వాడుకుని వేరే వ్యక్తి ఎవరో ఒక కరెంట్ కనెక్షన్ తీసుకున్నాడనీ, అతను చెప్పిన విషయాల్లో నిజానిజాలు తెలు సుకోకుండా కనెక్షన్ ఇచ్చారని, అందుకు బాధ్యులైన అధికారుల మీద ఏ చర్యలు తీసు కున్నారని రాంబాబు సమాచార హక్కు కింద అడిగాడు. కరెంట్ కార్డు ఆధారంగా ఆ వ్యక్తి తన ఆస్తిలోనే భాగం కోరుతున్నాడని రాంబాబు రెండో అప్పీలులో సమాచార కమిషనర్‌కు నివేదించాడు. కనుక ఆ దరఖాస్తు పెట్టిం దెవరు, అతను ఇచ్చిన ఆధార పత్రాల కాపీలు ఇవ్వా లని కోరారు. ఢిల్లీ విద్యుచ్ఛక్తి మండలి ద్వారా బీఎస్ ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ అనే డిస్కం కంపెనీ ఈ సమాచారం ఇవ్వవలసి ఉంది.
డిస్కం కంపెనీ ఈ సమాచారం నిరాకరించింది. తాను పబ్లిక్ అథారిటీని కాదని వాదించింది. ప్రభుత్వం 49 శాతం వాటా ఇస్తున్నా, డిస్కంలు సమాచార హక్కు చట్టం కిందకు రాబోమని వాదించడం నిజానికి ప్రజావ్య తిరేక చర్య. కానీ ప్రభుత్వం ఇందుకు ఏ పరిష్కారాన్నీ సూచించడం లేదు. డిస్కంలు సమాచారం నిరాకరించి, సమాచార కమిషనర్లు సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తే దానిైపైన హైకోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. కొన్నేళ్లదాకా హైకోర్టులో కేసులు విచారణకు రావు. అం దాకా జనాన్ని వేధించుకు తినే డిస్కంలు సమాచారం ఇవ్వకుండా వేధించుకు తినే కార్యక్రమాలను కొనసాగిం చడం శోచనీయం.
బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ డిస్కం తన వెబ్సైట్లో వినియోగదారుల సేవే తమ లక్ష్యమని అం దులో పేర్కొన్నారు. నిజానికి డిస్కం వారు విని యోగ దారులను ఏ విధంగా వేధిస్తారో తెలియాలంటే హైకోర్టులో వీరిపైన ప్రొఫెసర్ రాంప్రకాశ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ చదవాల్సిందే. ఈయన గారికి డిస్కం 55,191 రూపాయల భారీ బిల్లు జారీ చేసింది. ఆయన తన ఇంటిని దుర్వినియోగం చేశాడని, కనుక బిల్లు భారీగా వచ్చిందని వాదించింది. తాను దుర్విని యోగం చేయలేదని, ప్రొఫెసర్‌గారు ఎంత వివరించినా డిస్కం వారు వినలేదు. అతని వాదన వినకుండానే భారీ జరిమానా విధించారు. రాంప్రకాశ్ ఇంటిని ఆడవారికి పేయింగ్ గెస్ట్ వసతి గృహంగా వాడుతున్నారని నిరా ధారమైన ఆరోపణ చేశారని రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. 2013లో హైకోర్టు ఈ డిమాండ్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. ఈ కంపెనీ వాగ్దానం చేసిన సిటి జన్ చార్టర్‌ను భంగం చేసింది. వినియోగదారుల హక్కు లను భంగపరచింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కోడ్ పెర్ ఫార్మెన్స్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2007కు కూడా భంగ కరమే. నిజానికి సమాచార హక్కు అభ్యర్థన చేసిన రాం బాబుకు విద్యుచ్ఛక్తి వినియోగదారుడిగా తన ఆస్తి పేరు మీద మరొకరికి ఏ విధంగా కనెక్షన్ ఇచ్చారో వినియోగ దారుల రక్షణ చట్టం కింద తెలుసుకునే హక్కు ఉంది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 2(ఎఫ్) కింద సమా చారం అన్న నిర్వచనంలో, అమలులో ఉన్న ఏ చట్టం కిందనైనా సమాచార హక్కు నిర్దేశితమై ఉంటే ఆ హక్కును అమలు చేసే అధికారం ఈ చట్టం ఇస్తుంది. ప్రైవేట్ సంస్థ అధీనంలో ఉన్న సమా చారాన్నయినా సరే ప్రభుత్వ అధికారి ద్వారా కోరే అధి కారాన్ని పౌరుడికి ఈ సెక్షన్ ఇస్తుంది.
చాలా ఆర్టీఐ దరఖాస్తులలో పౌరులు తమ సమ స్యలను విన్నవిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఈ చట్టంలో అవకాశం లేదు. కాని సమస్యలను నివేదించే వినతిపత్రాన్ని సమర్పించిన తరవాత లేదా ఫిర్యాదు చేసిన తరవాత ఏ చర్య తీసుకున్నారో అడగడానికి ఆర్టీఐని వినియోగిస్తే దాన్ని దుర్వినియోగం అనడానికి వీల్లేదు. ఫిర్యాదుల విచారణ పరిష్కారానికి సరైన వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు ఆర్టీఐ కింద ఫిర్యాదుపై చర్య ఏమిటి అని అడిగితే చెప్పవలసిందే.
49 శాతం ప్రభుత్వ వాటాలున్నప్పటికీ తమది ప్రభుత్వ సంస్థ కాదని డిస్కం వాదించడం, సమాచార హక్కు చట్టం కింద బాధ్యత తమకు లేదని చెప్పడం తీవ్రమైన బాధ్యతారాహిత్యం. అటువంటి సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండడం కోసం, ప్రభుత్వం నుంచి 49 శాతం నిధులు తీసుకోవడాన్ని ప్రభుత్వ ప్రత్యక్ష ఆర్థిక సాయంగా పరిగణించి సెక్షన్ 2(హెచ్) కింద పబ్లిక్ అథారిటీగా ప్రకటించినది సమాచార కమి షనర్. కాని ఈ తీర్పు మీద ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. సెక్షన్ 2(ఎఫ్) సమాచారం నిర్వచనం కింద వినియోగ దారుల సమాచార హక్కును గౌరవించి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. నిజానికి డిస్కం వారు రాంబాబు సమస్య పరిష్కరించి ఉంటే సమాచారం అడిగి ఉండేవారే కాదు. ఫిర్యాదు పరిష్కరించడం డిస్కం వారి బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించడం వారికి చేతకాదు. కనీసం ఆర్టీఐ కింద సమాచారం అడిగితే ఇవ్వనే ఇవ్వమని వాదిస్తారు. స్టే ఉత్తర్వుల సాకు జూపి తమ అధికారాలను డిస్కం వారు దుర్వినియోగం చేస్తు న్నారని కేంద్ర సమాచార కమిషనర్ ప్రకటించడం జరి గింది. వినియోగదారుడి ఫిర్యాదుకు సంబంధించిన ఫైలుతో సహా హాజరు కావాలని, రాంబాబు హక్కులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com