power officials
-
అంధకారంలో వందకుపైగా గ్రామాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన గాలుల ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదిలాబాద్‌లో కలెక్టరేట్ ప్రధాన ద్వారం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద భారీ వృక్షాలు నేలకొరి గారుు. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలకు విద్యుత్ సరఫరా చేసే లైన్ తెగిపోరుుంది. దీంతో జైనథ్ మండలంలో సుమారు 55 గ్రామాలు, బేల మండలంలో 65 గ్రామాలు, ఆదిలాబాద్ మండలంలో 70కిపైగా గ్రామా ల్లో అంధకారం నెలకొంది. తాంసి, తలమడుగు మండలాల్లో కూడా కొంత నష్టం వాటిల్లింది. విద్యుత్ సిబ్బంది, అధికారులు ఆదివారం ఉదయం నుంచే పునరుద్ధరణ పనులు చేపట్టారు. జిల్లాలోని నార్నూర్ మండలంలో శనివారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలులకు 17 ఎకరాల్లో అరటితోటకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన 50 లక్షల రూపాయల విలువైన పంట నేలకొరిగింది. మెదక్ జిల్లాలో మహిళ దుర్మరణం జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారంరాత్రి ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. మన్నాపూర్‌లో ఓ ఇంటిపై ఉన్న కర్ర తలపై పడడంతో అమీనాబీ(35) అనే గృహిణి మరణించింది. ఏసప్ప, సిద్ధప్ప ఇళ్లపై భారీ మర్రి వృక్షం కూలడంతో వారి ఇళ్లు దెబ్బతిన్నాయి. నిద్రలో నుంచి తేరుకున్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. -
గడ్డుకాలమే!
- కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు - పగులుతున్న రెతన్నల గుండెలు - పరిశ్రమలకు పవర్ హాలీడే ఇచ్చినా... సాగుపై శీతకన్నే సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో కరెంటు సంక్షోభం కమ్ముకోస్తోంది. మునుపెన్నడూ లేనంతగా రోజుకు 5 మిలియన్ యూనిట్ల కరెంటు లోటు ఏర్పడింది. పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పాటు పవర్ హాలీడే ప్రకటించి, గృహ విద్యుత్‌కు కోత పెట్టినా ... రోజుకు ఇంకా 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ అత్యవసరమవుతోంది. చేను పొట్టకొచ్చి గింజలు పాలుపోసుకునే సమయంలో కరెంటు కోతలు పెరిగిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 2001 లెక్కల ఆధారంగానే రోజుకు 17.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో అధికారులు కేటాయించారు. ఇందు లో 6.50 మిలియన్ యూనిట్లువ్యవసాయానికి, 9.40 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం విని యోగిస్తున్నట్లు ట్రాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వట్టిపోతున్న పొట్టకొచ్చిన చేను జిల్లాలో 2.25 లక్షల ఉచిత విద్యుత్తు మోటారు కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇందులో 61.62 వేల హెక్టార్లలో వరి, 26 వేల హెక్టార్లలో చెరకు పం టలు సాగవుతున్నాయి. ఈ రెండు పంటలకు 24 గంటలు తడి అవసరం. మిగిలిన భూమిలో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలు వేశారు. 35 రోజుల నుంచి చినుకు కూడా రాలకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్ల మీదనే ఆధారపడి కాలాన్ని నెట్టుకొచ్చారు. ప్రస్తుతం వరి చేసు పొట్టకురాగా, గింజ ఇప్పుడిప్పుడే పాలుబోసుకుంటున్నాయి. ఈ పంటలకు సరిగ్గా నీళ్లు పారాలంటూ రోజుకు కనీసం 10 గంటల పాటు నిరంతరాయ కరెంటు అవసరం. సరిగ్గా పంటకు నీళ్లు అవసరమైన సమయంలో కరెంటు కోతలు పెరగటం తో రైతుల గుండెలు పగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 6 గంటల నిరంతరాయ కరెంటు అందిస్తామని ప్రకటించినప్పటికీ, వాస్తవంగా రైతులకు 4 గంటలకు మించి కరెంటు అందడం లేదు. టాన్స్‌కో అధికారుల అంచనాల ప్రకారం వ్యవసాయానికి ప్రస్తుతం కనీసం 7.50 మిలియన్ యూ నిట్లకు పైగా విద్యుత్ అవసరం, కానీ 4 మిలియన్ యూని ట్లకు మించి కరెంటును ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడో తిరకాసు రాష్ట్రం విడిపోవటం, విద్యుత్ డిస్కం పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోవడానికి తోడు, వర్షాలు కూడా కురవక పోవడంతో రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో జిల్లాకు రావాల్సిన రోజు వారీ వాటాలో 5 మిలియన్ యూనిట్లు కోత పెట్టారు. పరిశ్రమలకు పవర్ హాలీడే, గృహ వినియోగానికి కోత పెట్టడంతో 3 మిలియన్ యూనిట్ల కరెంటు కవర్ అవుతోంది. అయినా ఇంకా 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటుంది. ఈ లోటు పూడ్చటానికి అధికారులు వ్యవసాయానికి కోత పెడుతున్నారు. దీని కూడా ఓ కారణం ఉంది. వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్, వ్యవసాయానికి నెలకు 180 లక్షల మిలియన్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. ప్రతి విద్యుత్ మోటారు కనెక్షన్‌కు రూ.20 మాత్రమే సర్వీస్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.20 కోట్లకు మించి రావటంలేదు. అదే పరిశ్రమలకైతే... జిల్లాలో 9 వేల భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటికి రోజుకు 9.40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పరిశ్రమలకు ఇస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ. 6 చార్జీ వేస్తారు. ఈ లెక్కన పరిశ్రమల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. దీంతో విద్యుత్ అధికారులు వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్తే కాబట్టి వ్యవసాయానికి ఇచ్చే కరెంటు మీద కోత పెట్టి అన్నదాతల ఉసురు తీస్తున్నారు. -
