power poles
-
అదిలాబాద్: దెబ్బతిన్న రోడ్లు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
-
యమపాశాలు!
రైతుల జీవితాల్లో వెలుగులు పంచాల్సిన విద్యుత్ తీగలు కాలనాగులై కాటేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలం చెల్లిన కరెంట్ తీగలు ఎప్పుడు తెగి పడతాయో... విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. ఏటా పదుల సంఖ్యలో అన్నదాతలు కరెంట్ షాక్‌కు బలవుతున్నారు. బతుకుసాగులో రైతన్నకు అండగా నిలుస్తున్న మూగజీవాలు సైతం కరెంట్ షాక్‌తో మృత్యువాత పడుతున్నాయి. - మెదక్ విద్యుత్ శాఖ అధికారు లు, సిబ్బంది నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలిగొంటుంది. దశాబ్దాల క్రితం నాటి స్తంభాలు, వైర్లు శిథిలమై రైతులు, జనానికి కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. చాలాచోట్ల కర్రలే విద్యుత్ స్తంభాలుగా మారి ప్రమాద ఘం టికలను మోగిస్తున్నాయి. ఇదిలావుంటే వేలాది రూపాయల్లో జీతాలు తీసుకుంటున్న కొంతమంది విద్యుత్ ఉద్యోగులు వారు చేయాల్సిన పనిని బయటి వారికి అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. దీంతో వచ్చిరాని పనితనంతో విద్యుత్ మరమ్మతులు చేస్తూ కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్రలే స్తంభాలుగా... ఔరంగాబాద్, శమ్నాపూర్, రాయిన్‌పల్లి, పాతూర్‌తోపాటు అనేక గ్రామాల్లో అదనపు స్తంభాల కోసం డీడీలు చెల్లించి ట్రాన్స్‌కో కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ కరెంట్ కనెక్షన్ల నిమిత్తం బోరు బావి వద్దకు విద్యుత్ పోల్ వేయాల్సిన అధికారు లు.. నిర్లక్ష్యం చేస్తుండటంతో కర్రలనే ఆధారంగా చేసుకొని రైతులు కరెంట్ తీగలు వేసుకుంటున్నా రు. ఈ క్రమంలో ఈదురు గాలులు వీచినా, భారీ వర్షాలు పడ్డా... ఆ కర్రలు నేల వాలుతున్నాయి. కరెంట్ తీగలు తెగిపోతున్నాయి. వెనుకాముందు చూడని రైతులు ఆ తీగలకు బలవుతున్నారు. మోగుతున్న ప్రమాద ఘంటికలు... గ్రామాల్లో సుమారు 40 ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ వైర్లు, స్తంభాలు శిథిలమై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్ ఏర్పాటు చేయక పోవడం, ఏ-బీ స్విచ్‌లు అమర్చకపోవడం, విద్యుత్ లైన్ కింద పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించక పోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ట్రాన్స్‌కోకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు తాము చేయాల్సిన పనులను బయటివారికి అప్పగిస్తున్నారు. పదో పరకో చేతపెట్టి యువకులతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. దీంతో అనుభవం లేని ఆ యువకులు కరెంట్ కాటుకు బలవుతున్నారు. చోటుచేసుకున్న పలు ఘటనలు... అందోల్ మండలం సాయిబాన్పేటలో శుక్రవారం రాములు(35) అనే రైతు నేలవాలిన విద్యుత్ తీగలకు బలయ్యాడు. ఇటీవల మెదక్ మండలం శమ్నాపూర్‌కు చెందిన మైలి పోచయ్య తన వ్యవసాయ పొలంలో కర్రల ఆధారంగా వేసిన విద్యుత్ వైర్లు తెగిపడగా మరమ్మతులు చేయబోయి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాల పాలయ్యాడు. మే 20న పాపన్నపేట మండలం కొడుపాకలో మంగళి శివరాం(35) అనే వ్యక్తి తెగిపడ్డ విద్యుత్ తీగలకు బలయ్యాడు. ఇదే గ్రామంలో అంతకుముందు మంగళి రాములు, తమ్మలి ప్రతాప్, కుర్మ బీరయ్య, సందిల రాములు విద్యుత్ షాక్‌తోనే మృత్యువాత పడ్డారు. మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన బొమ్మర్తి కిష్టయ్య(50), పాపన్నపేట మండలం గాజులగూడెంలో గంజి హన్మంతు(25) విద్యుత్ ప్రమాదానికి బలయ్యారు. గతంలో పాపన్నపేట మండలం చిత్రియాల్‌లో పుట్టి యాదమ్మ, ఎల్లాపూర్‌లో పుట్టి నర్సింలు, శానాయిపల్లిలో జిన్న ఏసయ్య, జిన్న వెంకయ్యలు కరెంట్ కాటుకు కన్నుమూశారు. ఇటీవల దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లు సంపత్ అనే మూగబాలుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రైతులతోపాటు వ్యవసాయంలో వారికి చేదోడు వాదోడుగా ఉండే మూగజీవాలు సైతం కరెంట్షాక్లతో మృత్యువాత పడుతున్నాయి. -
నష్టం అపారం!
