pratyusha Father
-
'ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్‌ను ఉరితీయాలి'
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ఉరితీయాలని ఆమె తండ్రి శంకర్ బెనర్జీ డిమాండ్ చేశాడు. 'రాహుల్ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెకు న్యాయం జరగాలి. రాహుల్‌కు ఉరి వేయాలి లేదా జీవితాంతం జైల్లో పెట్టాలి' అని శంకర్ చెప్పాడు. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యూష మృతిపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు రాహుల్‌పై కేసు నమోదు చేసి విచారించారు. మంగళవారం ముంబైలోని గుర్ద్వారాలో ప్రత్యూషకు సంతాపసభ ఏర్పాటు చేశారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ప్రత్యూష తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. 'ప్రత్యూష మరణించాక మేం మీడియా ముందుకు రాలేదు. చేయాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యేంతవరకు మాట్లాడకూడదని భావించాం. మేం మా కూతుర్ని కోల్పోయాం. ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాం' అని ప్రత్యూష తండ్రి చెప్పాడు. రాహుల్‌ను కఠినంగా శిక్షించాలని ప్రత్యూష తల్లి, స్నేహితులు డిమాండ్ చేశారు. -
ఊపిరాడకే ప్రత్యూష మృతి
ముంబై: శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ‘బాలికా వధు’ ఫేం నటి ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైంది. గొంతుబిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని తేలింది. కాగా, ప్రత్యూష అంత్యక్రియలు శనివారం ముంబైలో నిర్వహించారు. బుల్లితెర నటులు పలువురు హాజరై కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌ను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ప్రత్యూష సెల్ నుంచి వెళ్లిన చివరి కాల్స్, వీరి మధ్య జరిగిన సందేశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అయితే.. ప్రత్యూష తన వివాహానికి దుస్తుల్ని డిజైన్ చేయమని కాస్ట్యూమ్ డిజైనర్ అయిన స్నేహితుడు రోహిత్‌ను అడిగినట్లు తెలుస్తోంది. -
'ప్రత్యూష జీవితాన్ని సర్వనాశనం చేశాడు'
ముంబై: రాహుల్ రాజ్‌సింగ్ తన కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడని బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురు ప్రశాంతంగా ఉండేదని, రాహుల్ సింగ్ వచ్చాక హింసకు గురైందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాహుల్‌ను వదిలిపెట్టేది లేదని అన్నాడు. ప్రత్యూష బెనర్జీ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నానని ఆమె సోదరి రిషిత ఆవేదన వ్యక్తం చేసింది. 'ఆ సమయంలో నేను టూషన్ క్లాస్‌లో ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చాక, అందరూ ఏడుస్తున్నారు. నా సోదరి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. ఆమె ఈ పని చేసుండదు' అని రిషిత చెప్పింది. -
ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టు
* రిమాండ్‌కు తరలింపు * నిర్భయ చట్టం కింద కేసు హైదరాబాద్: కన్న కూతురు తన సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురవుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించిన ప్రత్యూష తండ్రి చిప్పర రమేష్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలిం చారు. ఆయనపై నిర్భయ కేసు, గృహ నిర్బం ధం, వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో సవతి తల్లి చేతిలో చిత్ర హింసకు గురవుతున్న ప్రత్యూషను ఈ నెల 9న పోలీసులు విముక్తి కలిగించిన విషయం విదితమే. వేధింపులకు గురిచేసిన సవతి తల్లి చాముండేశ్వరిని ఆరోజే అరెస్టుచేసి రిమాండుకు పంపగా , ఈ సంఘటన జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న ఆమె తండ్రి రమేష్ గురువారం పోలీసులకు చిక్కాడు. అతను బోయిన్పల్లి ఎక్స్‌రోడ్డులో బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కుమార్తె చిత్రహింసలపై అతడిని పోలీసులు ప్రశ్నించగా తన మానసిక పరిస్థితి సరిగా లేదని పేర్కొన్నాడు.ఈ ఘటనలో ప్రత్యూష మేనమామ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమేష్‌కుమార్‌ను కస్టడీకి తీసుకుని పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. నిందితుడిని చూసిన స్థానికులు ఆగ్రహంతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రత్యూషను పరామర్శించిన హైకోర్టు ప్రధాన అధికారి అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను హైకోర్టు ప్రత్యేక అధికారి ఎస్.శరత్‌కుమార్ పరామర్శించారు. ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరించి రికార్డు చేశారు. ప్రత్యూష స్థితిగతులను స్వయంగా సమీక్షి ంచాలని హైకోర్టు సీజే ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు గురువారం ఉదయం ఆయన ఆస్పత్రికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
ప్రత్యూష తండ్రి అరెస్ట్