ఏజీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా నియమితులైన దేశా య్ ప్రకాశ్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులోని ఏజీ చాం బర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు అభినందించారు. అ నంతరం ప్రకాశ్‌రెడ్డిని తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఘనంగా సన్మానించాయి. కార్యక్ర మంలో ఇరు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు జెల్లి కనకయ్య, చల్లా ధనంజయ, పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కె.జ్యోతిప్రసాద్, బాచిన హనుమం తరావు తదితరులు పాల్గొన్నారు.