'సామాజిక అంశాలను వెలుగులోకి తేవాలి'
విజయవాడ: వర్తమాన పరిస్థితులు- మీడియా అనే అంశం పై ప్రజాశక్తి ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ నేత ప్రకాష్ కారత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితో పాటూ పలువురు పత్రికా సంపాదకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో మీడియా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోందని ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా అన్నారు. పత్రికా వ్యవస్థలో తమకున్న స్పేచ్ఛను ఉపయోగించుకొని పాత్రికేయులు సామాజిక అంశాలను వెలుగులోకి తీసుకురావాలని కె. రామచంద్రమూర్తి సూచించారు.