రేపు శంకర్‌పల్లికి సీఎం, గవర్నర్ రాక | kcr & governer come to shankarpalli tomarrow | Sakshi
Sakshi News home page

రేపు శంకర్‌పల్లికి సీఎం, గవర్నర్ రాక

Published Wed, Feb 3 2016 2:48 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రేపు శంకర్‌పల్లికి సీఎం, గవర్నర్ రాక - Sakshi

రేపు శంకర్‌పల్లికి సీఎం, గవర్నర్ రాక

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్స్‌లో గురువారం జరగనున్న 18వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్ రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం సదస్సు ప్రారంభించి ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం ముగింపు సదస్సు ఉంటుంది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసిం్హన్ పాల్గొంటారు.
 
 ముఖ్యమంత్రి, గవర్నర్ రానుండడంతో మంగళవారం అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్‌లు ప్రగతి రిసార్ట్స్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి నగరం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకుంటారని వారు చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులు రానుండడంతో కాన్ఫరెన్స్ హాల్, భోజన వసతి తదితర వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనే దాని గురించి రిసార్ట్స్ డెరైక్టర్ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement