pragathi maha vidyalaya college
-
‘వైఎస్ జగన్‌తో కలిసి చదవడం సంతోషంగా ఉంది’
-
‘వైఎస్ జగన్‌తో కలిసి చదవడం సంతోషంగా ఉంది’
సాక్షి, హైదరాబాద్ : తమ కాలేజీలో చదివిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుండటం చాలా సంతోషంగా ఉందని ప్రగతి మహావిద్యాలయ యాజమాన్యం పేర్కొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్నేహితులు బొగ్గులకుంటలోని ప్రగతి మహావిద్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1991 నుండి 1994 మధ్య ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. వైఎస్ జగన్ బీకామ్‌లో ప్రథమ స్థానంలో రాణించారని కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. వైఎస్ జగన్‌తో పాటు కలిసి చదివినందుకు చాలా సంతోషంగా ఉందని గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 'కాలేజీ ప్రిన్సిపల్ వేదాచలం అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు. వైఎస్ జగన్ కాలేజీలో జాయిన్ అయ్యేసమయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపీగా ఉన్నారు. తమ కాలేజీ విద్యార్థులందరికీ వైఎస్ జగన్ అంటే చాలా గౌరవం ఉండేది. జగన్ కూడా తమతో సాధారణ వ్యక్తిగా కలిసిపోయేవారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజు ప్రగతి మహావిద్యాలయంలో స్నేహితులందరం కలుస్తున్నాము. కాలేజీలోనే సంబరాలను జరుపుకుంటున్నాము' అని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చదవండి : ‘వైఎస్ జగన్.. కామ్ గోయింగ్ స్టూడెంట్’ -
‘వైఎస్ జగన్.. కామ్ గోయింగ్ స్టూడెంట్’
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కామ్ గోయింగ్ స్టూడెంట్. ఆయనలో పట్టుదల చాలా ఎక్కువ. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళతారని అప్పట్లోనే అనుకునేవాళ్లం. చదువుకునే రోజుల్లో ఆయన ఎక్కువ సమయం లైబ్రరీకే కేటాయించేవారు. పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. మా పూర్వ విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావటం మాకు గర్వకారణం’ అని ఆ అధ్యాపకులు ఉప్పొంగిపోయారు. కళాశాల సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ గార్డులు సైతం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. హైదరాబాద్ నగరం హనుమాన్ టేక్డిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 1991 నుంచి 1994 వరకు బీకాం డిగ్రీ చదివారు. శ్రీ గుజరాతీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలకు దేశంలోనే రెండో కామర్స్ కళాశాలగా పేరుంది. తమ కళాశాల పూర్వ విద్యార్థి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శనివారం మిఠాయిలు పంచారు. టపాసుల మోత మోగించి సంబరాలు చేసుకున్నారు. ‘వైఎస్ జగన్ ఎంతో చురుకైన విద్యార్థి. ఎంతో బాధ్యతగా ఉండేవారు. క్రమశిక్షణతో మెలిగేవారు’ అంటూ పలువురు అధ్యాపకులు నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. అత్యధిక ఎంపీలను గెలిపించుకుని.. రాష్ట్రాన్ని దేశస్థాయిలో మూడో స్థానంలో నిలపటం ఆషామాషీ విషయం కాదు’ అని అధ్యాపకులు, సిబ్బంది వ్యాఖ్యానించారు. నాయకుడిగానూ పాస్ అయ్యారు బీకాం చదివే రోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి లైబ్రరీలో ఎక్కువగా ఉండేవారు. తన పని తాను చేసుకుంటూ మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థి. జగన్ చదివే రోజుల్లో ప్రొఫెసర్ వేదాచలం ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో 1991 బ్యాచ్ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అందులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగటం గర్వకారణం. ఆయనను అధ్యాపకుల బృందం తరఫున సత్కరించుకుంటాం. – వై.కృష్ణమోహన్ నాయుడు, ప్రిన్సిపాల్, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల మా కళాశాలకు గర్వకారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి కామ్ గోయింగ్ స్టూడెంట్. బాధ్యత గల విద్యార్థిగా ఉండేవారు. ఎంతో పట్టుదల కలిగిన విద్యార్థి. ఆయన కూడా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అప్పట్లోనే కొందరు అధ్యాపకులు మాట్లాడుకునే వారు. వాళ్ల అంచనాలు నేడు నిజమయ్యాయి. ఎన్నికైన ఎంపీల పరంగా కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంటే.. 23 ఎంపీలను గెలిపించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 3వ స్థానంలో నిలబెట్టిన గొప్ప యోధుడు. వైఎస్సార్ ఆశీర్వాదంతో సీఎంగా జగన్ ఎదిగారు. ఆయనను గుజరాతీ సమాజ్ ఆధ్వర్యంలో సత్కరించుకుంటాం. – జిగ్నేష్ దోషి, కార్యదర్శి, శ్రీ గుజరాతీ ప్రగతి సమాజ్ కార్యదర్శి -
అంతిమయాత్రలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహా విద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్ధన్‌పై సతీష్కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయడంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం ఉస్మానియాలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా... తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యం తమ య్యారు. కొద్ది సేపటి తర్వాత అంతమయాత్ర ప్రారంభమైంది. కళాశాలలోకి తోసుకెళ్లిన విద్యార్థులు... అంతిమయాత్రలో వందలాది మంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. యాత్ర ప్రగతి మహావిద్యాలయ కళాశాల వద్దకు చేరుకోగానే విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. హర్షవర్ధన్ అమర్హై... కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు కళాశాల ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. కనీసం హర్షవర్ధన్ మృతదేహాన్ని చూడటానికి కూడా కళాశాల యాజమాన్యం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు కళాశాల గేట్లను తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులను పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో విద్యార్థులు కళాశాల కిటికీ అద్దాలతో పూలకుండీలు, అక్కడ పార్క్ చేసిన ఉన్న ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని కాలేజీ వద్ద ఉంచి కొద్దిసేపు నినాదాలు చేశారు. మృతుడి బంధువులు సముదాయించడంతో విద్యార్థులు ఆందోళన విరమించి అంతిమయాత్రను కొనసాగించారు. అనంతరం పురానాపూల్ శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురి సందర్శన... హర్షవర్ధన్ కుటుంబ సభ్యులను అంతకు ముందు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రేమ్‌కుమార్‌దూత్, టీఆర్ఎస్ నాయకురాలు పడాల లలిత తదితరులు పరామర్శించారు.