Pradesh Congress Committee
-
Sakshi Cartoon: 20-09-2022
-
శాంతించిన సిద్ధూ..!
న్యూఢిల్లీ/చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన గురువారం చండీగఢ్‌లోని పంజాబ్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ అయ్యారు. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే ఒక సమన్వయ కమిటీని(కో–ఆరి్డనేషన్ ప్యానెల్) ఏర్పాటు చేసుకోవాలని ఇరువురూ నిర్ణయానికొచి్చనట్లు తెలిసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు నేతల మధ్య 2 గంటలపాటు భేటీ జరిగింది. భేటీ తర్వాత చన్నీ, సిద్ధూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అతిత్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం అతిత్వరలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం చెప్పారు. పార్టీలో ఇటీవలి కాలంలో లుకలుకలు, అసంతృప్త గళాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సీడబ్ల్యూసీ భేటీ తక్షణమే నిర్వహించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంపై అధినేత సోనియా గాంధీ ఇటీవలే సంకేతాలిచ్చారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మరోవైపు, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అస్థిరత సృష్టిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గురువారం ఆరోపించారు. -
ఒకచోట నాలుగు.. మరోచోట ఐదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో కాంగ్రెస్ ఓ అంకం పూర్తి చేసింది. మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ఒక్కో పార్లమెంటు స్థానానికి నాలుగు నుంచి ఐదుగురు ఆశావాహులతో కూడిన ప్యానెల్ ఖరారు చేసింది. ఈ ప్యానెల్‌లోని పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపగా, నేడు ఢిల్లీలో జరగనున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ పేర్లపై చర్చ జరగనుంది. అనంతరం రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన పీఈసీ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఈసీ సభ్యులు జానారెడ్డి, వి.హనుమంతరావు, డీకే అరుణ, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంపత్, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో కొత్త జిల్లాల డీసీసీ అధ్యక్షులు పంపిన ఆశావాహుల జాబితాపై పీఈసీ చర్చించింది. ఒక్కో స్థానం నుంచి 8 నుంచి 10 పేర్లను డీసీసీ అధ్యక్షులు పంపినట్లు సమాచారం. ఈ పేర్లపై చర్చించిన పీఈసీ.. సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీ పట్ల విధేయత లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో స్థానానికి నాలుగు, మరికొన్ని స్థానాలకు ఐదు పేర్లను ఖరారు చేసి అధిష్టానానికి పంపింది. వాడివేడి చర్చ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతల మధ్య వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిపై చర్చ సందర్భంగా సీనియర్ నేత జైపాల్‌రెడ్డిని బరిలో దింపాలని ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ సూచించారు. అయితే ఆయన పోటీకి సుముఖంగా లేరని పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పగా.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీకి సిద్ధం కాకపోతే ఎలా అని అరుణ ప్రశ్నించారు. జాతీయ స్థాయి నేత పోటీ చేయకుంటే ఎలా అని, ఒకవేళ పోటీ చేయాలనే భావన లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఎందుకు ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న చిన్నారెడ్డి.. పెద్ద నాయకుల గురించి అలా మాట్లాడొద్దని అనబోగా, పెద్ద నాయకుడు కాబట్టే తాను కూడా పోటీలో ఉండాలని ప్రతిపాదిస్తున్నానని అరుణ కౌంటర్ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ పాలమూరు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక్కడి నుంచి చంద్రశేఖర్, సతీశ్మాదిగల పేర్లను ప్యానెల్లో చేర్చాలని అరుణ ప్రతిపాదించారు. దీనికి సంపత్, మల్లురవి అభ్యంతరం వ్యక్తం చేశారు. సంపత్తో పాటు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్లను వారు ప్రతిపాదించారు. పార్టీ పునాదులు లేని వారిని ఎలా ప్యానెల్లో చేరుస్తారని సతీశ్మాదిగను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి కూడా అరుణ దీటుగానే కౌంటర్ ఇచ్చారు. పార్టీలో ఏం పునాది ఉందని కొందరు ఏఐసీసీ కార్యదర్శులయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ పార్టీలో లేరని, సస్పెండైన వారిని ఎలా ప్రతిపాదిస్తారని సంపత్, రవిలు ప్రశ్నించగా, గత ఎన్నికల్లో కనీసం పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్లు ఎలా ఇచ్చారని అరుణ కౌంటర్ వేశారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి మధుయాష్కీగౌడ్ పేరు ప్రతిపాదించడంపై సమావేశంలో చర్చ జరిగింది. స్థానికేతరుడైన ఆయన పేరును భువనగిరి నుంచి ఎలా ప్రతిపాదిస్తారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలపై చర్చ కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసింది. బుధవారం దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా బుధవారం ఖరారు చేసి ఈనెల 28న నామినేషన్ దాఖలు చేయించాలని నిర్ణయించారు. ఈ స్థానంలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేరు దాదాపు ఖరారే అయినా ప్రస్తుత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతలను మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అప్పగిస్తూ పీఈసీ నిర్ణయం తీసుకుంది. -
