prabhavati
-
ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు
-
ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు
సాక్షి, విజయవాడ : ఏసీబీ అధికారిణి పిడిక్కాల ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రభావతి గత నవంబర్‌లో శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్న భర్త... ఆ తర్వాత నుంచి రూ.20 లక్షల కట్నం తేవాలంటూ వేధింపులకు దిగాడు. అవి కాస్త శ్రుతి మించడంతో ఆమె పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హెచ్ఎం భర్తకు ప్రభుత్వ ఉద్యోగం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ పూడూరు: స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ లో ప్రభావతి కుటుం బాన్ని ఆయ న పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభావతి భర్త రాజీవ్‌రెడ్డికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె కూతుళ్లు ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభావతిలాంటి ఉత్తమ టీచర్ల వల్లే విద్యావ్యవస్థ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్‌గ్రేషియాను అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గాయాలపాలైన విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్కూళ్లలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించండి: విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న లెక్కలు తేల్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలను ఆనుకొని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బావులు, విద్యుత్ తీగలు వంటి వాటి వివరాలను సేకరించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల కింద రంగారెడ్డి జిల్లా మేడికొండ ప్రభుత్వ పాఠశాలలో జెండా రాడ్‌కు విద్యుత్ తీగ తగిలి ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. -
కుటుంబ కలహాలు: ముగ్గురి ఆత్మహత్యాయత్నం
బుచ్చిరెడ్డిపాళెం: కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం శివారు వడ్డిపాళెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త ప్రభావతి, ఆమె భర్త కుమార్, కుమార్తె సింధు(7) గురువారం రాత్రి గుళికల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. వేకువజామున గమనించిన కుటుంబసభ్యులు వారిని బుచ్చిరెడ్డిపాళెం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
సత్య నాదెళ్ల తల్లి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి అంత్యక్రియలు హైదరాబాద్ రాయదుర్గంలోని విష్పర్‌వ్యాలీ ‘మహాప్రస్థానం’ శ్మశానవాటికలో సోమవారం జరిగాయి. సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ పర్యవేక్షణలో అంత్యక్రియలను విద్యుత్ దహన వాటికలో నిర్వహించారు. అనారోగ్యానికి గురైన ఆమెను శనివారం శేరిలింగంపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సత్య నాదెళ్ల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.