పార్టీని ఓడించడానికి ప్రయత్నించారు...
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. సీనియర్ల నాయకుల మాటల యుద్ధం తారాస్థాయి చేరుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఓడించడానికి ప్రయత్నించారంటూ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్
లపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ఆప్. బాధ్యులు తప్ప ఇంకెవ్వరూ పార్టీ వ్యవహారాలపై మాట్లాడకూడదని నిర్ణయించిన తరువాత కూడా యాదవ్, భూషణ్ మీడియాతో మాట్లాడి, జనంలో గందరగోళానికి కారణమయ్యారని ఆప్ లీడర్ అశుతోష్ తెలిపారు. దీన్ని నిబంధనల అతిక్రమణగా పార్టీ భావిస్తోందని ఆయన తెలిపారు. అందుకే వారినైజాన్ని బహిర్గతం చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజలకు వెల్లడించడం మా బాధ్యతని అశుతోష్ పేర్కొన్నారు. మార్చ్ 4 న జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో యోగేంద్ర , ప్రశాంత్ భూషణలను పార్టీ (పీఎసీ )రాజకీయ వ్యవహారాల కమిటీనుంచి తొలగించిన సంగతి తెలిసిందే.
,