డీసీసీలూ... పేర్లు పంపండి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొత్త డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) నిర్ణయించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురి పేర్లను తమకు పంపాలని డీసీసీ అధ్యక్షులకు సూచించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీఈసీ సమావేశమైంది. ఈ భేటీకి కమిటీ సభ్యులు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, డి.కె.అరుణ, రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కుసుమకుమార్, షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, సంపత్, వంశీచంద్‌రెడ్డి, మధుయాష్కీ, కనుకుల జనార్దనరెడ్డి, సుధీర్‌రెడ్డి, నేరెళ్ల శారద, అనిల్‌కుమార్‌యాదవ్, బల్మూరి వెంకట్రావు, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు శ్రీనివాసకృష్ణన్, బోసురాజు, సలీం అహ్మద్ హాజరయ్యారు. సమావేశంలో భాగంగా లోక్‌సభ స్థానాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో పోటీకి అర్హులైన నేతల నుంచి వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని నిర్ణయించారు. ఈ దరఖాస్తులను వడపోసే బాధ్యతలను డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను డీసీసీ అధ్యక్షులకు పంపాలని, వీలైనంత త్వరలో ఆయా జిల్లాల అధ్యక్షులు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు వరకు నేతల జాబితాను పీఈసీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత అభ్యర్థి పార్టీలో ఎంతకాలంగా ఉన్నారు.. ఆయన్ను లోక్‌సభకు పంప డానికి అర్హతలను కూడా డీసీసీ అధ్యక్షులు తమ జాబితాతో పాటు తెలపాలని సూచించా రు. డీసీసీల నుంచి ప్రతిపాదిత జాబితా వచ్చా క మరోమారు సమావేశమై ఏఐసీసీకి పంపే జాబితాను ఖరారు చేయాలని నిర్ణయించారు. 25న జరిగే అవకాశం... డీసీసీ అధ్యక్షులు తమ జాబితాలు పం పేందుకు నాలుగైదు రోజుల సమయం పట్ట నుండటం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటం, కుంతియా కుమా రుని వివాహం ఉండటంతో ఈ నెల 25న మరోమారు పీఈసీ భేటీకి నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ జాబితా ను 25న రూపొందించి, దీనిపై స్క్రీనింగ్ కమిటీ చర్చించిన తర్వాత ఈనెలాఖరులో పు కసరత్తు పూర్తి చేయనున్నట్టు సమాచారం. -
రాహుల్ గాంధీని చిక్కుల్లో పడేసిన పోస్టర్
పాట్నా : బిహార్ రాజధానిలో వెలసిన ఒక పోస్టర్ రాజకీయ దుమారం రేపుతుంది. ఈ పోస్టర్లో రాహుల్ గాంధీతో పాటు పలువురు బిహార్ కాంగ్రెస్ నేతల ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు మాత్రం ఉంటే సమస్య లేదు. కానీ ఆ ఫోటోల మీద సదరు నేతల పేర్లు కాక వారి సామాజిక వర్గాల(కులం) పేర్లు దర్శనమివ్వడంతో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. ఈ పోస్టర్ చూసిన బీజేపీ నాయకులు ‘రాహుల్ గాంధీ కుల రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారం’టూ దుమ్మెత్తిపోస్తున్నారు. వివరాలు బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్‌కు నూతన కార్యవర్గాన్ని నియమించినందుకు కృతజ్ఞతలు తెలపడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ పోస్టర్‌ను తయారు చేయించారు. ఈ పోస్టర్లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ జాతో పాటు మరి కొందరు సీనియర్ నాయకుల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే పోస్టర్లో నాయకుల పేర్లకు బదులు వారి సామాజిక వర్గాల పేర్లు ప్రింట్ చేయించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, మదన్ మోహన్‌లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వారి ఫోటోల మీద ‘బ్రాహ్మణ్ సముదాయ్’ అని ప్రింట్ చేశారు. ఇలానే మిగతా నేతల ఫోటోల మీద వారి సామాజిక వర్గాల పేర్లను ప్రింట్ చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ చర్యలు కుల రాజకీయాలను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాక ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయితే ఈ పోస్టర్ల గురించి కానీ.. బీజేపీ నాయకుల ఆరోపణల గురించి కానీ కాంగ్రెస్ నాయకులు స్పందిచకపోవడం గమనార్హం. -
ఎంపీలో ‘ఐ’క్యతా రాగం!
