Power employees strike
-
క్రమబద్ధీకరణ కోసం పోరుబాట
ఏలూరు (టూటౌన్): విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇప్పటికే దశలవారీగా పలు రూపాల్లో తమ ఆందోళనను వ్యక్తం చేసిన వీరు ఈనెల 21న విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా అంతటా వెలుగులు నింపడంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మి కుల జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హా మీలను అమలు చేయకపోవటంతో కొంతకాలంగా వీరు ఉద్యమ బాటలో నడుస్తున్నారు. జిల్లాలో 223 సబ్స్టేషన్లు, జిల్లా ఎస్ఈ కార్యాలయం, ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం, సెక్షన్ ఆఫీస్‌లు, రీడర్స్‌గా డివిజన్, సబ్‌డివిజన్ పరి ధిలో 1,800 మందికి పైగా పనిచేస్తున్నారు. షిఫ్ట్ ఆపరేటర్లు , కంప్యూటర్ ఆపరేటర్లు, పీక్‌లోడ్, వాచ్ అండ్ వార్డ్లు సహా పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరంతా 15 నుంచి 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనంతో నెట్టుకొస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామన్న హామీ అమలు అవ్వాలని వందలాది కుటుం బాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రస్థాయి సమస్యలతో పాటు స్థానికంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. ప్రస్తుతం వీరికి ప్రభుత్వం మధ్యవర్తి అయిన కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లిస్తుంది. అరకొర వేతనాల్లో సైతం కాంట్రాక్టర్ కమీషన్ తీసుకుంటున్నారు. పైగా వేధింపులు కూడా ఉంటున్నాయి. ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని వీరు కోరుతున్నారు. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు గట్టిగా కోరుతున్నారు. విద్యుత్ మీటర్ రీడర్లకు పీస్ రేటును రద్దు చేసి, ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తమ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రమాదాలతో సహవాసం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు నిత్యం ప్రమాదాల సహవాసం తప్పటం లేదు. గతంలో ఆకివీడు మండలంలో గాయపడిన కార్మికుడు భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లింగపాలెం మండలం ఆసన్నగూడెం సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ శ్రీను తీవ్రగాయాలతో జంగారెడ్డిగూడెంలో చికిత్స పొందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్, ప్రభుత్వం వీరిని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. నాలుగేళ్ల తర్వాత స్వల్ప పెంపుదల గత ఆగస్టులో కాంట్రాక్టు కార్మికుల జీతాలు స్వల్పంగా పెంచారు. అదీ 2014లో పెంచాల్సిన జీతాలను 2018లో స్వల్పంగా పెంచడంపై కా ర్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని కార్మికులు ఎద్దేవా చేస్తున్నారు. విద్యుత్ సంస్థను లాభాలబాటలో నడిపిస్తూ, పలు అ వార్డులు రావటానికి కారణం అయిన కార్మికులను విస్మరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దళారులు దోచుకోకుండా తమను సంస్థలో విలీనం ఎం దుకు చేయకూడదూ అంటూ నిలదీస్తున్నారు. తె లంగాణలో రెండేళ్ల క్రిందటే విద్యుత్ సంస్థలో విలీనం చేసుకున్నారని చెబుతున్నారు. కార్మికులను విలీనం చేసుకున్నా న్యాయపరమైన ఇబ్బందులు రావని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని కార్మికులు గుర్తుచేస్తున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్!
