మణిపూర్‌లో బాంబు పేలుడు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని కంగ్లాలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించింది. దాంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ పేలుడులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని మణిపూర్‌కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు ఇప్పటికే పిలుపునిచ్చాయి.
ఆ సంస్థల ఘాతుకచర్యే అని పోలీసులు భావిస్తున్నారు. అయితే 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ శనివారం రాత్రి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హింసతో సాధించేది ఏమి లేదని తీవ్రవాద సంస్థలు సూచించారు. హింసను విడిచి జనజీవన స్రవంతిలో కలసి, సమాజ అభివృద్దికి పాటుపడాలని తీవ్రవాదులకు ఆయన హితవు పలికారు.