సాక్షి, భోపాల్ : నగరంలో మంగళవారం ప్రచండ భానుడు మండిపోతున్నాడు. 42 డిగ్రీల ఎండలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడు కమల్‌నాథ్‌కు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏమాత్రం వెరవలేదు. నాయకుడితోపాటు ఆరు గంటల రోడ్ షోలో అలుపెరగకుండా పాల్గొన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులై రాష్ట్రానికి తిరిగొస్తున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎగబడ్డారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలోని ‘జయహో’ ట్రాక్‌లో పార్టీ పాట హోరెత్తుతుండగా, అందంగా అలంకరించిన ఒంటెలు, గుర్రాలతో పార్టీ కార్యకర్తలు మేళతాళాల మధ్య డాన్సులు చేశారు. ఛింద్వారా నియోజకవర్గానికి తొమ్మిదోసారి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కమల్ నాథ్ మోటార్ వాహనంపై వస్తుండగా, ఆయన పక్కన పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వీకరించనున్న కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య వెన్నంటి వచ్చారు. కార్యకర్తలు అందించిన కొబ్బరి బోండంను ఆయన స్వయంగా కమల్‌నాథ్‌తో తాగించారు. విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ఈ స్వాగత యాత్ర సాగింది. సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో దారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఎంతో మంది రైతులు కూడా తమ ఎండ్ల బండ్లతో ర్యాలీలో భాగంగా కదిలి వచ్చారు. బీజేపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రైతులు రాష్ట్రంలో పలుసార్లు సమ్మెలు చేసిన విషయం తెల్సిందే. కమల్‌నాథ్ ర్యాలీ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కమల్‌నాథ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య ప్రసంగించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామన్న సందేశం ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఇంకా నాయకత్వం కోసం గొడవలు ఉన్నాయంటే నమ్ముతారా? అని ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రేక్షకులనుద్దేశించి ప్రశ్నించగా, ‘లేదు లేదు. అదంతా గతం’ అంటూ ప్రజలు స్పందించారు. ఈ ముగ్గురు నాయకుల మధ్యనున్న కుమ్ములాటల వల్ల రాష్ట్రంలో అధికారానికి కాంగ్రెస్ 15 ఏళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఐక్యత పైకి కనిపించేదేనా, నిజంగా వారిమధ్య ఐక్యత కుదిరిందా అన్నది ఇప్పుడే స్పష్టం చేయలేం గానీ, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న కాంక్ష వారిలో కనిపించింది. ‘హమ్ ఆపస్ మే లడ్ గయేతో దేశ్‌కు ఖౌన్ బచాయేగా!’ నినాదాల మధ్య సమావేశం ముగిసింది. -
29న జిల్లాకు రాహుల్
- ఉప ఎన్నికలే లక్ష్యంగా పర్యటన - కొత్త ఉత్సాహం నింపేందుకు పీసీసీ యత్నాలు వరంగల్ : ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఆహ్వానం మేరకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 29వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాహుల్ గాంధీ గత నెల 12వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో చేపట్టిన ‘రైతు ఆత్మగౌరవ యాత్ర’ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. జూన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాకు సోనియాగాంధీని తీసుకొచ్చేందుకు పీసీసీ ప్రయత్నించింది. ముందు ఉప ఎన్నికలు తప్పవని తెలియడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ పర్యటనపై ఆసక్తి కనబర్చలేదు. ఉపఎన్నికలు ఖరారైతే రాహుల్ జిల్లాలో పర్యటించేందుకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జవసత్వాలు నింపేందుకు.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ పార్లమెంట్‌తోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తున్న అంశం. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పార్టీ కేడర్‌కు జవసత్వాలు సమకూర్చేందుకు పీసీసీ నాయకత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క జిల్లాలు పర్యటిస్తూ టీఆర్ఎస్పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ పార్టీ కార్యకర్తలో నూతనోత్సాహం నింపుతున్నారు. ఈ మేరకు జూన్ ఆఖరి వారంలో రెండు రాష్ట్రాల్లో రాహుల్ పర్యటన దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా జిల్లాలో 29వ తేదీన రాహుల్ వస్తారని సమాచారం అందినట్లు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు.