Pragati Resorts
-
అ‘పూర్వ’ కలయిక
సాక్షి, హైదరాబాద్ : చదువు నేర్పిన గురులకిది మా వందనం అంటూ.. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తలచుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆనాటి మిత్రులను కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. యవ్వనంలో చేసిన అల్లర్లను.. నడి వయసులో మరో సారి గుర్తు చేసుకున్నారు. ఉన్నత శిఖరాలు, పదవులు అధిరోహించినప్పటికీ, అవన్నీ వదిలేసి మరోసారి విద్యార్థులుగా మారిపోయారు. ఆత్మీయత, అనురాగాల మధ్య ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 1968 - 69 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21 నుంచి 23 వరకూ ప్రగతి రిసార్ట్స్‌లో జరిగింది. 50 ఏళ్ల తర్వాత ఆనాటి మిత్రులను కలుసుకుంటున్న ఈ కార్యక్రమానికి కొందరు తమ జీవిత భాగస్వాములతో కలిసి హాజరయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీకి తమ వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించారు. ఈ విషయం గురించి ప్రిన్స్‌పాల్‌తో చర్చించారు. ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకునేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇక మీదట తరచుగా ఇలా మిత్రులందరూ కలుస్తుండాలని నిర్ణయించుకుని సెలవు తీసుకున్నారు. -
28న హైదరాబాద్‌లో డా. ఖాదర్ వలి ప్రసంగాలు
‘సిరిధాన్యాలు – అమృతాహారం’ అనే అంశంపై ఈ నెల 28(ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1.30 గం. వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికలో ప్రగతి రిసార్ట్స్ రజతోత్సవాల సందర్భంగా జరిగే సభలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రారంభోపన్యాసం చేస్తారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రగతి గ్రూప్ సీఎండీ డా. జీబీకే రావు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 84990 78294. అదేరోజు సా. 4 గం. నుంచి 7 గం. వరకు శిల్పారామం సంప్రదాయ వేదికలోనే డాక్టర్ ఖాదర్‌వలి దేశీ ఆహారంతో వ్యాధుల్లేని జీవనంపై ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 040–23395979. 29న మెహదీపట్నంలో.. వర్షాధారంగా సిరిధాన్యాలు సాగుచేసుకొని, మిక్సీతో శుద్ధి చేసుకొని తినటం ద్వారా ఆధునిక రోగాల నుంచి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై ఈనెల 29న సా. 5.30 గం. నుంచి 7.30 గం. వరకు హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. పిల్లర్ నం. 83 దగ్గర పల్లవి గార్డెన్స్ కొణిజేటి ఎన్‌క్లేవ్‌లో ఉచిత అవగాహన కార్యక్రమం జరుగుతుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 9676797777. -
శిరీష హత్య కేసులో కొత్తకోణం
సాక్షి, శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో జరిగిన శిరీష హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మజిద్ అనే యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సాయిప్రసాద్ స్వగ్రామమైన కొత్తూరు మండలం తిమ్మాపురం వాసిగా గుర్తించారు. మజీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సహకరించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. శిరీష, ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ను మజీద్ కారులోనే ప్రగతి రిసార్ట్స్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో మొదట సాయిప్రసాద్ మాత్రమే నిందితుడని పోలీసులు భావించారు. అయితే హత్య అనంతరం సాయిప్రసాద్ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయడంతో మజీద్ విషయం తెలిసింది. శిరీషను హత్య చేసిన అనంతరం నిందితుడు సాయి మొదటగా మజీద్‌కే ఫోన్ చేసి విషయం చెప్పినట్లు విచారణలో తేలింది. పోలీసులకు సమాచారం అందించకుండా మజీద్ అక్కడ నుంచి కారులో పారిపోయినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు. మజిద్ నుంచి ఫోర్డ్ కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిప్రసాద్, అదే మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన శిరీష(21) పరిచయస్తులు. గతంలో వీరు ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలంగా శిరీష సాయిప్రసాద్‌కు దూరంగా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిప్రసాద్ ఆమెపై ఒత్తిడి తీసుకురాగా యువతి నిరాకరించింది. దీంతో అతడు శిరీషపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని పథకం వేశాడు. గత గురువారం శంకర్పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్టులో ఆన్లైన్లో గది బుక్ చేశాడు. అయితే, పథకం ప్రకారం సాయిప్రసాద్ తనతో ఓ కత్తి తెచ్చుకున్నాడు. నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయలేదు. వారి గుర్తింపు కార్డులను సైతం చెక్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గదిలోకి వెళ్లిన తర్వాత సాయిప్రసాద్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో శిరీష నిరాకరించింది. దీంతో అతడు కత్తితో ఆమె గొంతు కోసం చంపేశాడు. నిర్వాహకులు గుర్తించేసరికి పారిపోయాడు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి అతడిని మరుసటి రోజు చిలుకూరు చౌరస్తాలో పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు. -
పెళ్లికి నిరాకరించిందని...