భారీగా నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు 48 గంటలుగా అంధకారంలో జిల్లా పూర్తి పునరుద్ధరణకు మరో 2 రోజులు వేల ఇళ్లు నేలమట్టం నష్టం రూ.1500 కోట్లు పైమాటే విశాఖ రూరల్: విశాఖ మోడులా మారింది. హుదూద్ తుపాను జిల్లా రూపురేఖలను మార్చేసింది. పెనుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విశాఖ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఏడుగురి ప్రాణాలను హరించాయి. లెక్కలేనంత మందిని క్షతగాత్రులను చేశాయి. పైకప్పులు లేని ఇళ్లతో, కన్నీరు ఉప్పొంగుతున్న కళ్లతో ప్రజానీకం బావురుమంటోంది. ప్రజలకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. జిల్లాను విషాదంలో ముంచేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు హుదూద్ తుపాను కారణంగా జిల్లా రూపురేఖలు మారిపోయాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. 48 గంటలుగా జిల్లా అంధకారంలో మగ్గుతోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తం భించింది. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఉండడానికి నిలువ నీడలేదు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టినా ప్రకృతి ప్రకోపం ముందు నిలవలేకపోయారు. నస్టాన్ని నివారించలేకపోయారు. ఈ తుపాను కారణంగా జిల్లాలో రూ.1500 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. వేల ఇళ్లు నేలమట్టం : శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన పెను గా లులకు వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పూరిళ్లు, రేకులు, పెంకుటిళ్లే కాకుండా పక్కా ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నా యి. 10 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు భావిస్తున్నారు. అంధకారంలో జిల్లా : పెనుగాలులకు భారీ సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లను పూర్తిగా తొలగిస్తేనే గాని విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశం లేదు. దీంతో చెట్ల నరికివేతను వేగవంతంగా చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్‌ను పునరుద్ధరించాలంటే కనీసం 48 గంటలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. రూ.500 నుంచి రూ.600 కోట్లు వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్తంభించిన కమ్యూనికేషన్ హుదూద్ తుపాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్తంభించి పోయింది. టెలికాం సంస్థల సెల్ టవర్లకు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ విద్యుత్ అంతరాయం కారణంగా జిల్లాలో ఫోన్ సిగ్నల్‌కు అంతరాయం ఏర్పడింది. వీటిని పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న పంటలు : ప్రస్తుతం జిల్లాలో 1,78,743 హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా వరి 88,893 హెక్టార్లలోను, చెరకు 37,459 హెక్టార్లలోను, రాగి 20,324 హెక్టార్లలోను సాగు జరుగుతోం ది. మరికొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో హుదూద్ తుపాను పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. రూ.75 కోట్లు వరకు నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లు : భారీ వర్షం కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో దాదాపుగా 100 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఆర్ అండ్ బీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీని నష్టం రూ.40 కోట్లు వరకు ఉంటుందని భావిస్తున్నారు. -
తండాల్లో సౌర వెలుగులు!
