praksam barrage
-
తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వాన
-
తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వాన
సాక్షి, అమరావతి: రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు, వర్షంగా కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకూ పెరుగుతున్న వరద ప్రవాహంతో 70 గేట్లు ఎత్తివేసినట్లు అధికారలు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో 5,29,020 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,25,854 క్యూసెక్కులు ఉంది. ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాన్స్కు 3,166 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. నేటి ఉదయం 9.00 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరద ముంపు ప్రభావిత అధికారులను జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. చంద్రర్లపాడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన లంక, పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 6,46,747, అవుట్ ఫ్లో 5,34,933 క్యూసెక్కులుగా కొనగసాగుతోంది. తెలంగాణ: హైదరాబాద్‌లో కుంభవృష్టి హైదరాబాద్‌లో చెరువులను తలపిస్తున్న పలు కాలనీలు వరద నీటిలో కొట్టుకుపోయిన కార్లు, ఆటోలు, బైక్‌లు పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణశాఖ సిబ్బంది హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపైకి భారీగా వరద నీరు హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు ఘట్కేసర్-31.9 సెం.మీ, హయత్‌నగర్- 29.1 సెం.మీ వర్షపాతం హస్తినాపురం-27.9 సెం.మీ, సరూర్‌నగర్- 26.7 సెం.మీ వర్షపాతం అబ్దుల్లాపూర్‌మెట్-26.1 సెం.మీ, కీసర- 26 సెం.మీ వర్షపాతం వలిగొండ- 25.5 సెం.మీ, ఇబ్రహీంపట్నం- 25.3 సెం.మీ వర్షపాతం ఉప్పల్- 24.8 సెం.మీ, ముషీరాబాద్- 24.5 సెం.మీ వర్షపాతం మేడిపల్లి-23.2 సెం.మీ వర్షపాతం నమోదు చార్మినార్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్‌లో 21.6 సెం.మీ వర్షపాతం శ్రీకాకుళం: జిల్లాలో పలుచోట్ల వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం సమాచార సేకరణకు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నం: 08942-240557 మెళియాపుట్టి మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న సాగరం గెడ్డ సాగరం గెడ్డలో వరద ప్రవాహానికి యువకుడు గల్లంతు వంశధార, నాగావళి నదులకు వచ్చి చేరుతున్న వరద నీరు మడ్డువలస రిజర్వాయర్‌కు భారీగా వరద ఇన్‌ఫ్లో 20,903 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 20,903 క్యూసెక్కులు తూర్పుగోదావరి: కాకినాడ నగరం జల దిగ్బంధం అయింది. పంపా, తాండవ, ఏలేరు జలాశయాల్లోకి భారీగా వరద సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయాల్లోకి భారీగా వరద లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన పంటలు విశాఖపట్నం: జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం ఎలమంచిలిలో అత్యధికంగా 15 సెం.మీ వర్షపాతం నమోదు పశ్చిమగోదావరి: తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద తమ్మిలేరు జలాశయం నుంచి 16వేల క్యూసెక్కుల నీరు విడుదల ఏలూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు వాగు తమ్మిలేరుకు పలుచోట్ల గండ్లు ఏలూరు నగరాన్ని చుట్టుముట్టిన తమ్మిలేరు వరద చాణక్యపురి, అశోక్‌నగర్, పొణంగి కాలనీల్లోకి భారీగా వరద సహాయక చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీసు సిబ్బంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు కృష్ణా: జిల్లాలో పలుచోట్ల వర్షం తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఉధృతంగా వరద నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా వరద వరదల ఉధృతితో పలు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు -
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ దుస్థితి: దేవినేని
సాక్షి, కృష్ణా: గత ప్రభుత్వం కట్టిన రిటైనింగ్ వాల్ నిరుపయోగంగా మారిందని, నిర్మాణం నాసిరకంగా కట్టడం వల్ల ఈ రోజు వాల్ ఉన్నా నీళ్లు లోపలకు వస్తున్నాయని వెఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలకు విజయవాడలో నీటమునిగిన కృష్ణలంక ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో నీటి మునిగిన 15వ డివిజన్లో పర్యటించిన దేవినేని మీడియోతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి చేరుతుందని, బ్యారేజ్ నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారని తెలిపారు. క్రమంగా వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత పాలకులు నిర్లక్ష్యంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం సగంలో ఆపేశారని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం సగంలో ఆపడం కారణంగానే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక ఎమ్యెల్యే మాటలు తప్ప ఎక్కడ చేతలు కనబడవని, రిటైనింగ్ వాల్ నిర్మాణం కచ్చితంగా ప్రభుత్వం చేసి తీరుతుందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాల్ నిర్మాణానికి డబ్బులు కేటాయించారని గుర్తు చేశారు. త్వరలోనే వాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలను వరద కష్టాల నుంచి తప్పిస్తామని తెలిపారు. సహయక చర్యల్లో కార్యకర్తలు అందరూ ప్రజలకు తోడు ఉండాలని దేవినేని కోరారు. -
చంద్రబాబు ఇంటికి ప్రమాద హెచ్చరికలు
సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్‌ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పరివాహాక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైనాయి. కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. విజయవాడ నగరంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను అధికారులు తరలిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వెంకటపాలెం వరకు కరకట్ట లోపల వైపు ఉన్న నిర్మాణాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఇంటితో సహా 36 భవనాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టిపెట్టారు. -
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి
-
ప్రకాశం బ్యారేజీ వద్ద పోట్టెత్తిన వరద
విజయవాడ: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం వరదనీరు పోట్టెత్తింది. దీంతో బ్యారేజ్‌లోని 30 గేట్లను ఉన్నతాధికారులు ఎత్తివేశారు. దీని ద్వారా 21 వేల క్యూసెక్ల నీరు కిందకి వదిలారు. నదిలో నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 12 క్యూసెక్లుగా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.