ఇల్లెందు మున్సిపాలిటీకి పవర్ కట్
ఇల్లెందు : ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. రూ. 1.22 కోట్ల బిల్లు బకాయి ఉండడంతో మంగళవారం రాత్రి విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. వీధి దీపాలకు సంబంధించి రూ 92లక్షలు, కార్యాలయానికి సంబంధించి విద్యుత్ బకాయి, నీటి సరఫరా విభాగానికి సంబంధించి రూ. 30 లక్షల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. కార్యాలయానికి సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టార్చి లైట్ల వెలుగులో, సెల్ఫోన్ల లైట్లతో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. నెలల తరబడి బిల్లు చెల్లించకపోవడం, పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో పక్క ఈ విషయంపై మున్సిపల్ అధికారులు విద్యుత్‌శాఖపై ఎదురు దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మున్సిపల్ పరిధిలోని విద్యుత్ స్తంభాలకు చెల్లించాల్సిన ట్యాక్స్ లక్షల్లో ఉండటంతో విద్యుత్‌శాఖకు నోటీసులు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ ఏఈ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. ఖమ్మం పీఐయూ సబ్ డివిజన్ కార్యాలయానికి కూడా... ఖమ్మం జడ్పీసెంటర్ : గ్రామాల ప్రగతికి బాటలు వేయాల్సిన ఇంజనీరింగ్ కార్యాలయాలు అంధకారంలో మగ్గుతున్నాయి. విద్యుత్ బకాయి చెల్లించని కారణంగా జిల్లా పరిషత్ ఆవరణంలోని ఖమ్మం పీఐయూ సబ్ డివిజన్ కార్యాలయం ఆ శాఖ అధికారులు మంగళవారం సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ కార్యాలయం సిబ్బంది అంధకారంలో ఉన్నారు. ఈ కార్యాలయంలో పనులన్నీ ఆన్లైన్లో జరుగుతుంటాయి. విద్యుత్ సరఫరా లేని కారణంగా కార్యాలయంలోని పనులన్నీ నిలిచిపోయాయి. ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇన్వర్టర్ల సహాయంతో కొంత సేపు పనులు నిర్వహించినప్పటికీ అనంతరం అవి కూడా షట్‌డౌన్ అయ్యాయి. దీంతో సిబ్బంది ఖాళీగా ఉన్నారు. ఒకే ఆవరణలో పీఐయూ, పీఆర్ఐకి చెందిన విభాగాలు పనిచేస్తుంటాయి. విద్యుత్ సరఫరా నిలిపివేతతో రెండు విభాగాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. వీటిని పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సైతం కార్యాలయానికి రాకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌శాఖాధికారులు మాత్రం నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశామని పేర్కొన్నారు. -
విద్యుత్ సేవలకు బ్రేక్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విద్యుత్ అధికారులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లటంతో సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు నిర్వహణ చూసే వారు లేక గాలిలో దీపాలుగా తయారయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు గాలులు కూడా వీచి కరెంటు సరఫరా నిలిచిపోతే ప్రజలు అంధకారంలో చిక్కుకోవాల్సిందే. ప్రతి సబ్‌స్టేషన్‌లో ఒక కాంట్రాక్టు ఎన్ఎంఆర్ మినహా అందరూ విధులకు గైర్హాజరయ్యారు. సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది అంతా సమ్మెలోనే.. సమైక్య రాష్ట్రం కోసం విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి 72 గంటల సమ్మెలోకి వెళ్లారు. జిల్లాలో, విజయవాడలో కలిపి 176 సబ్స్టేషన్లలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది కూడా సమ్మెకు దిగారు. డివిజనల్ ఇంజినీర్ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో హెల్పర్ వరకు అన్ని కేటగిరీల్లో సిబ్బంది యావత్తూ సమ్మెలోకి వెళ్లారు. రైతుబజారు ఎదుట గల ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం మూతపడింది. జిల్లా అంతటా విద్యుత్ అధికారులు, సిబ్బంది దాదాపు మూడువేల మంది సమ్మెబాట పట్టారు. ప్రత్యామ్నాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం.. విద్యుత్ సిబ్బంది సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జిల్లాలో వేలాదిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గాలికొదిలేశారు. అత్యవసర సేవలు మినహా మరే విధమైన సేవలకూ హాజరవకూడదని విద్యుత్ జేఏసీ నిర్ణయించింది. సాయంత్రానికే ప్రజల కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో 20 నుంచి 30 ఫీడర్లు, విజయవాడలో దాదాపు 10 సాంకేతిక లోపానికి గురైనట్లు సమాచారం. వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ సెల్‌ఫోన్ సిమ్ కార్డులను ఇచ్చివేసి ఆందోళనలో పాల్గొంటున్నారు. విజయవాడలో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గృహ వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. సమ్మె ఉధృతం చేస్తాం : సత్యానందం రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రవేశపెడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ సత్యానందం హెచ్చరించారు. గురువారం విజయవాడలో సర్కిల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర అంధకారంలో ఉంటుందన్నారు. ముఖ్యమైన జలవిద్యుత్ కేంద్రాలన్నీ తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. తాము జీతభత్యాల కోసం సమ్మె చేయటం లేదని, ప్రజాశ్రేయస్సు కోసం సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నామని, ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ కె.రామచంద్రరావు, కన్వీనర్ ఎం.వెంకటేశ్వరరావు, ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకుడు బి.శ్రీనివాసరావు, జేఏసీ నేత కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.