=రూ.59 కోట్లతో ఈపీడీసీఎల్ ప్రతిపాదనలు =ఏజెన్సీలో మరిన్ని గ్రామాల్లో ఏర్పాటు =వ్యక్తిగత వినియోగదారులకూ 50 శాతం రాయితీ సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలో విద్యుత్ వెలుగులకు నోచుకోని మారుమూల పల్లెలు వందల్లో ఉన్నాయి. ఆయా తండాల్లో ఎలాంటి విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్ల ఏర్పాటుకు వీల్లేని పరిస్థితి. రవాణా వ్యవస్థ కూడా మృగ్యం. ఇరుకుబాటలు, చెట్ల కొమ్మలతో ఆకాశం కనిపించని దుస్థితి. సాయంత్రం 5 గంటలకే చీకట్లు కమ్ముకుంటాయి. రాత్రి 7 గంటలకు తండాలన్నీ గాఢ నిద్రలో జోగుతుంటాయి. విష సర్పాలు, అడవి జంతువుల భయం ఎలానూ ఉంటుంది. ఇలాంటి వారికి విద్యుత్ వెలుగులందించాలన్న లక్ష్యంతో తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ప్రయత్నిస్తోంది. తరిగిపోని ఇంధన వనరైన సౌర శక్తిద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, గిరిపల్లెల్లో వెలుగులు నింపే చర్యల్ని ముమ్మరం చేస్తోంది. తొలిసారిగా అప్పటి సీఎండీ నదీంఅహ్మద్ హయాంలో గిరిపల్లెల్లో సౌర విద్యుత్ వ్యవస్థను కేంద్రప్రభుత్వం సాయంతో ఏర్పాటు చేశారు. కేంద్రం 90 శాతం వ్యయాన్ని, మిగిలిన 10 శాతాన్ని రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్ యోజన పథకంలో భాగంగా ఈపీడీసీఎల్ భరించేలా ప్రతిపాదించారు. తొలి విడతతో రూ.16.9 కోట్లతో 2,225 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొయ్యూరు, జి.మాడుగుల, చింతపల్లి, అనంతగిరి, అరకు, పాడేరు, ముంచింగిపుట్టు, హుకుంపేట, జీకే వీధి మండలాల్లోని పలు పల్లెల్లో ఇప్పటికే రూ.45 కోట్లతో చేపట్టిన సౌర విద్యుత్ వ్యవస్థ నడుస్తోంది. ఒక్కో పల్లెలో 2 కేవీ నుంచి 12 కేవీ సామర్థ్యంతో ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. తండాల్లోని ప్రతి ఇంటికీ ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు 100 వాట్ల మేరకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండు సీఎఫ్ఎన్ బల్బులతో విద్యుత్ వెలుగులందిస్తున్నారు. మరో రూ.59 కోట్ల వ్యయంతో కొత్తగా మరిన్ని గ్రామాల్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరయితే, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. వ్యక్తిగత వినియోగదారులకూ రాయితీ సౌర విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా 3ఫేజ్ సర్వీసు వినియోగదారులతోపాటు సింగిల్ ఫేజ్(వ్యక్తిగత) వినియోగదారులకూ 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు సీఎండీ తెలిపారు. నెట్ మీటరింగ్ విధానంలో 3 కిలోవాట్ సామర్థ్యమున్న సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటుతో మిగులు విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించే అవకాశాన్నీ కల్పిస్తున్నామన్నారు. వచ్చే మార్చి నెలాఖరులోగా ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకే ఇది వర్తిస్తుందని సీఎండీ తెలిపారు. డీ సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరేషన్(డీసీడీజీ) విధానంలో ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కూడా సౌర విద్యుత్ వెలుగులకు రంగం సిద్ధం చేస్తున్నారు. 10 చ.మీ./100 చ.అ.ల విస్తీర్ణంలో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. నాబార్డ్‌లో భాగంగా కొన్ని జాతీయ బ్యాంకులు కూడా వినియోగదారుల వాటా 50 శాతానికి రుణ సదుపాయానికి ముందుకు వస్తున్నట్టు పేర్కొంటున్నారు.