విద్యుత్ జేఏసీ నోటీసు అందజేత.. 3న ‘చలో విద్యుత్ సౌధ’ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కోలకు నోటీసు ఇచ్చింది. 2014 పీఆర్సీని వెంటనే వర్తింపజేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ ఏ.సుధాకర్‌రావు సారధ్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు గురువారం సాయంత్రం టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావును కలిసి సమ్మె నోటీసు అందించారు. సమ్మెలో భాగంగా డిసెంబరు 3 న ‘చలో విద్యుత్ సౌధ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, అదేరోజున భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు. -
క‘న్నీటి’కష్టాలకు చెక్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యుత్ సరఫరాలో తరుచూ ఏర్పడుతున్న అంతరాయంతో మంచినీటి పథకాల పంపింగ్ జరగడం లేదు. దీంతో విజయన గరం పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ప్రభుత్వాలొచ్చినా, ఎంతమంది అధికారులొచ్చినా ఈ సమస్య పునరావృతమవుతూనే ఉంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడా సమస్యకు ప్రస్తుత మున్సిపల్ అధికారులు పరిష్కారం కనుగొ న్నారు. మంచినీటి పథకాలు ఉన్న చోట జనరేటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో నీటి కష్టాలకు ఫుల్స్టాప్ పడే అవకాశం ఉంది. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా పట్టణ ప్రాంతాల్లో నీటి పథకాలు పెరగడం లేదు. ఉన్న కొద్దిపాటి పథకాలతో కాలం వెళ్లదీస్తుండడంతో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీనికితోడు విద్యుత్ అంతరాయం మరింత పట్టిపీడిస్తోంది. విద్యుత్ కోతల కారణంగా మంచినీటి పథకాల పంపింగ్ జరగకపోవ డంతో కనీస స్థాయిలో తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారు. ఒక్క విజయనగరం పట్టణాన్నే తీసుకుంటే ఇక్కడున్న దాదాపు 3లక్షల మేర జనాభాకు 17మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం కాగా, ప్రస్తుతం 12 మిలియన్ లీటర్ల నీరును సరఫరా చేసే పథకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో రెండు రోజుల కొకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ పథకాలు కూడా పనిచేయకపోతే అంతే సంగతులు. విజయనగరం పట్టణానికి తాగునీరందించే పథకాలు ముషిడిపల్లి, నెల్లిమర్ల, రామతీర్థంలో ఉన్నాయి. విద్యుత్ కోతలతో ఆయా పథకాల పంపింగ్ సరిగ్గా జరగడం లేదు. ఫలితంగా నీటిని సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కొక్కసారి రెండు మూడు రోజులైనా సరఫరా చేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ సోమన్నారాయణ జీవీఎంసీలో పని చేసిన అనుభవంతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. విద్యుత్ కోతలను అధిగమించాలంటే జనరేటర్ల ఏర్పాటు ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గమని గుర్తించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద జనరేటర్లు మంజూరు చేయాలని, లేకపోతే పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయలేమన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు విజయనగరం మున్సిపాల్టీలోని మంచినీటి పథకాలకు జనరేటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్కొక్కటి రూ.15 లక్షలు విలువైన నాలుగు జనరేటర్లను మంజూరు చేశారు. నెల్లిమర్లలోని మాస్టర్ పంపు హౌస్‌కు ఒకటి, నెల్లిమర్ల వాటర్ వర్క్స్ ఒకటి, రామతీర్థం మంచినీటి పథకానికి ఒకటి, ముషిడిపల్లి మంచినీటి పథకానికి ఒకటి చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో ఇవి రానున్నాయి. అవి మున్సిపాల్టీకొచ్చినట్టయితే విద్యుత్ కోతలతో సంబంధం లేకుండా పంపింగ్ చేసి పట్టణ ప్రజలకు తాగునీరందించేందుకు అవకాశం ఉంటుంది. ఇదే తరహాలో మిగతా మున్సిపాల్టీల్లోనూ, మేజర్ పంచాయతీల్లోనూ జనరేటర్లను ఏర్పాటు చేయగలిగితే తాగునీటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. -
చిరుబతుకుల్లో
భారీ వర్షాలు, ఈదురు గాలులు ఒకవైపు... విద్యుత్ ఉద్యోగుల సమ్మె మరోవైపు దీంతో జిల్లా ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్నచిన్న వ్యాపారాలు నిలిచిపోయాయి. రక్షిత పథకాలు పడకేశాయి. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కొవ్వొత్తుల వెలుగుల్లో అవస్థలు పడ్డారు. ఆస్పత్రుల్లో రోగుల పాట్లు వర్ణనాతీతం. దీంతో చిరుబతుకుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా ప్రజలకు విద్యుత్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు వెళ్లడంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఇళ్లల్లో ఫ్యాన్లు, లైట్లు వెలగక, తాగునీరు సరఫరా కాక ఇక్కట్లు పడ్డారు. పంచాయతీ, మున్సిపల్ పరంగా తాగునీటి సరఫరా లేకపోవడంతో సొంత వనరులపైనే తాగునీటికి ఆధారపడాల్సి వచ్చింది. ఓ పక్క వర్షం కురుస్తుండడంతో వాతావరణ పరిస్థితి తెలుసుకోవాలన్న ప్రజలకు ప్రచార మాధ్యమాలు పనిచేయక పోవడంతో ఆందోళన చెందారు. జిల్లాలో 95 శాతం అంధకారం అలుముకుంది. అధికారులు ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తున్నా అవి తాత్కాలికమే అవుతున్నాయి. మరమ్మతు చేసిన క్షణాల్లోనే తిరిగి యధాస్థితికి రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 23 జిల్లాల పరిధిలో సమ్మె జరుగుతుండడంతో విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సిబ్బంది కూడా సమ్మెకు వెళ్లడంతో గంటగంటకూ ఉత్పత్తి తగ్గుతోంది. మరికొద్ది గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే గ్రిడ్ విఫలమై రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలకు వచ్చే సరఫరా తగ్గడంతో ఆ మేరకే ఇళ్లకు సరఫరా చేసే పరిస్థితి ఉంటుందని, విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించినా పరిస్థితి చక్కబడేందుకు 48 నుంచి 72 గంటలు సమయం పడుతుందని వారంటున్నారు. ఇటువంటి విషయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు జనరేటర్లపై నడిపిన కొన్ని వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఒకటొకటిగా మూతపడుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు, హోటళ్లు, సినిమా థియేటర్లు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో జనరేటర్లపై నడుపుతున్నారు. ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు ప్రజలకు కష్టాలు తప్పించేందుకు తమ శాఖలోని ఇంజినీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారని ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీవీ సత్యనారాయణ చెప్పారు. ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయించాలని యోచిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తమ ఆధీనంలో ఉండే కొందరు ఉద్యోగులతో అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. సమస్య పరిష్కారం గురించి ఆలోచించని అధికారులు విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర అధికారులు ఆలోచించడం లేదని అందువల్లే రెండు రోజులుగా చర్చలు విఫలమవుతున్నాయని విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకుడు ఎంవీవీ గోపాలరావు అన్నారు. చర్చలు సఫలమైన పక్షంలో 24 గంటల్లోనే సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. విద్యార్థులకు కొవ్వొత్తులే దిక్కు శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్:విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. సంవత్సరం పొడువునా చదివిన సమయంలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు... నెల వ్యవధిలో ఉత్తీర్ణత సాధించాలంటే ఉదయం, రాత్రివేళల్లో చదవాల్సిన పరిస్థితి. ఉదయం ఏదోలా నెట్టుకొస్తున్నా రాత్రి వేళ విద్యుత్ సరఫరా లేక దీపం, కొవ్వొత్తుల వెలుగుల్లో చదువుతూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 28వేల మంది, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 12వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరంతా విద్యుత్ సరఫరా లేక అగచాట్లు పడుతున్నారు. అలాగే వివిధ ఉన్నత కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకూ కష్టాలు తప్పడం లేదు. కొవ్వొత్తుల వెలుగుల్లో విధులు రాజాం, న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కొవ్వొత్తుల వెలుగుల్లో విధులు నిర్వహించారు. కార్యాలయంలో వెలుతురు లేక చీకట్లు కమ్ముకోవడంతో తప్పనిసరి పనులను కొవ్వొత్తుల వెలుగుల్లో చేయాల్సి వచ్చింది. దీంతో సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. అలాగే విద్యుత్ కోత కారణంగా తాగునీటికి కూడా పట్టణ వాసులు నోచుకోలేదు. రేగిడి, శిర్లాం, రాజాంలో విద్యుత్ అంతరాయం కలగడంతో కుళాయిల ద్వారా సోమవారం తాగునీరు సరఫరా జరగలేదు. మంగళవారం కూడా తాగునీరు అందించలేమని కమిషనర్ వి.అచ్చిన్నాయుడు తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగులకు ఒకే వేతన కమిటీ
దిగొచ్చిన ప్రభుత్వం.. నేడు ఆదేశాలు జారీ నేడు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అన్ని డిమాండ్లపై సానుకూల స్పందన వస్తేనే సమ్మెపై పునరాలోచిస్తామన్న జేఏసీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనశాఖ గురువారం ఆదేశాలు జారీచేయనుంది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు వేర్వేరుగా వేతన కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రైవేటు విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల జీతాలతో పోల్చిచూడాలంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. వేతన కమిటీలో ప్రైవేటు వ్యక్తికి స్థానం కల్పించారు. దీనిపై విద్యుత్ ఉద్యోగులు మండిపడ్డారు. అందరికీ ఒకే వేతన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల జీతాలతో పోలికను, కమిటీలో బయటి వ్యక్తిని నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసిచ్చింది. దీంతో ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్‌లతో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాహూ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే రాష్ట్రం అంధకారంగా మారుతుందనే ఆందోళన ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. చివరకు ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదముద్ర వేయించారు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నరకు ఉద్యోగ సంఘాలను ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా చర్చలకు ఆహ్వానించారు. ఒకే వేతన సవరణ కమిటీ వేయనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అధికారికంగా సమాచారం లేదని, అయినప్పటికీ గురువారం యథావిధిగా వర్క్ టు రూల్‌తో పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, నేతలు కిరణ్, కళ్లెం శ్రీనివాసరెడ్డి, వెంకన్నగౌడ్, గణేష్‌రావు, భానుప్రకాశ్, వేదవ్యాసరావు చెప్పారు. మిగిలిన డిమాండ్లపైన కూడా సానుకూలంగా స్పందన వస్తేనే సమ్మెపై పునారాలోచిస్తామన్నారు. బుధవారం విద్యుత్ ప్లాంట్లు, సబ్ స్టేషన్లు, కార్యాలయాలతో పాటు విద్యుత్ సౌధలో నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. సమ్మె పిలుపు కొనసాగుతుందన్నారు.