prasada raju
-
సీఎం రాకతో నర్సాపురం రూప రేఖలు మారబోతున్నాయి : ప్రసాద రాజు
-
పది రోజుల్లో ‘ఆక్వా సమస్య’ పరిష్కారం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకుల వల్లే ఆక్వా ఎగుమతులు తగ్గాయని, పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా సిండికేట్ వ్యాపారులకు కొమ్ముకాసి, రైతుల పొట్టకొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల నేతృత్వంలో ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆక్వా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చైనా, అమెరికా వంటి దేశాలకు ఎగుమతులు తగ్గడం వల్ల ఆక్వా ధరలు.. ప్రధానంగా రొయ్యల ధరలు తగ్గాయని తెలిపారు. ఈక్వెడార్ దేశంలో రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరగడమూ కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు మంత్రుల నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే ఎగుమతిదారులతో సమావేశమై మద్దతు ధర ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు రొయ్యలు, చేపలను నిల్వ చేసుకోవడానికి రూ.546 కోట్లతో పది ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆక్వా రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఆక్వా రైతులకు సీఎం జగన్ ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారని తెలిపారు. పాదయాత్ర చేసిన సందర్భంగా యూనిట్ విద్యుత్ రూ.1.50కే హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేశారని చెప్పారు. దీనివల్ల 86 శాతం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మూడేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలోనే రూ.2,377 కోట్లు ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఆక్వాకు రూ. 100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారని, ఎన్నడూ లేని రీతిలో ఆక్వా ఉత్పత్తులకు మంచి ధరలు ఇప్పించారని గుర్తు చేశారు. తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం (సీడ్), ఫీడ్ (మేత) అందించేలా చట్టాలను తెచ్చారన్నారు. ఈ చర్యల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తున్నారని వివరించారు. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. అనుమతులను సులభతరం చేయడం వల్ల ఆక్వా సాగు ఐదు లక్షల ఎకరాలకు చేరుకుందన్నారు. ఆక్వా సాగులో దేశంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎంకు దక్కిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిష్యులైన కొందరు వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆక్వా రంగాన్ని దెబ్బతీసేలా దుష్ఫ్రచారం చేస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. -
పేరుపాలెం బీచ్.. పర్యాటకం భేష్
సాక్షి, నరసాపురం: జిల్లాలో ఆహ్లాదానికి, ప్రకృతి రమణీయతకు ఆలవాలం పేరుపాలెం బీచ్.. ఏ ఇతర బీచ్‌లకు కూడా తీసిపోని కనువిందు చేసే దృశ్యాలు పేరుపాలెం సొంతం. తీరం పొడవునా కొబ్బరి చెట్లు, మతసామరస్యానికి ప్రతీకగా వివిధ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. పేరుపాలెం బీచ్ సోయగం వర్ణించడానికి మాటలు చాలవు. అయితే అనుకున్నంత ప్రచారం లేకపోవడం, మౌలిక వసతుల లేమితో ఆశించినంత అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గద్దెనెక్కిన తొలినాళ్లలోనే పర్యాటకరంగం అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో 2020 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పేరుపాలెంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి బాటలు వేయడానికి ఈ వేడుక ఉపయోగపడింది. బీచ్ అభివృద్ధికి ప్రస్తుతం వడివడిగా అడుగులు పడుతున్నాయి. కరోనా కల్లోలం లేకపోతే ఇప్పటికే బీచ్ మరింత అభివృద్ధి చెందేది. చదవండి: (కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం) వేగంగా రిసార్టుల నిర్మాణాలు పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లను అభివృద్ది చేసేందుకు ఏడాది క్రితమే ప్రయత్నాలు ప్రారంభమయ్యియి. పర్యాటకుల వసతి కోసం లగ్జరీ హోటల్ నిర్మాణానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రిసార్టులు నిర్మించారు. మరికొన్ని రిసార్టులతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపడడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల టూరిజం శాఖ రీజనల్ డైరక్టర్ తీరప్రాంతంలో పర్యటించి నిర్మాణాలకు అనువైన స్థలాలు గుర్తించారు. ఇప్పటికే పేరుపాలెం బీచ్ నుంచి కేపీపాలెం బీచ్ వరకు ఉన్న 3.5 కిలోమీటర్ల రహదారిని డబుల్ రోడ్‌గా విస్తరిస్తూ పనులు ప్రారంభించారు. రూ 8. కోట్లతో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బీచ్‌లో రిసార్ట్స్ బ్లూఫాగ్ గుర్తింపుతో మరింత అభివృద్ధి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్లూఫాగ్ బృందం తీరంలో పర్యటించింది. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ బీచ్ అనుకూలంగా ఉందని బృందం నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లూఫాగ్ సర్టిఫికేషన్‌పై దృష్టిపెట్టింది. చదవండి: (దేశంలో మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు) అప్పుడు వైఎస్..ఇప్పుడు జగన్ బీచ్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణం. 2004 సునామీ తరువాత బాధితుల కోసం తీరంలో ఇళ్లు నిర్మించారు. 2007లో వాటిని ప్రారంభించడానికి వచ్చిన వైఎస్ పేరుపాలెం బీచ్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. అప్పుడు బీచ్ అభివృద్ధి ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే ముదునూరి ద్వారా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు బీచ్ అభివృద్ధికి రూ 2.80 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో రివిట్‌మెంట్‌తో కలిపి రోడ్డు వేశారు. గెస్ట్‌హౌస్ నిర్మించారు. అప్పటి నుంచి బీచ్‌కు జనం రాకపోకలు పెరిగాయి. రిసార్టుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 10 ఏళ్లలో పాలకులు బీచ్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీచ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో రూపురేఖలు మారిపోతాయి గతేడాది బీచ్ ఫెస్టివల్ పేరుపాలెంలో జరగడం ముందడుగుగా భావించాలి. ముఖ్యమంత్రి బీచ్ అభివృద్ధికి సహకరిస్తున్నారు. భవిష్యత్‌లో బీచ్ రూపురేఖలు పూర్తిగా మారుస్తాం. కరోనా వల్ల అభివృద్ధి పనులకు కొంత ఆటకం కలిగింది. త్వరలో హోటల్స్, రిసార్ట్స్ నిర్మాణాలు చేపడతాం. -ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే -
అధిష్టానం చేతిలో సబ్బం కీలుబొమ్మ
నర్సాపురం : ఎంపీ సబ్బం హరివి ఊసరవెల్లి రాజకీయాలని వైఎస్ఆర్ సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా మారిన ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని శుక్రవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో ఆయన పావుగా ఉపయోగపడుతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారని ప్రసాదరాజు అన్నారు.