prathi pati pulla rao
-
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు షాక్!
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యడవల్లి సొసైటీని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్ అథారిటీ తీర్పునిచ్చింది. కాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 381లో 416 ఎకరాల భూమి ఉంది. దీనిని 1975లో 250 మంది పేదలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో ఆ భూమిలో 2వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉందంటూ.. దాన్ని కాజేయటానికి పుల్లారావు.. భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు తెలియకుండా వారి సొసైటీని రద్దు చేయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. పేదల తరపున రివిజన్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో యడవల్లి సొసైటీ రద్దు కరెక్టు కాదని, దాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్ అథారిటీ గురువారం తీర్పునిచ్చింది. ఈ విషయం గురించి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రత్తిపాటి పుల్లారావుకు చెంపపెట్టు. పేదల భూములను లాక్కోవాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగింది’’ అని పేర్కొన్నారు. (చదవండి: బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..) అప్పట్లో మంత్రిగా చక్రం తిప్పిన ప్రత్తిపాటి పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ పరిశ్రమ స్థాపించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి పావులు కదిపారు. తన చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే వ్యవహారాన్ని నడిపించారు. దళితులు సాగుచేస్తున్న భూముల్లో ఏ మేరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించి సర్వే చేయించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఆ భూమిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నందున సాగుకు యోగ్యమైనది కాదని వ్యవసాయ శాఖ, ఆ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని సహకార శాఖ, ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్ శాఖ, గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న భూమిని పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు దళితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చేలా చేశారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు. -
టీడీపీది నీచ రాజకీయాలు!
-
టీడీపీ నేతల బండారం బట్టబయలు
సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అక్కడి స్థానికులు బట్టబయలు చేశారు. టీడీపీ హయాంలోనే తమపై అనేక దాడులు జరిగాయని, పార్టీ మారనందుకు తమపై అనేక అక్రమల కేసులను పెట్టారని టీడీపీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బుధవారం ఛలో ఆత్మకూరుకు టీడీపీ నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పల్నాడులో ప్రశాంతంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే దీనిపై అక్కడి స్థానికులు నమ్మలేని నిజాలను వెల్లడించారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో చిత్రహింసలకు గురైన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు అధికారంలో ఉన్నంత కాలం మమ్మల్ని తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆయన చెప్పినట్టు వినకపోతే పోలీసులతో వార్నింగ్ ఇప్పించేవారు. కేసులు పెట్టించి థర్డ్ డిగ్రీ ప్రయోగించేవారు. టీడీపీ నేతల అరాచకాలు మాటల్లో చెప్పలేనివి. 2013లో టీడీపీ అభ్యర్థిపై పోటీచేసి సర్పంచ్‌గా గెలిచాను. దీంతో నాపై కక్షకట్టి వివిధ కేసుల్లో ఇరికించి. రూ. రెండుకోట్లు వసూలు చేశారు. పంచాయతీకి కనీసం నిధులు కూడా ఇవ్వలేదు. ఐదేళ్ల తరువాత ఎన్నికల ముందు నిధులు ఇస్తాం. టీడీపీలో చేరండి అంటూ ఒత్తిడి తెచ్చారు. వందకోట్లు ఇచ్చినా పార్టీ మారనని చెప్పా’ అని ఓ బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: పల్నాడులో టీడీపీ నీచ రాజకీయాలు! టీడీపీ అరాచకాలపై మరో వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను తొలి నుంచి వైఎస్సార్సీపీలోనే ఉన్నా. పార్టీ మారనని తెలిసి అనేక కేసుల్లో ఇరికించారు. పుల్లారావు మంత్రి అయిన తరువాత వేధింపులు మరింత ఎక్కువైయ్యాయి. టీడీపీలో చేరనందుకు నా షాపుని అర్థరాత్రి అక్రమంగా కూల్చివేశారు’ అని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో సిగ్గుమాలిన పనులు చేసినందుకు గత ఎన్నికల్లో ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారని ఓ బాధితుడు అభిప్రాయపడ్డాడు. తాను తొలుత టీడీపీలోనే ఉన్నానని, తరువాత వైఎస్సార్సీపీ చేరినట్లు తెలిపారు. టీడీపీలో ఉన్నంతకాలం తనపై ఎలాంటి కేసులు లేవని.. వైఎస్సార్సీపీలో చేరినందుకు అనేక కేసులతో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడేదిలేదని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయని తెలిపారు. -
మంత్రి ప్రత్తిపాటి అండతో పేకాట క్లబ్‌లు
చిలకలూరిపేట టౌన్: జిల్లాలోని చిలకలూరిపేటలో పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కోతముక్క నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ ఆరోపించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దల కాలక్షేపం కోసం నిర్మించిన సీఆర్ రిక్రియేషన్ క్లబ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి, గురజాల క్లబ్‌లను మూయించి, పేటలో పేకాట నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు రూ.2 కోట్లకుపైగా కోత ముక్కాటలో చేతులు మారుతున్నాయని, దీంతో క్లబ్‌కి రూ.2 లక్షలకుపైగా ఆదాయం లభిస్తుందని తెలిపారు. నల్లధనానని తెల్లధనంగా మార్చుకునేందుకు మంత్రి స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్లబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవల పేరుతో దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. గతంలో కరెంట్ బిల్లు చెల్లిండానికే క్లబ్‌కి ఆదాయం ఉండేది కాదని, నేడు ఏటా రూ.10 కోట్ల విరాళాలు ఇచ్చేలా అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారనివిమర్శించారు. మద్యం దుకాణాలు, జాదం నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో వైద్య శిబిరాలు, ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఇక్కడకు చేరుకుంటున్న జాదరులు మంత్రి అండతో యథేచ్ఛగా ఆడుతున్నారని పేచర్కొన్నారు. క్లబ్ ఆదాయ వనరులు, వాటి వివరాల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీఎం సుభాని ఉన్నారు. -
రైతులకు ఉచితంగా రిమోట్ పంపుసెట్లు
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతులకు రిమోట్ ఆపరేట్ సిస్టమ్‌తో కూడిన పంపుసెట్లను ఉచితంగా అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి నారాయణతో కలసి ఆయన మాట్లాడారు. 15లక్షల మంది రైతులకు గాను మొదటి దశలో 2 లక్షల మందికి వీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్ల పాటు ఈ పంపుసెట్ల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వీటి వినియోగంతో రైతులకు 400 మిలియన్ యూనిట్ల కరెంట్ ఆదా అయ్యే అవకాశముందన్నారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వచ్చే నెల 7న విజయవాడలోని హోటల్ తాజ్ గేట్‌వేలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.