సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొత్త డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) నిర్ణయించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురి పేర్లను తమకు పంపాలని డీసీసీ అధ్యక్షులకు సూచించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీఈసీ సమావేశమైంది. ఈ భేటీకి కమిటీ సభ్యులు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, డి.కె.అరుణ, రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కుసుమకుమార్, షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, సంపత్, వంశీచంద్‌రెడ్డి, మధుయాష్కీ, కనుకుల జనార్దనరెడ్డి, సుధీర్‌రెడ్డి, నేరెళ్ల శారద, అనిల్‌కుమార్‌యాదవ్, బల్మూరి వెంకట్రావు, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు శ్రీనివాసకృష్ణన్, బోసురాజు, సలీం అహ్మద్ హాజరయ్యారు. సమావేశంలో భాగంగా లోక్‌సభ స్థానాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.
ఒక్కో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో పోటీకి అర్హులైన నేతల నుంచి వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని నిర్ణయించారు. ఈ దరఖాస్తులను వడపోసే బాధ్యతలను డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను డీసీసీ అధ్యక్షులకు పంపాలని, వీలైనంత త్వరలో ఆయా జిల్లాల అధ్యక్షులు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు వరకు నేతల జాబితాను పీఈసీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత అభ్యర్థి పార్టీలో ఎంతకాలంగా ఉన్నారు.. ఆయన్ను లోక్‌సభకు పంప డానికి అర్హతలను కూడా డీసీసీ అధ్యక్షులు తమ జాబితాతో పాటు తెలపాలని సూచించా రు. డీసీసీల నుంచి ప్రతిపాదిత జాబితా వచ్చా క మరోమారు సమావేశమై ఏఐసీసీకి పంపే జాబితాను ఖరారు చేయాలని నిర్ణయించారు.
25న జరిగే అవకాశం...
డీసీసీ అధ్యక్షులు తమ జాబితాలు పం పేందుకు నాలుగైదు రోజుల సమయం పట్ట నుండటం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటం, కుంతియా కుమా రుని వివాహం ఉండటంతో ఈ నెల 25న మరోమారు పీఈసీ భేటీకి నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ జాబితా ను 25న రూపొందించి, దీనిపై స్క్రీనింగ్ కమిటీ చర్చించిన తర్వాత ఈనెలాఖరులో పు కసరత్తు పూర్తి చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment