Powers to Governor
-
'మంత్రి పదవికి ఎవరు అడ్డుపడ్డారనేది..మాట్లాడను'
న్యూఢిల్లీ: హైదరాబాద్ లో శాంతి భద్రతల అంశంలో గవర్నర్‌కు అధికారాలివ్వడం అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. గవర్నర్ అధికారాలపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని హోంమంత్రిని కోరానని ఆయన తెలిపారు. యూపీఏ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని దత్తాత్రేయ విమర్శించారు. గవర్నర్‌కు అధికారాలివ్వడంపై తొలుత బీజేపీనే ప్రశ్నించిందనే విషయాన్ని దత్తాత్రేయ గుర్తు చేశారు. అయితే తెలంగాణ బిల్లును అడ్డుకోవద్దని టీఆర్ఎస్ వాళ్లే మమ్మల్ని కోరడం వల్లనే తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. నాకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం...ఎవరనేదానిపై మాట్లాడదలచుకోలేదని దత్తాత్రేయ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీల జనాభా ఎంత ఉందో సర్వేలో తేలుతుందని దత్తాత్రేయ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
'ఆ నిర్ణయం మా ప్రభుత్వానిది కాదు'
-
'ఆ నిర్ణయం మా ప్రభుత్వానిది కాదు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేషాధికారాలు అప్పగించే విషయంలో విభజన చట్టంప్రకారమే తాము నడుచుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై లోక్‌సభలో కేంద్ర హెంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సెక్షన్ 8 కింద ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలున్నాయని తెలిపారు. విజభన బిల్లును యూపీఏ ప్రభుత్వం చేసిందని, తాము కాదని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలన్నది తమ నిర్ణయం కాదని తెలిపారు. ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రుల రక్షణ బాధ్యత గవర్నర్దేనని చట్టంలో ఉందని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ కేబినెట్ అభిప్రాయం తీసుకుని గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిస్తారని వివరించారు. రాజ్‌నాథ్ ప్రకటనపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చూస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. -
కేసీఆర్‌కు ముందే తెలుసు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలను గవర్నర్ కు అప్పగించే అంశంపై రాష్ట్ర బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు సాగుతోంది. రాష్ట్ర పునర్విభజన బిల్లులోనే అధికారాల బదలాయింపు ఉందన్న సంగతి కేసిఆర్‌కు మందే తెలుసునని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలతో కలిసి వ్యతిరేకిస్తామని కేసీఆర్ అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ మాటలు నమ్మొద్దని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. -
రాష్ట్రాల హక్కును హరించేలా ఉన్నాయి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: గవర్నర్‌కు శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలిచ్చే కేంద్రం ప్రతిపాదనలను నిజమాబాద్ ఎంపీ కవిత తప్పుపట్టారు. శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు గవర్నర్ కు ఇవ్వడమంటే రాష్ట్రాల హక్కును హరించడమే అని ఎంపీ కవిత అన్నారు. కేంద్ర ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని కవిత వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అందరం శాంతియుతంగా సామరస్యంగా ఉంటున్నానమని ఎంపీ కవిత తెలిపారు. రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమ సందర్భంగానూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినా తర్వాత కూడా ఇరుప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాయని ఎక్కడా ఏ చిన్న ఘటన నమోదు కాలేదని ఆమె తెలిపారు. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి కేంద్రం జోక్యంపై నిరసన తెలిపామన్నారు. కేంద్ర ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని ఎంపీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.