శంకర్పల్లి/చేవెళ్ల: తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిగా మారి యువతిని దారుణంగా పొడిచి చంపేశాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రగతి రిసార్ట్స్‌లో చోటు చేసుకుంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ స్వామి, శంకర్పల్లి సీఐ శశాంక్‌రెడ్డితో కలసి డీసీపీ పద్మజ విలేకర్లకు కేసు వివరాలు వెల్లడించారు. ప్రేమగా మారిన పరిచయం.. కొత్తురు మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పీర్లగూడెం శిరీష(21) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిప్రసాద్ ఎన్‌టీడీఎఫ్ కళాశాలలో డిప్లమా చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శిరీషకు సాయిప్రసాద్ ఇంటర్లో సీనియర్. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలియడంతో శిరీష కుటుంబీకులు గతంలో యువకుడిని హెచ్చరిం చారు. ఇటీవల వీరి మధ్య మాటలు తిరిగి మొదల య్యాయి. తనను పెళ్లి చేసుకోవాలని తరచూ సాయి ప్రసాద్ శిరీషను అడిగేవాడు. ఆమె అంగీకరించక పోవడంతో శిరీష ఇతరులతో స్నేహంగా ఉంటోందని, మాట్లాడుతోందని, అందుకే తనను నిరాకరించిందని అనుమానం పెంచుకున్నాడు. హత్యకు గురైన శిరీష పథకం ప్రకారమే.. ఈ నేపథ్యంలో తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని శిరీషను అంతం చేయాలని సాయి ప్రసాద్ నిర్ణయించుకున్నాడు. ఆమెతో ప్రేమగా ఉంటున్నట్టు నటించసాగాడు. గురువారం ఆన్లైన్ ద్వారా ప్రగతి రిసార్ట్స్‌లో కాటేజీ నంబర్ 11 బుక్ చేసిన సాయిప్రసాద్.. ఆమెను మభ్యపెట్టి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కారులో అక్కడికి తీసుకొచ్చాడు. కాటేజీలో పెళ్లి విషయంపై ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో శిరీష బాత్రూమ్కి వెళ్లగా.. అదే అదునుగా భావించిన సాయిప్రసాద్ పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో లోపలికి వెళ్లి గొంతు కోసి చంపేశాడు. కుటుంబసభ్యులకు కాల్ చేసి.. అనంతరం తన చేతిని సైతం కోసుకున్న సాయిప్రసాద్.. కుటుంబీకులకు కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. ప్రగతి రిసార్ట్స్‌లో ఉన్నట్లు చెప్పడంతో కుటుంబీకులు వెంటనే రిసార్ట్స్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అయితే, అప్పటికే సాయిప్రసాద్ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రూమ్ తెరిచి చూడగా శిరీష రక్తపు మడుగులోపడి ఉంది. ఘటనాస్థలంలో నిందితుడు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించారు. హత్య తర్వాత సాయిప్రసాద్ పారిపోవడంతో పోలీసులు మూడు టీమ్‌లుగా ఏర్పడి బాలాజీ టెంపుల్ రోడ్డు చౌరస్తాలో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. కాగా, శిరీష రిసార్ట్‌కు ఎప్పుడు వచ్చింది.. సాయిప్రసాద్‌తో పాటు మరెవరైనా ఉన్నారా అని ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే..
-
శిరీష మరొకరికి దక్కకూడదనే...
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని శిరీష కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. తనకు దక్కని శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే కోపంతోనే సాయిప్రసాద్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రెస్మీట్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘శిరీష పదో తేదీ ఉదయం 11 గంటలకు కోచింగ్‌కు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఆమె దిల్‌సుఖ్‌నగర్‌లోని టైమ్స్ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటోంది. సాయిప్రసాద్ ఆమెతో మాట్లాడాలి అని చెప్పి శంషాబాద్‌కు రావాలని ఫోన్ చేశాడు. అదే సమయంలో అతడు... ప్రగతి రిసార్ట్స్‌లో ఆన్లైన్లో కాటేజ్ బుక్ చేసి ఆమెను నేరుగా రిసార్ట్స్‌కు తీసుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిన్న శిరీషను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసాడు. బాత్రూమ్కు వెళ్లిన ఆమెపై వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు సాయిప్రసాద్ కొత్తూరులోని ఎన్‌టీడీఎఫ్ కళాశాలలో డిప్లొమా చేసి ఉద్యోగ ప్రయాత్నాలు చేస్తున్నాడు. గత అయిదేళ్లగా ప్రేమ పేరుతో శిరీష వెంట పడుతూ, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. గత రాత్రే సాయిప్రసాద్‌ను చిలుకూరు బాలజీ టెంపుల్ వద్ద ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. శిరీష, సాయిప్రసాద్ శంషాబాద్‌లో ఇంటర్మీడియెట్ ఒకే కాలేజీలో చదివారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.’ అని తెలిపారు. శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని ఆమె తెలిపారు. శిరీష హత్య కేసు వివరాలను వెల్లడించిన డీసీపీ పద్మజ చదవండి.... రిసార్ట్‌లో దారుణం: అత్యాచారం చేసి.. ఆపై గొంతుకోసి -
రేపు శంకర్‌పల్లికి సీఎం, గవర్నర్ రాక
శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్స్‌లో గురువారం జరగనున్న 18వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్ రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం సదస్సు ప్రారంభించి ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం ముగింపు సదస్సు ఉంటుంది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసిం్హన్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి, గవర్నర్ రానుండడంతో మంగళవారం అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్‌లు ప్రగతి రిసార్ట్స్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి నగరం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకుంటారని వారు చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులు రానుండడంతో కాన్ఫరెన్స్ హాల్, భోజన వసతి తదితర వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనే దాని గురించి రిసార్ట్స్ డెరైక్టర్ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు.