మణిపూర్లో బాంబు పేలుడు | Powerful bomb explodes as R-Day celebrations begin | Sakshi

మణిపూర్లో బాంబు పేలుడు

Published Sun, Jan 26 2014 9:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని కంగ్లాలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించింది.

మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని కంగ్లాలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించింది. దాంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ పేలుడులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని మణిపూర్కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు ఇప్పటికే పిలుపునిచ్చాయి.

 

ఆ సంస్థల ఘాతుకచర్యే అని పోలీసులు భావిస్తున్నారు. అయితే 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ శనివారం రాత్రి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హింసతో సాధించేది ఏమి లేదని తీవ్రవాద సంస్థలు సూచించారు. హింసను విడిచి జనజీవన స్రవంతిలో కలసి,  సమాజ అభివృద్దికి పాటుపడాలని తీవ్రవాదులకు ఆయన హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement